GREAT PERSONALITIESTelugu Special Stories

భరత మాత ముద్దు బిడ్డ నేతాజీ

దేశ పౌరులకు స్ఫూర్తిదాయకం ఆయన మాటలు… తెల్లదొరలను వణికించిన ధీరుడు…

భారతదేశ జాతీయ హీరో చంద్రబోస్…

సాయుధ సంగ్రామమే న్యాయమని.. స్వతంత్ర భారతావని మన స్వర్గమని చాటిన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్.  విప్లవకారుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ ని నేతాజీ అని కూడా అంటారు. ‘నీ రక్తాన్ని ఇస్తే నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను’ అంటూ.. దేశ యువతలో అణువణువునా ధైర్యపు మాటలు నింపిన ఆకర్షణీయమైన నాయకుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ 1897 సంవత్సరంలో జనవరి 23న ఒరిస్సా రాష్ట్రం కటక్ లో జన్మించారు. నేతాజీ దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ప్రముఖ పాత్రను పోషించారు. గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో అహింసతో ఉద్యమం చేయాలనే నియమానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ హింస లేనిది స్వాతంత్రం సాధించలేమని కొన్నిసార్లు గాంధీజీకి విరోధిగా కూడా మారాడు. బ్రిటిష్ శక్తులకు వ్యతిరేకంగా నేతాజీ పోరాటం చేశాడు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ భారతీయ విప్లవకారుడుగా పేరుపొందాడు నేతాజీ.

సుభాష్ చంద్రబోస్ బాల్యం…

సుభాష్ చంద్రబోస్ స్వస్థలం ఒరిస్సా రాష్ట్రం కటక్. ఆయన తల్లిదండ్రులు క్షత్రియ వంశానికి చెందినవారు.  తండ్రి జానకినాథ్ న్యాయవాది,  తల్లి ప్రభావతి బోస్ గృహిణి. వీరికి 13 మంది సంతానం. వారిలో సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ సంతానం. సుభాష్ చంద్రబోస్ కుటుంబం అతి సంపన్నమైన కుటుంబంతో పాటు అతిపెద్ద కుటుంబం. సుభాష్ ఐదేళ్ల వయసులో సోదరులతో కలిసి కటక్ లోని బాప్టిస్టు మిషన్ యొక్క ప్రొటెస్టెంట్ యూరోపియన్ పాఠశాలలో చేరారు. అక్కడి పాఠశాలలో అన్ని బ్రిటిష్ భౌగోళిక, బ్రిటిష్ చరిత్ర, బైబిల్, లాటిన్ భాషలు మాత్రమే బోధించేవారు. భారతీయ భాషలను బోధించేవారు కాదు.

అంతేకాకుండా బ్రిటిష్ పిల్లలను ఒక వైపు, భారతీయ పిల్లలను ఒక వైపు  కూర్చోబెట్టేవారు. ఈ విధానం చంద్రబోస్ కి అసలు నచ్చేది కాదు.  చంద్రబోస్ చిన్నతనంలో ముభావంగా ఉండే ఎవరితో కలిసి వాడు కాదు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లతో కూడా సరదాగా గరిపేవాడు కాదు. సుభాష్ తల్లి హిందూ దేవతలను ఆరాధించేది దుర్గ మాతను ఎక్కువగా పూజించే ఆమె రామాయణం భారతం ఇతిహాసాలను నేతాజీకి వివరించేది అలా చంద్రబోస్ దేశ ఖ్యాతిని పౌరాణిక కథలను తెలుసుకునేవారు బాల్యమంతా చంద్రబోస్ ఇంట్లో తోట పని చేస్తూ తల్లితో కలిసి పని చేస్తూ ఉండేవాడు కానీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం పాటలు వాడడం ఇలాంటివి చేసేవాడు కాదు సుభాష్ చంద్రబోస్ అన్నయ్య జాంకి నాథ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు. అయిన ఓ గొప్ప పేరు పొందిన న్యాయవాది.

చంద్రబోస్ విద్యాభ్యాసం…

పాఠశాల విద్యాభ్యాసం ముగిసిన అనంతరం చంద్రబోస్ 15 ఏళ్ల వయసులో హై స్కూల్ అండ్ రావింసా కాలేజీలో నేతాజీ చేరారు. అక్కడ చంద్రబోస్ ఎంతో స్వేచ్ఛగా ఉండేవాడు తోటి విద్యార్థులతోనూ కలిసిపోయేవాడు. ఆయనకి ఆ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడుగా ఉన్న బాపు వేణి మాధవ్ దాస్ అంటే ఎంతో అభిమానం, ఇష్టం, గౌరవం ఉండేది. ఒకరోజు ఆ ప్రధానోపాధ్యాయుడికి బదిలీ అయింది. దీంతో సుభాష్ చంద్రబోస్ ఆయన దగ్గరికి వెళ్లి తీవ్రంగా ఏడవసాగాడు. ప్రధానోపాధ్యాయులు చంద్రబోస్ ని ఓదార్చి నేను వెళ్లిపోయినా నీకు ఉత్తరాలు రాస్తాను. నువ్వేమీ బెంగ పెట్టుకోకు అని చెప్పాడు. నీకు జీవితంలో దిగులు, బాధ ఉంటే ప్రకృతితో గడుపు. అన్ని బాధలు పోయి ప్రశాంతంగా ఉంటావు అని చెప్పి ఓదార్చరు. ఆయన వెళ్లిపోయిన తర్వాత బాధగా ఉన్న ప్రతిసారి చంద్రబోస్ ఎవరితో మాట్లాడకుండా ప్రకృతిలో కాసేపు గడిపేవాడు.

ఓ నాడు చంద్రబోస్ ఇంటి సమీపంలో ఆయన బంధువు ఒకాయన అద్దెకు దిగాడు. ఆయనని చూడడానికి చంద్రబోస్ వెళ్ళాడు. ఆ బంధువు వద్ద స్వామి వివేకానందుని పుస్తకాలు చంద్రబోస్ కి దర్శనమిచ్చాయి. వాటిలో ఒక పుస్తకాన్ని చంద్రబోస్ తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఒకరోజు తీరికగా పుస్తకాన్ని మొత్తం చదివాడు. అప్పటినుండి స్వామి వివేకానంద గురించి మరింత తెలుసుకోవాలని ఆలోచనతో ఆయన వివేకానందుని పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. అనంతరం వివేకానందుని గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస పుస్తకలను సైతం చదివేవాడు అప్పటినుండి చంద్రబోస్ ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రపంచమంటే ఏంటో తెలుసుకున్నాడు మానవసేవే మాధవసేవ అని గ్రహించాడు. తాను కూడా ఏదో ఒక సేవ చేయాలి అన్న ఉద్దేశంతో చదువుకు దూరంగా ఉన్నటువంటి పేద విద్యార్థులని అక్కున చేర్చుకుని వారి దగ్గరికి వెళ్లి వారికి చదువులు నేర్పించేవాడు.

ఆయన పేద విద్యార్థులను ఆదరించినట్టుగానే వివేకానందునికి ఆదర్శంగా తీసుకున్న యువకులందరి ఒకచోట గ్రూప్ గా చేర్చి వారితో కూడా పేద విద్యార్థులకు చదువు నేర్పించేవాడు. పేదలకు సేవలు అందిస్తూనే 1913లో మెట్రిక్యులేషన్ యూనివర్సిటీ లో 2వ ర్యాంకులో పాసయ్యాడు. అనంతరం బోస్ తండ్రి జనకినాధ్ బోస్ ని ఉన్నత చదువుల నిమిత్తం కలకత్తాలోని ప్రముఖమైన ప్రసిడెన్సీ కళాశాలలో చేర్పించారు. అయినప్పటికీ చంద్ర బోస్ తన ఆధ్యాత్మిక కార్యకలాపాలను ఆపలేదు. కలకత్తా చుట్టూ ఉన్న బెనారస్, వారణాసి లోని గురువులను కలవడం వివిధ మఠాధిపతులను కలవడం చేసేవాడు. వివేకానంద భావాలను నేతాజీ చేర్చుకున్నాడు. అంతేకాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించడంతోపాటు ఇంటింటికి వెళ్లి పాత దుస్తులను అడిగి వాటిని పోగు చేస్తూ  పేదలకు పంచిపెట్టేవాడు.

ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేతాజీ సైకాలజీ, ఫిలాసఫీ కోర్సులు చేశారు. డిగ్రీ చదువుతున్నప్పుడు విప్లవ వీరులు బ్రిటిష్ వారి చేతిలో చనిపోవడం నేతాజీ తెలుసుకున్నాడు.

తెలుగు విద్యార్థులతో సమ్మె…

కలకత్తాలో కొందరు తెలుగు విద్యార్థులంతా కలిసి వెళుతూ గట్టిగా మాట్లాడుతూ ఉండగా ఇండియన్ ఎడ్యుకేషనల్  సర్వీస్ అధికారి ఓల్ట్..   విద్యార్థులను కొట్టారు. వాళ్లు ఈ విషయాన్ని చంద్రబోస్ కు తెలియజేశారు. బోస్ వాళ్ళని తీసుకెళ్లి ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి ఓట్స్ పై ఫిర్యాదు చేశాడు. అయితే.. ఓట్స్ పెద్ద అధికారి. కాబట్టి తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని ప్రిన్సిపాల్ అన్నారు. దీంతో వీరితో ఇలా కాదు అని చంద్రబోస్ భారత విద్యార్థులందరినీ కూడగట్టి సమ్మె చేశారు. ఒక్కరోజు లోనే ఈ విషయం అంత కలకత్తాకు తెలిసిపోయింది. దీంతో ప్రిన్సిపల్  అధికారి ఓట్స్ ను బ్రతిమాలి వాళ్లకి క్షమాపణ చెప్పించాడు. 

అంతటితో విద్యార్థులు సమ్మెను విరమించారు.

కళాశాల నుండి చంద్రబోస్ సస్పెండ్…

కళాశాలలో విద్యార్థుల సమ్మె జరిగిన నెలరోజులకు తెలుగు విద్యార్థులను ఓట్స్ ఏదో విషయంపై చర్చించి కొట్టాడు. ఈ విషయం చంద్రబోస్ కు కూడా చెప్పకుండా ఓట్స్ ను కింద పడేసి తెలుగు విద్యార్థులు కొట్టారు. దీంతో ఇది అతి పెద్ద సమస్యగా మారింది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం సీరియస్ అయింది. వీటన్నింటికీ చంద్రబోసే కారణం అంటూ కళాశాల యజమాన్యం బోస్ తో పాటు కొందరు తెలుగు విద్యార్థులను సస్పెండ్ చేసింది. అయితే ఓట్స్ కి మీరంతా క్షమాపణ చెప్తే సస్పెండ్ ని వెనక్కి తీసుకుంటామని కళాశాల యాజమాన్యం చెప్పినప్పటికి చంద్రబోస్ దానికి అంగీకరించలేదు. మా వారు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఓట్స్ విద్యార్థులను కొట్టడం వల్లే ఇలాగ జరిగింది. మేము క్షమాపణ చెప్పము అని చెప్పి తెగేసి చెప్పారు. అంతటితో కళాశాల యాజమాన్యం విద్యార్థులతో పాటు చంద్రబోస్ ను సస్పెండ్ చేసింది. ఈ గొడవ అనంతరం చంద్రబోస్ కలకత్తా నుండి ఒరిస్సా తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు బోస్.

కలరా, మసూచి బాధితులకు అండగా చంద్రబోస్…

కళాశాలలో సస్పెండ్ చేసిన అనంతరం చంద్ర బోస్ ఒరిస్సాకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ కలరా, మసూచి వ్యాధి  ప్రబలి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకున్న చంద్ర బోస్  సేవ కార్యక్రమాలు చేసేందుకు ముందుకు సాగాడు. తమ స్నేహితులతో ఒక యూనియన్ ఏర్పాటు చేసి కలరా, మసూచి వ్యాధిగ్రస్తులను విరాళాలు సేకరించి ఆదుకున్నాడు. కలరా వ్యాధి ద్వారా చనిపోయిన వారి శవాలను ముట్టుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో శవాలు అన్నింటిని పోగుచేసి విరాళాలు సేకరించి చంద్రబోస్ సామూహిక దహన కార్యక్రమాలు చేశారు. ఈ విధంగా ఓ సంవత్సరం పాటు పేదలకు వ్యాధిగ్రస్తులకు తన సేవలను అందించాడు. ఇదంతా చూసిన అతని తల్లి చంద్రబోస్ ఇక్కడే ఉంటే తన జీవితం ఎలా అవుతుందో అని భయపడి తనను లండన్ పంపించి ఉన్నత చదువులు చదివిద్దామని చంద్రబోస్ తండ్రితో చెప్పింది.

లండన్ పంపించి ఉన్నత చదువులు చదివిద్దాం అనుకుంటే కలకత్తాలో సస్పెన్షన్ ఎత్తివేయాలి అని మరోసారి కలకత్తాలోని కళాశాలకు చేరుకున్నాడు చంద్రబోస్. అయితే.. సస్పెన్షన్ కాలం ముగియకపోవడంతో సస్పెన్షన్ ఎత్తివేయలేమని కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. కళాశాలలో సస్పెన్షన్ ఎత్తివేసే వరకు చంద్రబోస్ ఓపిక పట్టాడు.  అనంతరం 1917లో జూలైలో స్కాటిక్ చర్చ్ కళాశాలలో చేరాడు చంద్రబోస్. కొన్ని రోజుల తర్వాత ఆ కళాశాలలో మిలిటరీ శిక్షణ కూడా అందించడం ప్రారంభించారు. శిక్షణ తీసుకున్న చంద్ర బోస్ కవాతు బాగా చేసేవాడు. డిగ్రీ మిలిటరీ పూర్తి చేసి ఎంఏ అప్లైడ్ ఫిలాసఫీ చదువుదాం అనుకున్నాడు. ఇంతలో సుభాష్ తండ్రి  తనని ఐసీఎస్  చదివించాలని అనుకున్నాడు. బోస్ కు ఇష్టం లేకపోయినా తండ్రి కోసం ఒప్పుకున్నాడు. వారం రోజుల్లో పాస్పోర్ట్ తీసుకుని 1919న ఓడ ఎక్కి నెల పది రోజులు ప్రయాణం చేసి లండన్ వెళ్లి ఐసిఎస్ కోర్సు కోసం యూనివర్సిటీలో దిగాడు. ఐసిఎస్ విద్యలో యూనివర్సిటీ ఫోర్త్ ర్యాంకు పాస్ అయ్యాడు చంద్రబోస్. 

బోస్ ను ప్రభావితం చేసిన లోకమాన్య గంగాధర్ తిలక్ మాటలు… 

ఓనాడు లోకమాన్య గంగాధర్ తిలక్ లండన్ వచ్చాడు. తెలుగు విద్యార్థులను కూడగట్టి సమావేశం ఏర్పాటు చేశారు. మనమంతా ఉన్నత చదువులు చదువుకుని విజ్ఞానవంతులు అయ్యామని అన్నాడు. మన విజ్ఞానాన్ని బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి ఉపయోగించుకోవాలని తెలిపాడు. భారతదేశాన్ని కాపాడుకోవాలని మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటాలు చేయాలని వారికి ప్రభావంతమైన మాటలు చెప్పాడు. ఆ సమావేశాలు చంద్ర బోస్ ను ఎక్కువగా ప్రభావితం చేశాయి.   ఈ మాటలతో ప్రభావితం అయిన చంద్రబోస్ ఓనాడు  దేశ బంధు చిత్త రంజన్ దాసుకు, గాంధీజీ కి లేఖ రాశాడు. తమని కలవాలనుకుంటున్నట్టుగా లేఖలో పేర్కొన్నాడు. దానికి వారి నుండి ప్రత్యుత్తరం కూడా వచ్చింది.

1921 జులై 16న చంద్రబోస్ ముంబై వెళ్లి గాంధీజీని కలిశాడు. తెలుగు యువకులంతా ఒకటై బ్రిటిష్ వారికి పన్ను కట్టకుండా తరిమికొట్టి, సంవత్సర కాలంలో స్వాతంత్రం వచ్చేలా చేద్దాం అని గాంధీజీ అన్నాడు. సహాయ నిరాకరణ ఉద్యమానికి అందరూ చేయూతను ఇవ్వాలని చంద్రబోస్ కు గాంధీజీ తెలిపాడు.  సహాయ నిరాకరణ ఉద్యమం చేయడం ద్వారా భారతీయులకు నష్టం జరుగుతుందని చంద్రబోసు గ్రహించాడు. గాంధీజీకి కొన్ని ప్రశ్నలు వేశాడు. 

ఆ ప్రశ్నలన్నింటికీ గాంధీజీ సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో గాంధీజీ మాటలకి సంతృప్తి చెందని చంద్రబోస్ ముంబై నుండి కలకత్తా వచ్చి దేశ బందు చిత్త రంజన్ ని కలిశారు. ఆయనతో మాట్లాడారు. చిత్తరంజన్ మాటలకు ప్రభావితమైన బోస్ ఇటువంటి వ్యక్తి వద్దనే పనిచేయాలి గాంధీజీ దగ్గర కాదు అనుకుని నిర్ణయించుకున్నాడు.

చంద్రబోస్ రాజకీయ ప్రవేశం…

చంద్రబోస్ లో ఉన్నటువంటి న్యాయకత్వ లక్షణాలు, దృడ సంకల్పం చూసి చిత్త రంజన్ కాంగ్రెస్ యువజన సంఘంలోని యూత్ వాలంటరీ వింగ్ లీడర్ గా చంద్ర బోస్ ని నియమించాడు. అలాగే కాంగ్రెస్ ప్రచార కమిటీకి అధ్యక్షుడిగా కూడా నియమించారు. స్వతంత్ర ఉద్యమంలో చేరిన తెలుగు యువతను బ్రిటిష్ వారు కాలేజీలో చేర్పించుకోకపోతే అలాంటి వారి కోసం చిత్తరంజన్ తన సొంత డబ్బుతో ఒక నేషనల్ కాలేజీని స్థాపించాడు. ఆ కాలేజీకి చంద్రబోస్ ను ప్రిన్సిపల్ గా  చేసాడు. మూడు పనులను చిత్తశుద్ధితో ఆదర్శవంతంగా చేస్తూ ఎంతో మంది యువత ఉద్యమంలో పాల్గొనేలా చేస్తూ చిత్తరంజన్ దాసుకి ప్రియ శిష్యుడుగా మారాడు చంద్రబోస్.

ఇదిలా కొనసాగుతున్న రోజుల్లో బ్రిటిష్ యువరాజు కలకత్తా వచ్చాడు. ఆయన రాకను స్వాగతిస్తు బ్రిటిష్ పోలీసులు, సిబ్బంది  కవాతు చేసారు. వారికి వ్యతిరేకంగా తన వాలంటీర్ సభ్యులతో కలకత్తా వీధుల్లో కవాతు చేయించాడు    చంద్రబోస్. ఈ సంఘటనతో బ్రిటిష్ అధికారులు బెదిరిపోయి  బోస్ తో పాటు కవాతు చేస్తున్న అందరిని జైలులో వేశారు. జైలులో సరిపడా స్థలం లేకపోవడంతో మరుసటి రోజు అందరిని విడిచిపెట్టారు. కానీ చంద్రబోస్ ఎవరు అనేది మొత్తం బ్రిటిష్ అధికారులు ఆరా తీశారు. చంద్రబోస్ ను చిత్తరంజన్ ను ఆరు నెలలపాటు కోర్టులుకోర్టులో విచారించి వారి చర్యలకు  ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. కోర్టులో ఆ తీర్పు విన్న చంద్రబోస్ ఒక్కసారిగా నవ్వాడు. జడ్జి ఎందుకు నవ్వుతున్నావని అడగగా మేము బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశాము, ఉద్యమాలు చేశాము, ఇలాంటి పెద్ద సంఘటనకు కేవలం 6 నెలల జైలు శిక్ష వేయడం ఏంటి అందుకే నవ్వొచ్చింది అన్నారు. తర్వాత 1922 సెప్టెంబర్ లో వారిద్దరిని బ్రిటిష్ వారు విడుదల చేశారు.

విపత్తు సమయంలో ఆదుకున్న చంద్రబోస్..

ఇదే సమయంలో బెంగాల్లో భారీ ఎత్తున వరదలు సంభవించి ప్రాణ నష్టం జరుగుతుంది. వరదలు కొట్టుకుపోయిన వారిని కాపాడడం, పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయడం, అనాధలను అక్కున చేర్చుకోవడం వారికి కావలసిన కార్యకలాపాల నిర్వర్తించడం వంటి సేవా కార్యక్రమాల్లో చంద్రబోస్ మిగతా సభ్యులు పాల్గొన్నారు.

స్వరాజ్ పార్టీ ఏర్పాటు…

కొన్ని రోజుల తర్వాత గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అప్పుడు చిత్తరంజన్ మాట్లాడుతూ.. మనం బ్రిటిష్ వారికి ఎదురెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దాం. వారిని కూడా పోటీ చేయమందం. ఓటింగ్ ద్వారా మనం గెలిస్తే స్వాతంత్రం సాధించడం సులభం అవుతుందని సలహా ఇచ్చాడు. దీనికి గాంధీ ఒప్పుకోలేదు. వారికి ఎదురెళితే మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి మనం అహింస పద్ధతిలో వెళ్దాం అన్నాడు. గాంధీజీ పద్ధతి చంద్రబోస్ కు చిత్తరంజన్ కు,  మరి కొందరికి నచ్చలేదు. వెంటనే కాంగ్రెస్ పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. చంద్రబోస్ కూడా చిత్తరంజన్ అడుగుజాడల్లో నడిచారు.

అంతా కలిసి జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతిలాల్ నెహ్రూని, వల్లభాయ్ పటేల్ సోదరుడు విటల్  పటేల్ ను చిత్తరంజన్ దాసు కలిశారు. వారితో సమావేశం నిర్వహించి “స్వరాజ్ పార్టీ”  ని కొత్తగా ఏర్పాటు చేశారు.  పార్టీ ప్రధాన కార్యదర్శిగా మోతిలాల్ నెహ్రుని నియమించారు. యువ జన విభాగానికి, యూత్ వాలంటీర్ వింగ్ కు అధ్యక్షుడుగా చంద్రబోస్ ను నియమించారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తెలియడం కోసం 1923 అక్టోబర్ లో “ఫార్వర్డ్” అనే పత్రికను స్థాపించారు. దీనికి సంపాదకుడిగా చంద్రబోస్ కే బాధ్యతలను అప్పగించారు. ఇదే సమయంలో కేంద్ర రాష్ట్ర సభలలో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి స్వరాజ్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారు. పార్టీతో కలిసి నడిచారు. దీంతో గాంధీజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పునరాలోచించి ఇలా అయితే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని గ్రహించి స్వరాజ్ పార్టీ సిద్ధాంతాలను మేము కూడా గౌరవిస్తున్నామని వారికి మద్దతు ఇచ్చారు.

తన జీతాన్ని పేద విద్యార్థుల చదువుకు వినియోగించిన చంద్రబోస్…

స్వరాజ్ పార్టీ ద్వారా గుర్తింపు వచ్చిన తర్వాత కలకత్తాను మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ పట్టణం చేశారు. కార్పొరేషన్ కు 1924లో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్ పార్టీ తరఫున చిత్తరంజన్ దాస్ కార్పొరేటర్ గా ఎన్నుకోబడ్డాడు. ఆ విధంగా కలకత్తా కార్పొరేషన్ కు మొట్టమొదటి కార్పొరేటర్ చిత్తరంజన్ దాసు అయ్యారు. ముఖ్య కార్యదర్శిగా బోసును నియమించారు. ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నందుకు అప్పట్లో చంద్రబోస్ కు నెలకు 3000 రూపాయల జీతం అందేది. అందులో 1500 రూపాయలు కార్పొరేషన్ పనులకు ఇచ్చేసి, 1500 పేద విద్యార్థులు చదువుల కోసం వినియోగించేవారు చంద్రబోస్. కార్పొరేషన్ లో పనిచేస్తున్న బ్రిటిష్ వారిని సైతం తనదైన క్రమశిక్షణతో నడిచేటట్టు శాసించేవారు. వారిని ఎదిరించి అదుపులో పెట్టేవారు.

కనుమరుగైన స్వరాజ్ పార్టీ…

1924 లో ఓ నాడు గోపీ నర్సా అనే యువకుడు బ్రిటిష్ పోలీస్ నౌకరిని చంపేందుకు ప్రయత్నించినందుకు ఆ యువకుడిని ఉరివేసి చంపేశారు. ఆ మృతదేహాన్ని అమరవీరుడిగా ఊరేగిస్తూ తీసుకెళ్లాలని చంద్రబోస్ ప్రయత్నించాడు. తన ప్రయత్నాన్ని బ్రిటిష్ అధికారులు అడ్డుకున్నారు. చంద్రబోస్ ను అరెస్టు చేశారు. బోసు అరెస్ట్ తో కలకత్తా ప్రజలంతా ఊరేగింపులు, నిరసనలు, నినాదాలు చేశారు. బోసు జైలులో ఉంటూనే తన బెటాలియన్లను రప్పించుకొని తన పనులు సాగించేవారు. జైలులో ఉండి కూడా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఇటువంటి వ్యక్తి ఎప్పటికైనా ప్రమాదమని గ్రహించిన బ్రిటిష్ సర్కార్ అతి ప్రమాదకారి అనే నింద వేసి బర్మా లోని మాండలే అనే జైలులో బోస్ ను బంధించారు. ఆయన జైలులో ఉండగా కలకత్తాలోని ఆయన గురువు చిత్తరంజన్ దాస్ 1925 జూన్ 16న అనారోగ్యంతో మరణించారు.

ఈ విషయం తెలిసి బోస్ ఆవేదన చెందాడు. అయినప్పటికీ తన గురువు సంకల్పాన్ని నెరవేర్చాలి అనుకున్నాడు. క్రిస్టియన్లకు, ముస్లింలకు వారి వారి పండుగలకు నిధులు ఇచ్చే బ్రిటిష్ ప్రభుత్వం హిందువులపై వివక్ష చూపేది. ఈ విషయం పట్ల చంద్రబోస్ జైలులో ఉంటూనే నిరాహార దీక్ష చేశారు. దీనివల్ల బోస్ బ్రాంక్ నిమోనియా అనే ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధికి ఇండియాలో వైద్యం లేదు స్విట్జర్లాండ్ లో ఉన్నదని ఈ విషయం తెలిసి కలకత్తా ప్రజలు నిరసనలు చేయడం వల్ల జైలు నుండి బ్రిటిష్ ప్రభుత్వం చంద్రబోస్ ను విడుదల చేసింది. అనంతరం  స్విట్జర్లాండ్ వెళ్లి వైద్యం చేయించుకుని 1927 అక్టోబర్ లో తిరిగి కలకత్తా వచ్చాడు.  చిత్తరంజన్ మరణం, బోసు జైలు జీవితం వల్ల స్వరాజ్ పార్టీని నడిపించేవారు లేక ఆ పార్టీ కనుమరుగయ్యింది.

ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీ గా చంద్రబోస్..

తన కార్య కలాపాలు కొనసాగించాలంటే రాజకీయ జీవితం ముఖ్యమని భావించిన చంద్రబోస్ ఓనాడు మద్రాసులో జరిగే కాంగ్రెస్ మహాసభలకు వెళ్లాడు. బోసుని ఆల్ ఇండియా సెక్రటరీగా అక్కడి కాంగ్రెస్ నాయకులు ఎన్నుకున్నారు. తర్వాత దేశం మొత్తం బోసు గురించి తెలిసింది. 1928లో కార్మికులందరూ తమ డిమాండ్ల నెరవేర్చాలని సమ్మె చేస్తుంటే వారికి మద్దతుగా చంద్రబోస్ నిలిచాడు. అందుకు వారంతా కలిసి చంద్రబోస్ ను  భారత ట్రేడ్ యూనియన్ కి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 1928 డిసెంబర్లో కలకత్తాలో  జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సైతం చంద్రబోస్ పాల్గొన్నారు. అహింస మార్గంలో స్వాతంత్రం సాధించాలని గాంధీజీ నిదానంగా మార్గాన్ని అన్వేషిస్తుండగా చంద్రబోస్ గాంధీజీ తో స్వాతంత్రం వచ్చేటట్టు లేదని తన కార్యకలాపాలను వేగంగా కొనసాగించాడు. దీంతో అప్రమత్తమైన బ్రిటిష్ ప్రభుత్వం 1930 జనవరి 21న మరోసారి చంద్రబోస్ ను జైలులో పెట్టింది.

ఫార్వర్డ్ బ్లాక్ సంస్థను స్థాపించిన చంద్రబోస్..

 బ్రిటిష్ వారితో సమావేశం ఏర్పాటు చేసిన గాంధీజీ స్వాతంత్ర యుద్ధం కోసం పోరాటం చేస్తున్న తమ భారతీయులందరినీ, జైల్లో ఉన్న వారిని విడిచి పెట్టాలని బ్రిటిష్ వారితో వాదించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ తో సహా బ్రిటిష్ వారితో వాగ్వాదానికి దిగారు. స్వాతంత్ర సమరయోధులు అంతా బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. దీంతో చంద్రబోస్ తో పాటు మిగిలిన భారతీయులను జైలు నుండి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూలా సన్నిహిత సహచరుడుగా సుభాష్ చంద్రబోస్ కొన్నాళ్ళు పనిచేశారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

అనంతరం సిద్ధాంతిక విభాగాల కారణంగా వారి నుండి చంద్రబోస్ విడిపోయారు. 1939లో దేశంలోని బ్రిటిష్ వ్యతిరేక శక్తులు అన్నింటిని ఏకం చేయాలని ఉద్దేశంతో ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే సంస్థను స్థాపించాడు చంద్రబోస్. జపనీయుల సహాయంతో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించాడు. సాయుధ తిరుగుబాటు ద్వారా దేశంలోని బ్రిటిష్ పాలనను పడగొట్టడానికి శాయశక్తుల ప్రయత్నించాడు. అయితే.. ఆ తిరుగుబాటు విజయవంతం కాకపోవడంతో పాటు చంద్రబోస్ ను అరెస్టు చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు జైలు జీవితం గడిపిన చంద్రబాబు ఎట్టకేలకు జైలు నుండి తప్పించుకొని భారతదేశంలో తను కనిపిస్తే కాల్చివేస్తారని జర్మనీకి పారిపోయాడు. అక్కడ ఫ్రీ ఇండియా సెంటర్ ఇండియన్ అనే భారతీయ సైనికుల బృందాన్ని ఏర్పాటు చేసి జర్మన్ సైన్యంతో కలిసి పోరాటాలు చేశారు.

ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటు…

చంద్రబోస్ 1943లో జర్మనీ ని విడిచిపెట్టి జపాన్ వెళ్లాడు. అక్కడ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. బర్మా ప్రచారంలో జపాన్ తో కలిసి పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ని కూడా చంద్రబోస్ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా నిర్విరామంగా పోరాటాలు చేశాడు. బ్రిటిష్ శక్తులను తరిమికొట్టేందుకు తనవంతుగా కృషి చేశాడు. సైనికులను ఒక చోట చేర్చి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపాడు. రక్తం చిందితేనే రాజ్యం ఏర్పడుతుందని వారికి తెలిపాడు. ప్రతి మనిషి ఓ సైనికుడై ప్రాణార్పణ చేయాలని నినాదాలు చేశాడు.

గగన సిగలకు ఎగిసి కనుమరుగైన నేతాజీ…

స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటాలు చేసిన ఆ మహనీయుడు 1945 ఆగస్టులో తైవాన్ కు వెళ్లే విమానంలో ప్రమాదానికి గురై మరణించినట్లు సమాచారం. కానీ నిర్ధారణ కాలేదు. విమానం ప్రమాదానికి గురైన మాట నిజమే కానీ చంద్రబోసు మరణం ధ్రువీకరించబడలేదు.

కొంతకాలానికి ఆయన ఓ సాధువు రూపంలో తిరుగుతున్నాడని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. అవి ఎంతవరకు నిజం అనేది తెలియని విషయం. స్వాతంత్ర ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించి, యువతకు ప్రేరణను కలిగించి, ఎన్నోసార్లు ప్రజల కోసం జైలు జీవితాన్ని అనుభవించిన మహనీయుడు మన నేతాజీ. ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం.

Show More
Back to top button