Telugu Opinion SpecialsTelugu Politics

చీరాలలో ఈసారి గెలిచేదెవరు?

ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఐదుసార్లు విజయకేతనం ఎగురవేసింది. 1983, 1985, 1994, 1999, 2019లో టీడీపీ అభ్యర్థి చీరాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మరోవైపు వైసీపీ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అయితే 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో మరోసారి పార్టీ జంప్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం అధికార పార్టీ వైసీపీలో చేరారు. రానున్న ఎన్నికల్లో ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు వైసీపీ టిక్కెట్ కేటాయించింది.

అటు టీడీపీ తరఫున మద్దులూరి మాలకొండయ్య యాదవ్ బరిలో నిలిచారు. ఆయన తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి అక్కడ ప్రజలు ఎవరికి పదవి అంటకడతారో వేచి చూడాల్సిందే.

Show More
Back to top button