
బరువు తగ్గడం అనేది చాలామంది కోరుకునే లక్ష్యం. అయితే, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం మాత్రం శరీరానికి హెచ్చరికగానే చూడాలి. ఇది ఆరోగ్యంగా కాకపోవచ్చు. సాధారణంగా వ్యాయామం, డైట్ వల్ల gradual గా బరువు తగ్గాలి. కానీ నెలలో 4-5 కిలోలు కంటే ఎక్కువ తగ్గితే, underlying ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఎక్కువ.
క్లాస్‌లో టాపర్ లాగానే, శరీరం ఎప్పుడూ balance లో ఉండాలి. ఒక్కసారిగా బరువు తగ్గితే muscle mass తగ్గిపోవచ్చు, శక్తి తగ్గుతుంది, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇది టైఫాయిడ్, డయాబెటిస్, థైరాయిడ్, క్యాన్సర్, TB, మరియు మానసిక ఒత్తిడి వంటి వ్యాధుల లక్షణం కూడా కావొచ్చు.
ఒక్కసారిగా సన్నబడితే… బాడీలో ఏం జరుగుతుంది?
బరువు తగ్గడం కన్నా దానికితోడు శరీరంలో fat-loss & muscle-loss రెండూ జరుగుతున్నాయా అని గమనించడం ముఖ్యం. ఒక్కసారిగా బరువు తగ్గితే first glycogen-water loss జరుగుతుంది. తర్వాత muscle breakdown మొదలవుతుంది. ఇది metabolismను slow చేస్తుంది. దీన్ని crash weight-loss అంటారు. దీని వల్ల బాడీ starvation మోడ్‌లోకి వెళ్తుంది.
అలాంటప్పుడు మళ్లీ సాధారణ డైట్ తీసుకున్నా బరువు ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆకలే లేకుండా పోతే, బలహీనత వస్తే, విపరీతంగా మానసిక ఒత్తిడిలో ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే, శరీర బరువు ఒక్కసారిగా తగ్గడం ఆరోగ్య సంకేతం కాకపోవచ్చు. ఇది దీర్ఘకాలిక సమస్య కూడా కావచ్చు.










