HEALTH & LIFESTYLE

రక్తహీనతతో బాధపడుతున్నారా? ఇవి తింటే సరిపోతుంది

అయ్యో! నడిచేంత బలమూ లేదు, మెట్లు ఎక్కలేక పోతున్నా!” అని అనుకుంటున్నారా? అయితే, మీ రక్తంలో ఐరన్ స్థాయులు తగ్గిపోయి ఉండొచ్చు! అవును అండీ.. ఇటీవలి కాలంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలి కారణంగా చాలామందిలో రక్త హీనత సమస్య కన్పిస్తోంది. దీనినే ఎనీమియా అంటారు. ఇది కాస్తా ఇతర సమస్యలకు దారి తీస్తుంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు కూడా. మరి, దీనికి పరిష్కారం ఏంటీ? దీనికి ప్రత్యేకమైన డైట్ ఏమన్నా ఉందా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సింపుల్‌గా చెప్పాలంటే శరీరంలో తగినంత ఎర్ర రక్తకణాలు (Red Blood Cells) లేకపోవడం వల్ల కలిగే పరిస్థితే ఎనిమియా అంటారు. ఈ ఎర్ర రక్తకణాల్లో ఉన్న హిమోగ్లోబిన్ (Hemoglobin) అనే పదార్థం మన శరీర భాగాలకి ఆక్సిజన్ తరలించే పని చేస్తుంది. ఒక వేళ మన శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువైతే? ఊపిరి తీసుకోడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఈ సమస్య ఎక్కువగా చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, గర్భిణీ మహిళలు, సాధారణ మహిళల్లో కన్పిస్తుంటుంది. 

కాబట్టి ఈ ఎనీమియా సమస్యకు గురి కాకుండా ఉండాలంటే.. ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం.

మొదటిది

* బీట్‌రూట్ శక్తివంతమైన ఐరన్-రిచ్ లెగ్యూమ్. ఇందులో ఇనుముతో పాటు ఫోలేట్ మరియు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సులభంగా పెరుగుతుంది.

రెండోవది

రెండోది రెడ్ రాజ్మా. ఇందులో ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి. ఐరన్ లోపం సరి చేసే బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్ ఇదే. రాజ్మాను ఎక్కువగా చపాతీలో కూరగా తీసుకుంటారు. 

మూడోవది

ప్రతి కిచెన్‌లో తప్పకుండా ఉండే బెల్లం ఐరన్ లోపం సరిచేసేందుకు చాలా బాగా పనిచేస్తుంది. టీతో లేదా అల్పాహారంతో తీసుకోవచ్చు. 

Show More
Back to top button