Telugu News

లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసేముందుఆర్బీఐ ధృవీకరణ అవసరం!

గూగుల్ ప్లే స్టోర్ లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న ఫైనాన్షియల్ యాప్స్ పట్ల యూజర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారిక వెబ్సైట్ సైబర్ దోస్త్ తాజాగా సూచనలిచ్చింది. రుణ యాప్ వేధింపుల వల్ల ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారో రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాంటి లోన్ యాప్ లు ముందుగా ఈజీగా మనీ ఇస్తూనే.. వారికి తెలియకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తూ.. అసలు వడ్డీ కట్టినప్పటికీ ఇంకా డ్యూ ఉన్నట్లు చూపిస్తూ.. కట్టకపోతే దుర్భాషలాడటం.. పదే పదే ఫోన్లు చేసి విసిగించడం చేస్తుంటారు.

ఇలా మొదట నమ్మకంగా ఉంటూ.. యూజర్ ఫ్రెండ్లీగా కనిపిస్తున్నా.. కస్టమర్ల ముఖ్యమైన ఫైనాన్షియల్ డేటా బ్యాంక్ వివరాలను ఒక్కోసారి తస్కరించేలా వీటిని రూపొందిస్తారు. ఇలాంటి వాటివల్ల యూజర్ల డేటా భద్రత, అకౌంట్ బ్యాలెన్స్ అనేవి థర్డ్ పార్టీ, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సైబర్ నిపుణులు ఈ రుణ యాప్ ల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. 

మచ్చుకు కొన్ని.. ఇన్వాయిసర్ ఎక్స్ పర్ట్, లోన్ రైనా – ఇన్స్టంట్ లోన్ ఆన్లైన్, గ్రేన్ స్విఫ్ట్, లోన్ క్యు ఫైనాన్షియల్ కాలిక్యులేటర్, క్రెడిట్ ఎడ్జ్, స్మార్ట్ రిచ్ ప్రో, క్రెడిట్ లెన్స్ మొదలైనవి.

మీ మొబైల్ లో ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసేముందు యాప్స్ ప్రామాణికతను ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. 

ఆర్బీఐ వెరిఫైడ్ చేసిన లోన్ యాప్ లను, సైట్ లను మాత్రమే వాడాలి.

వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు పూర్తిగా విశ్లేషణ చేసుకోవాలి. ఆ తర్వాతే డీటైల్స్ ఇవ్వాలి. 

Show More
Back to top button