
ఆఫీసుల్లో, ఇళ్లలో కొంత మంది కుర్చీలకు అంటి పెట్టుకున్నట్లు కూర్చుంటారు. అంతే కాదు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోతుంటారు. మీరు కూడా గంటల తరబడి ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కూర్చుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు గంటల తరబడి కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికినట్లే..! అసలు ఎక్కువగా కూర్చొని పని చేయడం వల్ల ఏం సమస్యలు వస్తున్నాయి? అధ్యయానాలు ఏం చెబుతున్నాయి? వంటి విషయాలు తెలుసుకుందాం.
ఇలా ఎక్కువ సేపు కూర్చున్నట్లయితే.. గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోకునే అవకాశం ఉంది. ఈ విషయం పలు అధ్యయానాల్లో కూడా తెలింది. వీటితోపాటు ఇలా ఎక్కువగా కూర్చునే వారిలో మెదడు, కాలేయం, కిడ్నీలపైన ప్రభావం పడి.. పనితీరు మందగిస్తుందని తెలింది.
అంతేకాకుండా ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం వల్ల కండరాల్లో కదలికలు లేకుండా పోతుంది. ఫలితంగా తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి.. శరీరంలో అక్కడక్కడ పేరుకుపోయి స్థూలకాయం బారిన పడే అవకాశం ఉంది.
కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిపోయి.. రక్త నాళాల్లో ఒత్తిడి పెరిగుతోంది. ఫలితంగా రక్త నాళాలు వ్యాకోచించి ఉబ్బిపోతాయి. దీంతో వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది.
ఇక ఇలా ఒకే దగ్గర కూర్చుని ఉండడం వల్ల వెన్ను కండరాలపై ఒత్తిడి తీవ్రంగా పడి.. మెడ, వెన్నుపూస ఒత్తిడికి గురై పాడైపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చోని ఉండడం వల్ల షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.
ప్రతిరోజు యావరేజ్‌గా 7-8వేల అడుగులు వేయాలి.
పని ప్రదేశంలో ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా ప్రతి గంటకు కనీసం 3 నిమిషాల పాటు అటు ఇటూ నడవాలి. నిత్యం నడక, వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు పాటించాలి.