Telugu NewsTelugu Special Stories

కంచకు చేరని గచ్చిబౌలి కథ..?!

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇటీవల విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టగా.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా?అనే విషయం స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్‌ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ తెలిపారు. 

అయితే తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని.. దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్‌ క్యూరీ చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్‌ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 

1996 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏ మాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు.

రూ.10వేల కోట్లకు మార్టిగేజ్‌ చేశారని సీఈసీ నివేదికలో చెప్పిందని అమికస్‌ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూములను మార్టిగేజ్‌ చేశారా.. అమ్ముకున్నారా? అనేది తమకు అనవసరమని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తెలిపారు. 

చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా? లేదా? అనేది మాత్రమే ముఖ్యమని చెప్పారు. 2004 నుంచి ఈ భూముల వ్యవహారం, కోర్టుల్లో ఉన్న పరిస్థితి.. ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి తదితర వివరాలను అభిషేక్ మను సింఘ్వీ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్‌ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. అయితే దీనంతటికీ కారణమైన పరిణామాల గురుంచి మనం ఇప్పుడు చూద్దాం..

ప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ హెచ్ సీయూలో ఉన్నట్టుండి అలజడి పుట్టింది.. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై అనుకొని వివాదం చెలరేగింది. స్టూడెంట్స్ అంతా ఒక్కటై ప్రొటెస్ట్ చేస్తున్నారు. స్టూడెంట్ యూనియన్ లు, విపక్ష పార్టీలు.. ప్రజలు.. వీరికి సపోర్ట్ ఇవ్వడంతో.. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

అసలు విద్యార్థుల నిరసనలకు కారణమేంటి?  ప్రభుత్వం వాదనేంటి? వర్సిటీ వర్గాలు ఏమంటున్నాయ్? అనే వివరాలు ఏ టు జెడ్ ఇప్పుడు చూద్దాం..

అది మార్చి 30.. టైం.. మిడ్ నైట్..

మూగజీవాలు అదే పనిగా ఏడుస్తున్నాయి.. వందలకొద్దీ జేసీబీలు.. తమ ఇళ్లను, ఆవాసాలను కూల్చేస్తుంటే ఎటు వెళ్ళాలో తెలియక తికమకపడుతూ ఏడుస్తున్నాయి.. 

పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా.. మూగజీవాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న.. ఒక వీడియో తెల్లారేసరికి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. 

చుట్టూ పచ్చదనం.. వందలాది జంతువులు.. ఎన్నో ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నాయి.

మన హైదరాబాద్ అంతటికీ స్వచ్ఛమైన ఆక్సిజన్ ను సప్లయి చేస్తున్న గొప్ప బయోడైవర్సిటీ కలిగిన ప్రాంతం అది.

అదే కంచ గచ్చిబౌలి.. 

నేడు ఎటు చూసినా.. ఇదే ఇష్యూ గురుంచి మాట్లాడుతున్నారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే దీని చుట్టూ హెచ్‌సీయూ భూముల వివాదం నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. అందులో చదువుతున్న విద్యార్థులు.. పర్యావరణవేత్తలు.. పబ్లిక్.. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి తిరుగుతున్న అన్ సాల్వ్డ్ సమస్యగా మారింది. ఇది ఈరోజుది కాదు.. కొన్నేళ్లుగా సాగుతున్న ఇష్యూ..

హెచ్ సీయూ.. మన దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1975లో యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఇలా కేటాయించిన భూమి యూనివర్సిటీ పేరున రిజిస్టర్ కాలేదు. ప్రస్తుతం, తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని ఐటీ పార్క్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలనుకుంటుంది. 

మన హైదరాబాద్ సిటీ డెవలప్ అవ్వాలంటే అభివృద్ధి జరగాలి కానీ ఇలా ఎకాలజీ మొత్తం ఏర్పడిన భూమిని, చెట్లను, అక్కడి జీవుల్ని కూల్చేసి.. కట్టే డెవలప్మెంట్ మనకు అవసరమా..? అంటూ ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎకాలజీని డిస్టర్బ్ చేస్తే మేము ఊరుకునేది లేదు అంటూ ఫైట్ చేస్తున్నారు. క్లాసెస్ ను బైకాట్ చేసి, హెచ్ సీయూ భూమిని యూనివర్సిటీ పేరున నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణవేత్తలు, కామన్ పీపుల్ సైతం తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. ఈ భూమి పర్యావరణ పరిరక్షణకు ఎంతో ముఖ్యం. అలాగే అనేక స్పీసెస్ కు నివాసంగా ఉందని అంటున్నారు.

ఇకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే.. రేవంత్ రెడ్డి సర్కారు.. 2024 జూన్ లో ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే.. హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చే భూమి ఏదైతే ఉందో అందులో 400 ఎకరాలను లేఔట్లు వేసి డెవలప్మెంటల్ పర్పస్ లో ఐటీకి, అకడమిక్ అండ్ నాన్ అకాడమిక్ పర్పస్ లో ఐటీ హబ్స్ కి ప్రైవేట్ గా అమ్మాలి అనుకుంది.. దానికి సంబంధించిన పనులు సైతం మార్చి నెల అంటే 2025 మార్చి నెల స్టార్టింగ్ లో మొదలు పెట్టింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మార్చి 8 నుంచి 15 వరకు ఈ ల్యాండ్ ని వేలంలో పెట్టింది. ఎప్పుడైతే యూనివర్సిటీకి చెందిన భూమిని ఆక్షన్ లో పెట్టారని తెలిసిందో.. అప్పటినుంచి స్టూడెంట్స్ దీని మీద మాట్లాడటం మొదలు పెట్టారు. 

బర్నింగ్ ఇష్యూగా మారింది ఎప్పుడంటే.. మార్చి 25న.. ఆ రోజున పీఐఎల్ అనేది ఫైల్ అయింది. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఎవరైనా ఫైల్ చేయొచ్చు. దీనిప్రకారం, ఏదైతే ల్యాండ్ ని రూలింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మాలనుకుంటుందో అది నేషనల్ పార్క్ కింద కన్వర్ట్ చేయడం.. అలాగే వీరి ప్రభుత్వం ఎటువంటి పనులు చేస్తుందో.. అది చట్టరీత్యా నేరం అవుతుంది కాబట్టి అకార్డింగ్ టు ఆర్టికల్ 48a ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఆర్టికల్ 48a ఏం చెప్తుందంటే.. ప్రతి గవర్నమెంట్ ఒక అండర్ టేకింగ్ తీసుకుంటుంది. అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అయ్యే బయోడైవర్సిటీ కలిగిన చెట్లు ఎక్కువగా ఉండే ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి. అలా ప్రొటెక్ట్ చేయకుండా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇప్పుడు దీన్ని ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి మీరు తక్షణమే ఆ ల్యాండ్ ని నేషనల్ కింద కన్వర్ట్ చేయండి.. ఈ ఆక్షన్ ఆపండి అని చెబుతూ.. సో దీనికి హైకోర్ట్ కూడా ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది..  ఏప్రిల్ 7 లోపల తెలంగాణ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇవ్వాలి.. ఈ పిఐఎల్ ఫైల్ చేసింది వాల్టా అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్.. వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ప్రిజర్వేషన్ కమ్యూనిటీ ఎండేంజర్మెంట్ జరగకుండా చూసుకుంటుంది. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములు తెలంగాణ ప్రభుత్వానివేనని, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి ఆ భూములతో సంబంధం లేదని సుప్రీంకోర్టు సాధికార కమిటీకి స్పష్టం చేసినట్లు సమాచారం. 

ఈ వివాదం మూలాల్లోకి వెళ్తే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తొలిదశ ఉద్యమం, ఆ తర్వాత సాగిన జై ఆంధ్ర ఉద్యమం టైంలో.. అంటే 1970 ప్రారంభంలో.. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1974లో హెచ్‌సీయూను ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటైన క్యాంపస్.. ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండలంలో కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్‌ 25లో 2,324 ఎకరాలను కలిగి ఉంది. అప్పట్లోనే ఈ భూమి చుట్టూ ప్రహరీ గోడను కట్టారు. అప్పట్నుంచీ ఆ భూములన్నీ వర్సిటీ అండర్ లోనే ఉన్నాయి. కానీ అఫిషియల్ గా యూనివర్సి­టీ పేరు మీదకు మారలేదు. అంటే అధికారికంగా యూనివర్సిటీ పేరు మీద ఒక్క ఎకరా కూడా లేదన్నమాట. 

ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో 2012 నవంబరు 20న  భూమి బదలాయింపు ప్రతిపాదనలు చీఫ్ కమిషనర్‌ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ)కి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేవి ఇప్పుడు బయటపడ్డాయి. కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా ఇవి పరిష్కారానికి నోచుకోకపోవడమే వింత!

హెచ్‌సీయూకు కేటాయించిన భూముల్లోని 400 ఎకరాలను 2004లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్  కోసం.. ఐఎంజీ భారత్ అనే సంస్థకు మొత్తం 850 ఎకరాలను చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కేటాయించారు. అందులో 400 ఎకరాలు హెచ్‌సీయూ కింద ఉన్న కంచ గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లోనివి.. మరో 450 ఎకరాలను మామిడిపల్లిలో కేటాయించారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చి మరీ ఆ భూములను వెనక్కు తీసుకుంది. దీనిపై ఐఎంజీ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల పాలనలోని ఏపీలోనూ, కేసీఆర్‌ హయాంలోని తెలంగాణలోనూ కలిపి 18ఏళ్ల పాటు ఇన్వెస్టిగేషన్ నడిచింది. తిరిగి కాంగ్రెస్‌ పార్టీ లాస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందంటూ 2024 మార్చి 7న ఈ కేసులో హైకోర్టు తీర్పునిచ్చిoది. దీన్ని ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 

2024 మే 3న ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిoది. దీంతో ఆ 400 ఎకరాల భూములను తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ)కు బదలాయించేందుకు గత ఏడాది జూన్‌ 6న పరిశ్రమల శాఖ సిఫారసు చేస్తే.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 2024 జులై 1న పంచనామా నిర్వహించి 400 ఎకరాలను టీజీఐఐసీకి అప్పగించారు. ఇప్పుడు ఆ భూములను పరిశ్రమలకు కేటాయించేందుకు వీలుగా చెట్లు, రాళ్లు, నేలను చదును చేసే పనిలో టీజీఐఐసీ పడింది. ఇదే ముదిరి తర్వాత వివాదానికి దారితీసింది.   

మరీ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది?..

ఈ భూమి హెచ్‌సీయూది కాదని.. మొత్తం 400 ఎకరాల్లోని అంగుళం కూడా వర్సిటీ పరిధిలోనికి రాదనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. సర్వే నంబర్‌ 25లో ఉన్న భూమి నిజానికి కంచ పోరంబోకు. చట్టప్రకారం అటవీ భూమి కాదు. ఈ 400 ఎకరాలను తీసుకున్నందుకు ఆల్టర్నేట్ గా గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 36లో 191– 36 ఎకరాలు, 37లో 205– 20 ఎకరాలు కలిపి మొత్తం 397 ఎకరాలు వర్సిటీకి కేటాయించారు. ఈ 397 ఎకరాలను తీసుకోవడం ద్వారానే ఆ 400 ఎకరాల భూమిపై వర్సిటీ హక్కులు వదులుకుంది. 

వర్సిటీ పరిధిలోని భూముల నుంచి 400 ఎకరాలను వేరు చేసేందుకు 2017 జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇష్యూ చేసింది. ఈ ఎకరాలను పరిశీలిస్తే అంతా బంజరు భూమి. రాళ్లతో నిండి ఉంది. ఎలాంటి పచ్చదనం లేదు. 

2006- 24 వరకు నిర్లక్ష్యంగా ఆ భూములను వదిలేయడంతో చెట్లు, పొదలు మాత్రమే పెరిగాయి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు చుట్టుపక్కల ఉన్న ఈ భూముల్లో ఐటీతో పాటు ఇతర రంగాల డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది. అప్పుడు పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. రూ.50 వేల కోట్ల వరకు పెట్టుబడులతో పాటు 5 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ భూముల్లో అభివృద్ధి జరగడం ద్వారా హైదరాబాద్‌ లంగ్‌స్పేస్‌ దెబ్బతింటుందనేది వాస్తవం కాదనేది రాష్ట్ర వాదన.

వర్సిటీ వర్గాలు ఎం చెబుతున్నాయి..?

యూనివర్సిటీ వర్గాల నుంచి మాత్రం రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. ఈ భూమి ఎవరిదన్న విషయం పక్కన పెడితే..యూనివర్సిటీకి ఒకసారి కేటాయించిన భూములను రాష్ట్రపతి ఆమోదంతో ఆరుగురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అంగీకారంతో మాత్రమే ఎవరికైనా కేటాయించాల్సి ఉంటుంది. లేదంటే ఆ భూమిలో ప్రభుత్వం చెపుతున్నట్టు 2024లో ఎలాంటి సర్వే జరగలేదు. యూనివర్సిటీ భూముల నుంచి 400 ఎకరాలను వేరు చేయలేదు. ఈ భూమి భౌగోళిక స్థితిపై ప్రైమరీ అబ్జర్వెన్స్ మాత్రమే జరిగింది. 

400 ఎకరాలను వేరు చేసేందుకు వర్సిటీ ఒప్పుకోలేదు. అసలు ఆ భూములను వేరుచేస్తామనే ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి అందలేదు. యూనివర్సిటీ ఏర్పాటై 50 ఏళ్లు గడుస్తున్న ఈ టైంలో స్వర్ణోత్సవ సమయంలో ‘మాకు ఇచ్చిన భూములను పూర్తిస్థాయిలో అధికారికంగా బదలాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ ప్రాంత ఎకాలజీ, బయోడైవర్సిటీని కాపాడాలని కోరుతున్నాం’ అని చెబుతోంది. అయితే యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆ భూములు సెంట్రల్‌ వర్సిటీవేనని కచ్చితంగా చెబుతున్నాయి. 

నిజానికి ప్రస్తుతం టీజీఐఐసీ ఆధీనంలో ఉన్నట్టుగా చెబుతున్న ఈ 400 ఎకరాలకు పైగా భూమిని వేలం వేయడం వల్ల రూ.25 వేల కోట్ల ఇన్కమ్ సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. వాస్తవానికి ఈ 400 ఎకరాల భూమిని గ్యారంటీగా చూపి, 9.6 శాతం వడ్డీపై ఐసీఐసీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ రూ.10 వేల కోట్ల రుణం తీసుకుంది.  

 ఐఎంజీ భారత్‌కు కేటాయించిన 400 ఎకరాల స్థానంలో 397 ఎకరాలు గోపన్‌పల్లి రెవెన్యూ పరిధిలో వర్సిటీకి కేటాయించారు. కానీ ఆ భూముల పొజిషన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. అసలు ఆ ప్రత్యామ్నాయ భూములు ఎక్కడ ఉన్నాయో కూడా వర్సిటీ యంత్రాంగం గుర్తించలేకపోవడం విశేషం.

ప్రస్తుతం వర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో 455 జాతుల వృక్ష, జంతుజాలాలు ఉన్నాయని అంటున్నారు. నెమళ్లు, జింకలు, పెద్ద పెద్ద చెరువులు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాళ్లు, వాటి అమరికలతో రమణీయంగా కనిపించే ఈ భూములు ఎక్కడ ప్రైవేటు వ్యక్తులు లేదంటే సంస్థల పాలవుతాయో అన్న ఆందోళన విద్యార్థులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా కలగడంతోనే ఈ భూముల విషయంలో ఇంతటి అలజడి కనిపిస్తోంది. 

అసలుకైతే అభివృద్ధికి.. చెట్ల నరికివేతకు ఎటువంటి సంబంధం లేదు.. రాజకీయాలకతీతంగా పర్యావరణాన్ని నాశనం చేస్తూ.. వృద్ధి కోరుకునే దశలో.. మనం ఏం కొల్పోతున్నామో గమనించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు, భావి పౌరులకు ఎంతైనా ఉంది.

Show More
Back to top button