
మల్టీ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా రాజకీయ రంగప్రవేశం చేసి “అమెరికా పార్టీ” అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విషయం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఏకంగా రిపబ్లికన్ పార్టీ నుంచి ఆయన పూర్తిగా వైదొలిగిన సంకేతంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఉన్న రెండు ప్రధాన పార్టీలకు బదులుగా, మధ్య స్థాయి ఓటర్లకు ప్రత్యామ్నాయంగా ఏర్పడే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని వల్ల వచ్చే మార్పులు కేవలం రాజకీయ పరిధిలోనే కాక, ఆర్థికంగా, మార్కెట్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ ప్రకటన చేసిన తర్వాత టెస్లా షేర్ విలువలు పడిపోవడం మొదలైంది. మస్క్ తన ఆర్థిక సామ్రాజ్యంపై దృష్టిని కోల్పోతున్నారా అన్నదానిపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. టెస్లా బోర్డు కూడా ఆయనపై పరిమితులు విధించాలని కోరడం గమనార్హం. రాజకీయాల్లో ఎంటర్ అయిన వ్యక్తిగా, ఆయన పెట్టుబడిదారుల నమ్మకాన్ని కోల్పోవడానికి ఇది పెద్ద కారణంగా మారొచ్చు. అయితే మస్క్ మాత్రం తన usual swagలో దీన్ని లైట్ తీసుకుంటున్నారు.
ఇక ఈ పార్టీకి భవిష్యత్ ఉండాలంటే.. ప్రతి రాష్ట్రంలో బ్యాలెట్ యాక్సెస్, నామినేషన్ల క్రీడ ఇవన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ మస్క్ దగ్గర డబ్బూ ఉంది, ఫాలోయింగ్ కూడా ఉంది. Andrew Yang వంటి మూడవ పార్టీ నాయకులతో కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. చివరకు ఆయన అసలైన లక్ష్యం ఏమిటంటే, 2026 మిడ్‌టర్మ్ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచి.. అమెరికా పాలిటిక్స్‌లో “డిసైడింగ్ వోట్” కదిలించే శక్తిగా మారడమే. ఇది సాధ్యమేనా? అనేది ముందు ముందు తెలియనుంది. కానీ, మస్క్ స్టెప్ వేశారంటే ఏదో కదలిక ఉండేలా చేస్తారన్నది మాత్రం నిజం.