Telugu News

డిజిటల్ అరెస్ట్ అలర్ట్..! జర జాగ్రత్త..

ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరాలు కూడా అలానే పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల విధానాల్లో ప్రజలను మోసం చేసి, అందినకాడికి దోచుకుంటున్నారు. ఒకే ఒక్క వీడియో కాల్ భయనానికి గురిచేస్తుంది. మీరు అరస్టు కాబోతున్నారు. అని అన్న మాటలు ఆందోళనకు భయపెడుతున్నాయి. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. 

నిజానికి ఇది ఒక సైబర్ మోసం. దాని పేరు డిజిటల్ అరెస్ట్. సాధారణంగా ఇది ఎలా జరుగుతుందంటే.. మీ పేరు మీద డ్రగ్స్, తప్పుడు పాస్‌‌పోర్టులు, నిషేధిత వస్తువులు వచ్చినట్టుగా చెబుతారు. ఒకవేళ మీరు అసలు మనం అలాంటివి ఆర్డర్ చేయలేదు అని వారితో చెప్పినా వినరు. లేదు మీ పేరు మీదనే వచ్చింది కాబట్టి దీనికి మీరే బాధ్యత వహించాలని అంటారు. చట్టపరంగా చిక్కుల్లో పడతారని మీకు చెబుతారు. ఈ విషయాన్ని మీరు నమ్మేలా చేస్తారు. కేసు డీల్ చేసి సెటిల్మెంట్ చేసేందుకు డబ్బులు అడుగుతారు. దీంతో భయంతో వారు ఎంత డబ్బు డిమాండ్ డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది.

ఈ డిజిటల్ అరెస్ట్‌లో పడి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనదేశంలోనూ కూడా ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు పెరిగిపోతున్నాయి. మాయ మాటలతో మీపై కేసు నమోదైందని, భయపెడుతూ డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. 

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం కేవలం ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ‘డిజిటల్ అరెస్ట్’ స్కాంలతో నేరగాళ్లు దాదాపు 120 కోట్లను దోచుకున్నారంటే పరిస్థితి ఎంత దారునంగా ఉందో మనకు అర్థం అవుతుంది. ట్రేడింగ్, పెట్టుబడులు, డేటింగ్ యాప్ వంటి మోసాలన్నీ కలిపితే ఆ మొత్తం రూ.1,776 కోట్లు వరకు ఉంటుందని తేలింది. సైబర్ నేరగాళ్లలో 46శాతం మంది మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందినవారేనని నివేదికలో వెల్లడించారు.

Show More
Back to top button