HEALTH & LIFESTYLE

బ్లాక్ వాటర్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు

మన శరీరానికి ముఖ్య ఆధారం నీరు. బాడీలో 70% నీరే ఉంటుంది. అంతేకాదు రోజుకు దాదాపు 4 లీటర్ల నీళ్లు తాగాలి. మినరల్స్ ఉన్న నీళ్లు తాగితేనే మంచి ఫలితాలు ఉంటాయి. అందులో బాగంగా మార్కెట్‌లో రకరకాలు వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది క్రీడాకారులు, సినీ సెలబ్రెటీలు.. ఫిట్‌నెస్, అందం కోసం బ్లాక్ వాటర్ తాగుతున్నారు.

బ్లాక్ వాటర్ రుచికి మామూలు నీళ్లలా ఉన్నా చాలా ఖరీదైనవి. ఎక్స్రర్‌సైజ్‌ చేసి చెమట పట్టిన తర్వాత బ్లాక్ వాటర్ తీసుకుంటే జీవక్రియ రేటు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం తాగే నీరు PH విలువ 7 ఉంటుంది. కానీ బ్లాక్ వాటర్‌లో ఈ విలువ 7 కన్నా ఎక్కువే ఉంటుందట. అందువల్ల వయసు పెరుగుదలతో వచ్చే చర్మపు ముడతలు, వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ నీరు శరీరాన్ని హైడ్రేడ్‌గా ఉంచుతుంది.  

అద్భుత ప్రయోజనాలు..

బ్లాక్ వాటర్ శరీరంలో విషపదార్థాలను బయటకు పంపే డిటాక్స్ డ్రింక్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ బయటికి పంపించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మం పొడిబారకుండా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్‌ వాటర్‌ సహాయపడుతుందని చాలా అధ్యయనాల్లో తేలింది. బ్లాక్ వాటర్ ఏకాగ్రతను పెంచడంతో పాటు, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 

ఇందులో మెగ్నీషియం, కాల్షియం లవణాలు ఉంటాయి. వేసవిలో ఈ నీటిని ఎక్కువగా తీసుకుంటే.. సన్‌స్ట్రోక్‌ నివారించవచ్చట. బ్లాక్‌ వాటర్‌ శరీర వేడిని తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచడం, కీళ్లలో జిగురు పెరుగుదలకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, బ్లాక్ వాటర్ ఎక్కువగా తాగితే బాడీలో ఆల్కలైన్ స్థాయిలు పెరిగి గ్యాస్, ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటివి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Show More
Back to top button