
ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అద్భుత దృశ్యకావ్యంగా నిలిచిన ‘అవతార్’ ఫ్రాంచైజీ నుండి మూడవ భాగం ‘అవతార్-ఫైర్ అండ్ యాష్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ పండోరా ప్రపంచం, ఈసారి అగ్నిపర్వతాల నేపథ్యంలో సాగుతుంది. మరి ఈ చిత్రం మునుపటి భాగాల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
స్క్రీన్‌ప్లే విశ్లేషణ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈసారి పండోరాలోని అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే ‘యాష్ పీపుల్’ అనే కొత్త తెగను పరిచయం చేశారు. ప్రకృతిని ప్రేమించే నావీలకు భిన్నంగా, క్రూరంగా ఉండే ఈ తెగతో జేక్ సల్లీ కుటుంబం జరిపే పోరాటం విజువల్ పరంగా అద్భుతంగా ఉంది. అయితే, కథనం విషయంలో దర్శకుడు తడబడ్డారు. మొదటి భాగం ఇచ్చిన అడ్రినలిన్ రష్, ఈ సినిమాలో లోపించింది. కథ నెమ్మదిగా సాగడం, గతంలో చూసిన సన్నివేశాలే మళ్లీ చూస్తున్నట్లు అనిపించడం సినిమాకు ప్రధాన బలహీనతలుగా మారాయి.
నటీనటులు, సాంకేతికత నటన: సామ్ వర్తింగ్టన్, జియో సాల్డానా తమ పాత్రలను యధావిధిగా అద్భుతంగా పండించారు. కొత్తగా పరిచయమైన యాష్ పీపుల్ పాత్రలు ప్రభావవంతంగా ఉన్నాయి.
సాంకేతికత: విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఈ సినిమాకు ప్రాణం. ప్రతీ ఫ్రేమ్‌లో జేమ్స్ కామెరూన్ తీసుకున్న డిటైలింగ్ అబ్బురపరుస్తుంది. ముఖ్యంగా 3D మరియు PCX స్క్రీన్లపై ఈ సినిమా ఒక అద్భుతమైన దృశ్య అనుభూతిని ఇస్తుంది. అయితే, 3 గంటల 17 నిమిషాల నిడివి ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెడుతుంది. సంగీతం మరియు ఎడిటింగ్ ఆశించిన స్థాయిలో లేవు.
ప్లస్ పాయింట్స్:
మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరియు టాప్ నాచ్ VFX.
3D ఎఫెక్ట్స్ మరియు అగ్నిపర్వత ప్రాంతాల చిత్రీకరణ.
నటీనటుల పరిణతి చెందిన నటన.
టెక్నికల్ గ్రాండియర్.
మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ మరియు సాగదీసిన కథనం.
3 గంటల పైగా ఉన్న భారీ నిడివి.
నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోవడం.
దర్శకుడి మార్క్ ఎమోషన్స్ లోపించడం.
చివరిగా… ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ – విజువల్స్ పరంగా ఒక మాస్టర్ పీస్ కానీ, కథ పరంగా నిరాశపరిచే చిత్రం. కేవలం వెండితెరపై ఆ అద్భుత ప్రపంచాన్ని, టెక్నాలజీని ఆస్వాదించాలనుకునే వారు తప్పకుండా చూడవచ్చు. కథలో బలం ఆశించే వారికి మాత్రం ఇది కొంత అసంతృప్తిని మిగిల్చవచ్చు.
రేటింగ్ : 2.75/5










