
చాలామంది భోజనం పూర్తయ్యాక ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకుంటారు. “ఇది హెల్దీ హ్యాబిట్ కదా!” అనే భావనతో తింటారు. కానీ నిజానికి ఫ్రూట్స్ తినే సరైన టైమ్ విషయంలో ఒక చిన్న తప్పు.. పెద్ద సమస్యలకు దారి తీస్తుంది.
భోజనం తర్వాత ఫ్రూట్స్ తింటే, అవి ఇప్పటికే జీర్ణమవుతున్న ఆహారంతో కలిసి తక్కువ వేగంతో జీర్ణమవుతాయి. దీనివల్ల వాటిలోని విటమిన్లు, ఫైబర్, ఫైటోన్యూట్రియంట్స్ పూర్తిగా శరీరానికి లభించకపోవచ్చు. ఫ్రూట్స్లో ఉండే ఫ్రుక్టోస్ (ఫలం తీపి) fermentation ద్వారా bloating, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు కలిగించవచ్చు.
అందుకే ఫ్రూట్స్ తినడానికి ఉత్తమ సమయం భోజనం ముందు లేదా మధ్యాహ్నం స్నాక్ టైమ్లో. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే అందులోని పోషకాలన్నీ త్వరగా, సరిగ్గా శరీరానికి గ్రహించబడతాయి.
అలాగే, రాత్రిళ్ళు అధిక మోతాదులో ఫ్రూట్స్ తినకూడదు. ఎందుకంటే రాత్రి శరీరం జీర్ణ ప్రక్రియను నెమ్మదించేస్తుంది. ఈ సమయంలో ఫలాల్లోని చక్కెరలు శరీరంలో కొవ్వుగా నిల్వ కావచ్చు.
సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య లేదా సాయంత్రం 4 నుంచి 5 మధ్య ఫ్రూట్స్ తినడం చాలా మంచిది.