HEALTH & LIFESTYLE

నోటి క్యాన్సర్ విజృంభిస్తుంది.. జాగ్రత్త..! 

మనిషి శరీరంలో నోరు ముఖ్యమైన అవయవం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలున్న ఆహారం తినాల్సి ఉంటుంది. దీనికోసం నోరు చాలా అవసరం. కాబట్టి నోరు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ, ప్రస్తుతం నోటి క్యాన్సర్ విజృంభిస్తోంది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలేంటి ఈ నోటి క్యాన్సర్, ఎందుకు వస్తుంది, ఎలా నివారించుకోవాలి..? అనే సమాచారం ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి. నోటిలో ఏ భాగంలో అయిన ఈ నోటి క్యాన్సర్ రావచ్చు. దీనినే ఓరల్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా 45 సంవత్సరాలు దాటిన వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ.

నోటి క్యాన్సర్ కారకాలు..

*అధికంగా ధూమపానం, మద్యపానం తీసుకోవడం.

*కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉండడం.

*HPV వైరస్ వల్ల కూడా ఇది సంభవిస్తుంది.

*సరైన పోషకాహారం సమతుల్యంగా తీసుకోకపోవడం.

నోటి క్యాన్సర్ లక్షణాలు..

*నోటి కణజాలాలకు వాపు రావడం

*నోటిలో రక్తం రావడం

*స్పర్శ తెలియకపోవడం

*గొంతు నొప్పి

*చెవి నొప్పి

*ఒకేసారి బరువు తగ్గడం

నోటి క్యాన్సర్‌కు చికిత్స..

*రేడియేషన్ థెరపీ

*టార్గెటెడ్ చికిత్స

*కీమోథెరపీ

*ఇమ్యునోథెరపీ

ఓరల్ క్యాన్సర్‌కు శస్త్రచికిత్సలు..

*ప్రాథమిక కణితి శస్త్రచికిత్స

*గ్లోసెక్టమీ

*మాండిబులెక్టమీ

*మాక్సిలెక్టమీ

*మెడ విచ్ఛేధనం

*పునర్నిర్మాణం

*సెంటినెల్ లింఫ్ నోడ్ బయాప్సీ

ఓరల్ క్యాన్సర్‌కు నివారణ..

చికిత్స కంటే నివారణ మేలు. కాబట్టి మీరు క్యాన్సర్ రాకముందే నివారణలు తీసుకోవడం చాలా అవసరం. దీనికోసం పలు అంశాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..

* అధికంగా ధూమపానం, మద్యపానం చేయకండి.

*సమతుల్యమైన ఆహారం తీసుకోండి.

*రెగ్యులర్‌గా డెంటిస్ట్‌లను కలవండి.

*నోటిని శుభ్రంగా ఉంచుకోండి.

*HPV టీకాలు తీసుకోండి.

Show More
Back to top button