
PCOD లేదా PCOS అనే సమస్య ఇప్పుడు చాలా మంది అమ్మాయిల్లో కనిపిస్తోంది. ఇది వచ్చినప్పుడు పీరియడ్స్ తేడాగా రావడం మొదలవుతుంది. కొన్ని నెలలు వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని నెలలు రాకపోవచ్చు. కొందరికి ముఖం మీద రోమాలు ఎక్కువగా రావడం, బరువు పెరగడం, మొటిమలు రావడం కూడా జరుగుతుంది.
ఇది శరీరంలో హార్మోన్లు తేడాగా తయారవ్వడమే కారణం. దీనివల్ల గర్భం దాల్చడంలో కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు. సాధారణంగా అమ్మాయిల్లో నెలకు ఒకసారి అండం విడుదల అవుతుంది. ఆ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే, గర్భధారణ కుదరదు. ఇవే PCOD / PCOS లో జరుగుతున్న మార్పులు.
ఈ సమస్య ఎందుకు వస్తుంది అన్న దానికి స్పష్టమైన కారణం ఒక్కటి ఉండదు. కొందరికి ఇంటిలో ఇతరులకి ఉన్నట్టే వారసత్వంగా వస్తుంది. మరికొందరికి జీవనశైలి వల్ల, ఉదాహరణకి రోజంతా కూర్చొని ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, టైమ్‌కి నిద్రపోకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వంటివి.
అయితే ఇది చికిత్సతో నయం అవుతుందా అంటే, పూర్తిగా పోతుంది అని చెప్పలేము కానీ… బాగానే కంట్రోల్ చేయవచ్చు. రోజూ కొంతసేపు నడక, తక్కువ నూనె, తక్కువ తీపి ఉన్న ఆహారం, స్ట్రెస్ తగ్గించుకోవడం, నిద్ర పక్కాగా ఉండడం ఇవన్నీ పాటిస్తే చాలా తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గినప్పుడు పీరియడ్స్ కూడా క్రమంగా వస్తాయి.
కొన్ని సందర్భాల్లో డాక్టర్ మెడిసిన్ సూచిస్తారు. అవి హార్మోన్ల బ్యాలెన్స్ బాగుంచేలా, పీరియడ్స్ క్రమబద్ధంగా రావడానికి ఉపయోగపడతాయి. అవసరమైతే స్కాన్లు, బ్లడ్ టెస్టులు కూడా చెయ్యవచ్చు.
మొత్తం చెప్పాలంటే, ఈ సమస్య చాలామందిలో ఉందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓ సాధారణ సమస్యగా చూసుకుంటే, జాగ్రత్తగా చూసుకుంటే, టైమ్‌కి డాక్టర్‌ను సంప్రదిస్తే చాలా సమర్థంగా మేనేజ్ చేయొచ్చు.