
ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన మతాలలో, ధర్మాలలో హిందూ ధర్మం ఒకటి. సనాతనం అనే పేరులోనే అత్యంత పురాతనం అనే పేరు దాగింది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధర్మాలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ సనాతన ధర్మం వైపు ఇప్పుడు ఎంతోమంది ఆకర్షితులవుతున్నారు. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు హిందూ ధర్మాన్ని అనుసరించడానికి సిద్ధమవుతున్నాయి. మానసిక ప్రశాంతత కోసం, జీవితాన్ని సుఖంగా జీవించడం కోసం హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. ఇప్పటికి కొన్ని దేశాలు పూర్తిగా హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నాయి. ఆ దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
హిందూధర్మం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇది మన హిందువులకు ఎంతో గర్వకారణమైన విషయం. సనాతన ధర్మం యొక్క శక్తి ఏ విధంగా బలపడుతుందో ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కువగా హిందూ ధర్మం వ్యాపిస్తున్న దేశాల్లో ఒకటి మలేషియా.
మాలేసియా
ఈ మలేషియాలో హిందువుల శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువగా భారతీయులే ఉన్నారు. మలేషియాలో ఫేమస్ అయిన దేవాలయం మురుగన్ దేవాలయం. ఇక్కడ ఎన్నో జాతరలు వైభవంగా జరుపుతారు. మలేషియాలో మనకు హిందూ సంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుస్తాయి. మన పండుగలను, ఆచార వ్యవహారాలను ఇక్కడి ప్రజలు ఇప్పటికి కూడా అనుసరిస్తూనే ఉన్నారు. దీపావళి, సంక్రాంతి, హోలీ వంటి ఎన్నో పండుగలను వాళ్లు జరుపుకుంటున్నారు. మలేషియాలో ఎన్నో భిన్న జాతులకు చెందిన వాళ్లంతా కూడా కలిసి జీవిస్తూ ఉంటారు. హిందూ ధర్మానికి చెందిన సంస్కృతి, సాంప్రదాయాలను తూచా తప్పకుండా ఇక్కడ ప్రజలు పాటిస్తున్నారు. హిందూ పండుగలను జనాలంతా కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ట్రినిడాడ్ అండ్ టోబాగో
ఈ దేశంలో హిందువులు 18 శాతం మంది ఉన్నారు. ఇక్కడ నివసించే ఎన్నారైలు హిందూ సంస్కృతిని వ్యాపింప చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శివం శివాలయ్ మందిర్ ఇక్కడ ఎంతో ప్రముఖమైనది. ఈ దేశంలో కూడా హిందూ పండుగలను ఘనంగా, వైభవంగా జరుపుతారు. ముఖ్యంగా దీపావళి, హోలీ పండుగలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం హిందూ మహాసభలను ఇక్కడ నిర్వహిస్తారు. ఈ సభల్లో హిందూ ఆచార వ్యవహారాలను పాటిస్తూ హిందూ సనాతన ధర్మం గురించి చర్చించుకుంటారు. పండగలప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ ఉండడం వల్ల హిందూ ధర్మం గురించి అక్కడ జనాలకు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ వివాహాలను కూడా హిందూ ధర్మం ఆచారం ప్రకారమే నిర్వహిస్తారు.
గుయనా
గుయానా దేశంలో 24 శాతం మంది హిందువులు ఉన్నారు. వీళ్లంతా ప్రవాస భారతీయులే. ఇక్కడ కాళికాదేవికి సంబంధించిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా హిందూ పండుగలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ హిందువులంతా మన సంస్కృతి, సాంప్రదాయాలను మరిచిపోకుండా ఆచారాలను పాటిస్తున్నారు. కలిసిమెలిసి ఉంటున్నారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ ప్రపంచానికే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా వాళ్ళు చాటిచెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే వేరే మతాల వాళ్లు కూడా హిందూ ధర్మాన్ని చూసి ప్రభావితమై మన మతాన్ని అనుసరిస్తున్నారు.
ఫిజీ
ఫిజీ దేశంలో 27 శాతం మంది హిందువులు నివసిస్తున్నారు. ఈ దేశంలో శివాలయాలతో పాటు మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దేవాలయాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నాయి. ఇక్కడ కూడా దీపావళి, హోలీ పండుగలను వైభవంగా జరుపుకుంటూ హిందువులందరూ కలిసికట్టుకునే నివసిస్తున్నారు. మన ధార్మిక సాంప్రదాయాలను, ఆచారాలను హిందువులు తమ బిడ్డలకు, రాబోయే భవిష్యత్తు తరాలకు అందిస్తూ హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నారు. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో హిందూ సభలు నిర్వహిస్తారు. హిందువులు తమ సనాతన ధర్మాన్ని గురించి చెప్పే గొప్పతనాన్ని వదులుకోవడం లేదు. ఇక్కడ హిందువులు జరిపే ఆచార సంస్కృతి, సాంప్రదాయాల వల్ల ఆ దేశంలో ఇతర మతాల వారికి కూడా మన హిందూ మతం గొప్పదనం తెలుస్తోంది.
సురినం
సురినం దేశ ప్రెసిడెంట్ కూడా తాను హిందువుని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నారు. అంటే ఆ దేశంలో హిందువుల గొప్పతనం ఇలాంటిదో ఊహించుకోవచ్చు. ఈ దేశంలో అత్యంత వేగంగా హిందూ ధర్మం వ్యాపిస్తోంది. ఇక్కడ 27% మంది హిందువులు ఉన్నారు. ఇక్కడ హిందూ దేవాలయాలను అత్యంత సురక్షితంగా చూసుకోవడం కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్న దేవాలయాలలో ఎక్కువగా రామ మందిరం, హనుమాన్ మందిరాలు ఉన్నాయి. ఈ దేశంలో మన భారతీయ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తోంది. దీపావళి, హోలీ వంటి పండుగల సమయంలో మన హిందువులు పండుగలను నిర్వహిస్తారు. ఇక్కడ కూడా ఇతర మతస్తుల హిందువులతో కలిసికట్టుగా జీవిస్తూ సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు.
మార్సస్
ఈ దేశంలో కూడా హిందూ ధర్మం విజయవంతంగా వ్యాపిస్తుంది. భారతదేశం తర్వాత ఎక్కువగా హిందువులు ఈ దేశంలోనే ఉన్నారు. దాదాపు 48 శాతం మంది హిందువులు ఇక్కడ ఉన్నారంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇక్కడ కూడా ఎక్కువగా ఎన్నారైలే హిందూ ధర్మ వ్యాప్తికి కృషి చేస్తున్నారు.ఇక్కడ కూడా హిందూ పండుగలను ముఖ్యంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున ఎంతో మంది భక్తులు ఉపవాసం ఉంటూ శివుడిని పూజిస్తారు. ఇక్కడ ఉన్న దేవాలయాల్లో ముఖ్యమైనవి త్రివేణి ఘాట్, శేషామహల్ గణపతి దేవాలయం ఉన్నాయి. హిందూ సంప్రదాయాలను ఆచారాలను పాటిస్తూ సనాతన ధర్మం ఇప్పటికి కూడా నిలకడగా ఉండడానికి కారణం ఇక్కడ ఉండే ప్రవాస భారతీయులే. ఈ దేశంలో ఎక్కువ మంది జనాలు హిందూ ధర్మం వైపు ఆకర్షింపబడుతున్నారు. అందుకనే ఇండియా తర్వాత హిందువులు ఎక్కువగా ఉన్న దేశం మార్షస్ ఒక్కటే.
భారతదేశం
భారత దేశంలో హిందువుల సంఖ్య ఎక్కువగానే అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ 79.8% మంది హిందువులు ఉన్నారు. హిందూ ధర్మాన్ని పాటించే హిందువులు సనాతన ధర్మ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలను తరతరాల నుండి అనుసరిస్తున్నారు. పురాణాలలో ఉపనిషత్తులను హిందువులు పరమ భద్రంగా భావిస్తూ ఉంటారు. రామాయణ, మహాభారతం వంటి పురాతన గ్రంథాలను మన హిందువులు సనాత ధర్మానికి ప్రత్యేకతగా భావిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడైనా కనిపిస్తుంది అంటే అది కేవలం మన భారతదేశంలో మాత్రమే మనకు కనిపిస్తుంది.
ఇక్కడ హిందువులు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ఈ హిందువులలో కూడా విభిన్నమైన సంస్కృతులు పాటించేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. గణేష్ చతుర్థి దగ్గర నుండి దీపావళి, నవరాత్రుల వరకు మన హిందువులు ఎన్నో పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ లెక్కలేనని దేవాలయాలు ఉంటాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాలు అన్నింటిలోకి అత్యంత పెద్దది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలుగు నేలపై ఉంది. ఇదే కాకుండా కాశీ విశ్వేశ్వర ఆలయం నుండి కన్యాకుమారి ఆలయం వరకు భారతదేశంలో ఆలయాలకు కొదవలేదు. పూజలు, పునస్కారాలు చేస్తూ హిందువులంతా కూడా సఖ్యతతో హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు.
నేపాల్
హిందూ ధర్మాన్ని పాటిస్తూ సనాతన హిందువులు నివసించే నేల ఏదైనా ఉంది అంటే అది నేపాల్ మాత్రమే. ఇక్కడ దాదాపు 81 శాతం మంది హిందువులు ఉన్నారు. నేపాల్ ఒక ధార్మికమైన పవిత్ర స్థలం. ఇక్కడ పశుపతినాథ్, ముక్తినాథ్ వంటి ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. పశుపతినాథ్ దేవాలయం హిందూ ధర్మం లోనే అత్యంత పరమ పవిత్రమైన దేవాలయం. ఇక్కడ ఎంతో మంది భక్తులు ప్రతినిత్యం స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ హిందూ పండగలు అన్నిటిని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక్కడ హిందూ ధర్మంతో పాటు బౌద్ధ ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇప్పటికీ హిందూ ధర్మ వ్యాప్తంగా పూజలు, పునస్కారాలు చేస్తూ ఈ దేశంలో మాత్రమే కాకుండా అమెరికా నుండి యూరప్, చైనా ఎన్నో దేశాలలో హిందువులు ఉన్నారు. ప్రతి దేశంలో కూడా హిందూ ధర్మం ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా రష్యా దేశంలో హిందువుల సంఖ్య వేగంగా పెరిగిపోతుంది. హిందూ మతం అన్ని మతాలన్నింటిలో కూడా అత్యంత ప్రాచీనమైన సనాతన ధర్మం. ఈ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా పెరుగుతుంది. దీపావళి, హోలీ వంటి పండుగలను ఉల్లాసంగా జరుపుకోవడం దగ్గర నుండి శివరాత్రి, నవరాత్రులను ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం వరకు హిందువులు మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ దేశాలలో హిందూ ధర్మం కేవలం మతం మాత్రమే కాదు అది ఒక సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా మారింది. ఇదంతా చూస్తూ ఉంటే మరికొన్ని సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా హిందువుల సంఖ్య పెరిగిపోతుంది అనిపిస్తుంది.