
సామాన్యుడి నుంచి కార్పొరేట్ సంస్థల వరకు మెయిల్ సర్వీసులను ఇప్పటివరకు అఫిషియల్ లెటర్స్ గానే యూస్ చేయడం పరిపాటైంది. అటువంటి ఇ-మెయిల్స్ ‘ఏఐ’ సపోర్ట్‌తో ఇంకొంచం అడ్వాన్స్డ్ గా మారిపోతే ఎలా ఉంటుంది. మనకు ఎన్ని రకాల ఇన్స్టాంట్ మెసేజ్ సర్వీసులు వచ్చినా.. ఇ-మెయిల్స్‌కు ఉన్న ప్రియారిటీ మాత్రం అస్సలు మారలేదు.
గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్ ఇటీవల జీమెయిల్ కోసం ఒక కొత్త ఏఐ టూల్‌ను డెవలప్ చేయనున్నట్లు తెలిపింది. ఇది నెక్స్ట్ జనరేషన్ ఇ-మెయిల్ సిస్టమ్ గా అవతరిస్తుందని వారు అన్నారు.
డీప్‌మైండ్ ఆధారిత ఈ నయా ఏఐ టూల్ కాస్త రోజువారీ ఇ-మెయిల్స్‌ను రీడ్ చేయడం నుంచి అర్థం చేసుకోవడం, మెయిల్ రైటింగ్ స్టైల్ ను అనుకరించడం, మన తరఫున మెయిల్స్‌కు ఆటోమేటిక్‌గా రిప్లై ఇవ్వడం లాంటివన్నీ చేస్తుందీ. దీని పేరే ఏజీఐ. దీనిని హ్యూమన్ లెవల్ రీజనింగ్ కలిగిన ఏఐ సిస్టమ్‌గా పిలవచ్చు.
మరో 5- 10 సంవత్సరాల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఏఐ ఫీచర్స్ కేవలం జీమెయిల్‌తోనే ఆగడం లేదు. ఇతర మెయిల్ ప్రొవైడర్స్ కూడా ఏఐ ద్వారా వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
క్రోమ్ వాడుతున్నారంటే.. అందుకు అనుమతి పొందే జీమెయిల్ ను ఉపయోగిస్తున్నట్టే కదా! గూగుల్ అందించే జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌కి అంతే ప్రాధాన్యమిస్తున్నారు నెటిజన్లు. అందుకే గూగుల్ జీ.మెయిల్ కోసం ‘ఏఐ’ డెవలప్‌మెంట్‌ని ఇంట్రడ్యూస్ చేయనుంది. ఈ టూల్ మీ రైటింగ్ స్టైల్ ని ఫాలో చేస్తూ మీకు వచ్చిన మెయిల్‌కు రిప్లై ఇస్తుంది. ఏరోజుకారోజు కంటెంట్‌ని మానిటర్ చేస్తుంది. మొత్తం డేటాను అనలైజ్ చేసి, మీ రైటింగ్ స్టైల్ ని పట్టేస్తుంది. ఎప్పటికప్పుడు మీకు వచ్చే మెయిల్స్‌కు స్మార్ట్ రిప్లైస్ ను సజెస్ట్ చేస్తుంది. దీంతో మీ మెయిల్స్‌ను మేనేజ్ చేయడం మరింత ఈజీ అవుతుంది.
ఇన్‌బాక్స్‌కి చేరే మెయిల్స్‌లో కంటెంట్ ఆధారంగా వాటి ప్రాధాన్యాన్ని సెట్ చేస్తుంది. దీంతో యూజర్లు ఇంపార్టెంట్ మెయిల్స్‌కి వెంటనే రెస్పాండ్ అయ్యే వీలుంటుంది. ఈ క్రమంలో డేటా యూసేజ్ చాలావరకు తగ్గుతుంది. ఇక గూగుల్ ఇప్పటికే హెల్ప్ మీ రైట్ (Help me write), స్మార్ట్ కంపోజ్ (Smart Compose), స్మార్ట్ రిప్లై (Smart Reply).. వంటి ఏఐ సేవలను రోల్ అవుట్ చేసింది. ఇప్పుడు ఈ నెక్ట్స్ జనరేషన్ టూల్‌తో మరో అడుగు ముందుకు వేసిందని టెక్నాలజీ నిపుణులు సైతం చెప్పడం విశేషం!