
గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే బాడీ అంత హెల్తీగా ఉన్నట్టు లెక్క. కానీ.. ప్రస్తుత రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా గుండె ఆరోగ్యం చాలా వరకు దెబ్బతింటుంది. దీంతో చాలా మందికి తక్కువ వయసులోనే హార్ట్ ఎటాక్ వస్తోంది. మరి ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఫుడ్స్ ఏంటి? వాటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేయాలి.
కానీ అదే సమయంలో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి. ఇందులో ఆయుర్వేద పదార్థాలు కూడా ఉన్నాయి. న్యూట్రిషనిస్ట్ డింపుల్ జంగ్డా ప్రకారం వెల్లుల్లి, గుగ్గులు, అర్జున పదార్థాల(అర్జున బెరడు)ను రెగ్యులర్ డైట్‌లో యాడ్ చేసుకుంటే గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
వీటితో పాటు మరికొన్ని ఫుడ్స్ కూడా ఉన్నాయి. అయితే కేవలం ఆ ఫుడ్స్ తీసుకోవడమే కాకుండా మెడిటేషన్, యోగా, హెర్బల్ టీ లాంటివి ట్రై చేస్తే హార్ట్ హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా తులసి లేదా దాల్చిన చెక్క వాడితే చాలా మంచిది. అర్జున మూలిక గుండె కండరాలను దృఢంగా మార్చడంతో పాటు రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
ఇమ్యూనిటీ పెంచి ఇన్ ఫ్లమేషన్ తగ్గించడంలో తోడ్పడుతుంది. రెండు కప్పుల నీటిలో ఓ టేబుల్ స్పూన్ అర్జున మూలిక చూర్ణాన్ని కలిపి మరిగించాలి. గోరువెచ్చగా తేనె లేదా నిమ్మరసం కలిపి తాగాలి. లేదంటే నేరుగా తాగవచ్చు. ఇలా చేస్తే మన గుండె ఆరోగ్యం హెల్తీగా ఉండడమే కాకుండా… ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.






