
రాజమండ్రిలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పింఛన్లు మొదటి తేదీన సమయానికి ఇవ్వడం ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రయాణిస్తామని చెప్పారు. పెరిగిన ఆదాయాన్ని పేదలకు మళ్లించి, సంతోషంగా జీవించేలా చేయడమే లక్ష్యమన్నారు.
ఉద్యోగులు సేవా ధోరణితో పని చేయాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు, పోలవరం పూర్తి, గోదావరి పుష్కరాల నిర్వహణ వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టామని వివరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.