
జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ అందుబాటులో ఉండనుంది. ఇందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇటీవల వెల్లడించారు.
ఒకచోట నుంచి మరో చోటుకు టికెట్ కావాలని నోటితో చెబితే ఆయా టికెట్ బుక్ చేస్తుంది. నంబర్ చెబితే కరెంట్ బిల్లు కట్టేస్తుంది. అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుతాయని ఆయన వివరించారు.
ఇకపోతే పబ్లిక్ పరీక్షా ఫలితాలు విడుదలైన వెంటనే.. వాటిని వాట్సప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు.
శాసనసభలో వాట్సప్ గవర్నెన్స్ పై జరిగిన చర్చకు మంత్రి.. ‘ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి అంటూ బదులిచ్చారు.
ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం!
కాగా జనవరి 30 నుంచి 155 సేవలతో వాట్సప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం 300 రకాల సేవలు అందుతున్నాయి. మార్చి నెలాఖరుకు 300, జూన్ 30 కల్లా 500 సేవలను అందిస్తాం. పౌరులు అడిగిన ఏ సేవను అయినా 10 సెకన్లలో అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఆయన తెలిపారు.
జనవరి 30 నుంచి వివిధ శాఖల పరిధిలో 1.23 కోట్ల లావాదేవీలు జరగ్గా.. అందులో వాట్సప్ ద్వారా చేసినవి 51 లక్షలు ఉన్నాయి. దీన్నిబట్టి వాట్సప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంతగా చేరువైందో చెప్పేందుకు ఇదే నిదర్శనం!
విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా హాల్ టికెట్లు పొందారు. రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. సర్టిఫికేట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటయ్యేలా త్వరలో చట్టసవరణ చేస్తాం. కేంద్ర ఐటీ చట్టం ప్రకారం ఫిజికల్ పత్రాల్లాగే ఇకపై ఎలక్ట్రానిక్ పత్రాలూ చెల్లుబాటవుతాయి. క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరణకు వచ్చే శాసనసభ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించే బిల్లు తెస్తామని లోకేశ్ చెప్పారు.
సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని, చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తోందని పాదయాత్ర సమయంలో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇబ్బందులు తీర్చడానికే వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించామని లోకేశ్ పేర్కొన్నారు.
వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రైతులకు మెరుగైన సేవలందించాలని, రెవెన్యూలో బ్లాక్బైన్ ఆధారిత విధానాలు అమలు చేయాలని, ప్రమాదాలు జరిగిన సమయంలోనూ లొకేషన్ షేరింగ్ అవకాశం కూడా ఇందులో ఉండాలని, గ్రామాల్లో సమస్యలు, పాఠశాలల్లో ఇబ్బందులు చెప్పే విధానం అమలు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యల కోసం వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేయాలని, కేంద్ర పథకాల సేవలను కూడా దీనిలో అందించాలని పలు ఎమ్మెల్యేలు సూచించారు.
అయితే పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కొందరు పేటీఎం బ్యాచ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయి. వాట్సప్ గవర్నెన్స్ లో ఎక్కడైనా హ్యాకింగ్ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తామని సవాల్ చేశారు. ఎవరూ స్పందించలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ వాడరు. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక ఫోన్ కొని అందులో వాట్సప్ గవర్నెన్స్ ను డౌన్లోడ్ చేసి పంపిస్తే.. అప్పుడైనా నేర్చుకుంటారేమోనని లోకేశ్ ఎద్దేవా చేశారు.