Telugu News

ప్రపంచ జనాభా అధికంగా మాట్లాడే 3వ భాష హిందీ

హిందీ భాష ఒక్క హిందుస్థాన్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా 610 మిలియన్ల ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ (1,456 మిలియన్లు)‌, మాండరిన్‌ చైనీస్(‌1,138 మిలియన్లు) తర్వాత అటుకులు మాట్లాడే ‘ప్రపంచ భాష’గా హిందీకి ప్రత్యేకత ఉన్నది. హిందీ భాష వ్యాప్తిలో సినిమా పాత్ర వెలకట్టలేనిది. ప్రపంచంలోనే అతి పెద్ద బాలీవుడ్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ విడుదల చేస్తున్న హిందీ సినిమాలతో ప్రపంచ దేశాలన్నింటిలో హిందీ విస్తృత ప్రచారం, ఆదరణ, మక్కువ క్రమంగా పెరుగుతున్నది. తొలిసారిగా 10 జనవరి 1975న హిందీ భాష ప్రాధాన్యం, మాధుర్యాలు, భాషాభిమానాల ఏకీకరణ, ప్రముఖ రచయితల ప్రస్తావనల లక్ష్యాలతో కూడిన “ప్రపంచ హిందీ మహాసభలు” పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించారు. ఈ రోజుకు గుర్తుగా 2006 నుంచి ప్రతి ఏట 10 జనవరిన “ప్రపంచ హిందీ దినోత్సవం లేదా విశ్వ హిందీ దివస్‌” నిర్వహించుతోవడం ఆనవాయితీగా మారింది.

విశ్వ ఐక్యత, సాంస్కృతిక సమీకరణకు హిందీ భాష:

ప్రపంచ హిందీ దినం సందర్భంగా హిందీ భాష మాట్లాడడం, రచనలు, సాహిత్యం, హిందీ భాషను మాట్లాడే ప్రపంచ మానవాళిని ఏకం చేయడం, సంస్కృతులను ప్రచారం చేయడానికి ఈ వేదికలను ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ వేదికల్లో హిందీ భాషకు పట్టం కట్టడం, సాహిత్య వారసత్వాల పరిరక్షణ,విద్యాలయాల్లో హిందూ భాష బోధనలను ప్రోత్సహించడం, హిందీ భాషకు అందాన్ని ఆదరణను తీసుకువచ్చిన సాహితీవేత్తలను సముచితంగా గౌరవించడం ఈ వేదికలో విధిగా జరగాలి. ప్రపంచ హిందీ దినం-2025 థీమ్‌గా “ఏకత, సాంస్కృతిక ఆత్మగౌరవ ప్రపంచ గొంతుక-హిందీ” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. డిజిటల్‌ అంతర్జాల సాంకేతిక ప్రపంచ ఏకీకరణలో హిందీ కూడా ప్రధాన భూమిక నిర్వహించే విధంగా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని భాషాభిమానులు కోరుకుంటున్నారు. 

యూరోపియన్‌ భాషలతో హిందీకి సారూప్యతలు:

సంస్కృత భాష నుండి జనించిన ఇండో-ఆర్యన్‌ భాషగానే కాకుండా ఇండో-యూరోపియన్‌ భాషగా కూడా హిందీ పేరుంది. ఈ కారణంగానే యూరోపియన్‌ భాషలతో, ముఖ్యంగా ఆంగ్ల భాషతో హిందీకి పలు సారూప్యతలు కనిపిస్తాయి. భారత దేశంలో అధికారిక భాషగా హిందీకి ప్రత్యేక స్థానం ఇవ్వబడింది మన దేశంలో 345 మిలియన్ల ప్రజలు హిందీ మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 610 మిలియన్ల జనులు హిందీ భాషలో సంభాషిస్తున్నారు. ఆసియా ఖండంలో అధిక జనులు హిందీ మాట్లాడుతుండగా దక్షిణ ఆఫ్రికా, అమెరికా, ఫిజీ, మారిషస్‌, బంగ్లాదేశ్‌, యెమన్‌, ఉగాండా లాంటి దేశాల్లో కూడా భాష పోషణ కనిపిస్తుంది.

నేడు మేధో వలసలు పెరగడంతో ప్రపంచ దేశాలకు కూడా హిందీ విస్తరించడా క్రమంగా పెరుగుతున్నది. దేవనగరి లిపిలో ప్రకటించే హిందీకి మృదు భాషగా కీర్తి ఉన్నది. ఉత్తర భారతంలోని రాష్ట్రాల ప్రజలు హిందీ భాషను అధికంగా వినియోగిస్తున్నారు. 14 సెప్టెంబర్‌ 1949 రోజున హిందీని అధికారిక భారత భాషగా తీర్మానించిన కారణంగా 14 సెప్టెంబర్‌ రోజున “జాతీయ హిందీ దినం” కూడా ప్రతి ఏట నిర్వహించుకుంటున్నామని మరిచి పోరాదు. 

హిందీ భాషను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం, హిందీ భాష సంస్కృతులను కాపాడడం, విద్యాపరంగా ప్రోత్సహించడం, భాషను కాపాడుకోవడం, సాంస్కృతిక వినియమ మాద్యమాల, అంతర్జాతీయ ఏకీకరణ సాధనంగా వినియోగించానికి ప్రతి ఒక్క భాషాభిమానం కృషి చేయాలి. ప్రపంచ హిందీ దినం రోజున సాహితీ కార్యక్రమాలు, హిందీ భాష ఆధార పోటీలు, విద్యాబోధనలు, సాంస్కృతిక వేడుకలు, ప్రచార మాద్యమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించే వేదికగా ఉపయోగపడాలి. 

Show More
Back to top button