HEALTH & LIFESTYLE

టైప్-2 డయాబెటిస్‌‌ నివారించుకోండిలా.!

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు వస్తున్నాయి. అందులో టైప్-2 డయాబెటిస్‌‌ ఒకటి. అయితే, ఒకసారి డయాబెటిస్‌‌ వచ్చిందంటే పోగొట్టుకోవడం దాదాపు అసాధ్యం. కానీ, కొంత కష్టపడితే ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలకతో టైప్-2 డయాబెటిస్‌‌ని తగ్గించుకోవచ్చు.

* కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తగ్గించుకోవాలి. ఉదాహరణకు వైట్ రైస్, తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారం (Biscuits, Chips, Fast Food).

*ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతోపాటు నట్స్, డ్రై ఫ్రూట్స్ మీ డైట్‌లో చేర్చుకోవాలి. 

* మంచి కొవ్వులు, ప్రోటీన్లు అందించే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా మసాలాలు తక్కువగా తీసుకోవాలి. 

* శరీరానికి తగినంత శ్రమ ఇవ్వాలి. వ్యాయామం చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించుకోవచ్చు. ఇలా ఒకరోజు లేదా వారం చేస్తే సరిపోదు. దీర్ఘకాలం చేస్తూ పోతే తప్పకుండా ఫలితం ఉంటుంది.

Show More
Back to top button