NRI News

ఎన్టీఆర్ 102వ జయంతికి జర్మనీలో మినీ మహానాడు

తెలుగు సినిమా విభూది, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని జర్మనీలో మినీ మహానాడు నిర్వహించనున్నారు. ఈ నెల మే 24, 25 తేదీల్లో ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ఈ వేడుకలు జరగనున్నాయి. జర్మనీ ఎన్నారై తెదేపా నేతలు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఇటీవల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడు పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి తెదేపా జర్మనీ శాఖ అధ్యక్షుడు పవన్ కుర్రా అధ్యక్షతన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరవుతారు.

తెదేపా ప్రధాన కార్యదర్శి సుమంత్ కొర్రపాటి మాట్లాడుతూ, “2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని విజయం సాధించింది. ఇది తెలుగువారి గౌరవాన్ని ప్రపంచానికి చాటింది. అందుకే ఈసారి ఎన్టీఆర్ జయంతిని ప్రత్యేకంగా, పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించబోతున్నాం” అని తెలిపారు.

శ్రీకాంత్ కుడితిపూడి, శివ లాంటి మినీ మహానాడు సమన్వయకర్తలు మాట్లాడుతూ, యూరప్‌ అంతటా ఉన్న తెదేపా అభిమానులు, కార్యకర్తలు ఫ్రాంక్‌ఫర్ట్‌కు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Show More
Back to top button