HEALTH & LIFESTYLE

శీతాకాలంలో టాన్సిలైటిస్ (గవద బిళ్లలు) మీ పిల్లలకూ సోకవచ్చు..

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు టాన్సిలైటిస్ బారిన పడుతున్నారు. గొంతులో నాలుక వెనుక భాగానికి ఇరువైపులా ఉండే రెండు కణుతులను టాన్సిల్స్‌ అంటారు. ఈ టాన్సిల్స్‌ నోటి ద్వారా మన శరీరంలోని ప్రవేశించే వైరస్, బ్యాక్టీరియాను మొదటగా అడ్డుకుంటాయి. కానీ చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి తరుచూ ఇవి వాపుకు గురౌతాయి. వయస్సు పెరుగుతున్న కొద్ది టాన్సిల్స్ క్షీణిస్తాయి. టాన్సిల్స్ అనేవి లింపోసైట్స్‌ని విడుదల చేసి రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. లింపోసైట్స్ ఇన్ఫెషన్స్‌కి వ్యతిరేకంగా పోరాడతాయి. టాన్సిల్స్‌కు వైరస్, స్టెప్టోకోకస్ లాంటి బ్యాక్టీరియాల వల్ల చీము పడితే వాటి విధుల్ని సరిగ్గా నిర్వహించకపోగా ఈ చీము రక్తనాళాల ద్వారా ఇతర బాగాలకు పాకి అనేక రోగాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం పిల్లల్లో ఈ వ్యాధి నిరోధించడానికి న్యుమోకోకల్, ఇన్ఫ్లూయెంజా అనే వ్యాక్సిన్స్ తప్పనిసరైన వ్యాక్సిన్ల కోర్సులో చేర్చారు. 

లక్షణాలునివారణ..

టాన్సిలైటిస్‌ని గవదబిళ్లలు అని కూడా అంటారు. గొంతు నొప్పి, ఆహారం మింగటంలో కష్టం, 100 డిగ్రీల సెల్సియస్ జ్వరం, ఒళ్ళు నొప్పులు, చెవిపోటు, మలబద్ధకం ఈ వ్యాధి లక్షణాలు. సాధారణ టాన్సిలైటిస్ మందులు వాడి పూర్తిగా నివారించవచ్చు. తరచుగా టాన్సిలైటిస్‌ వ్యాధి వస్తున్నా, సరైన చికిత్స అందిచకపోతే తీవ్రత ఎక్కువై క్రానిక్‌ టాన్సిలైటిస్‌ మారుతుంది. ఇది అంటువ్యాధి దగ్గరగా ఉండటం, అపరిశుభ్ర వాతావరణం, దుమ్ము ధూళి ద్వారా, ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు గాలి, తుంపర్లలో బాక్టీరియా, వైరస్‌లు ఒకరి నుండి మరొకరికి టాన్సిలైటిస్‌ వ్యాధి సంక్రమించవచ్చు. చిన్నపిల్లలలో ఈ వ్యాధి ఎక్కువగా కనబడుతుంది. రోగికి మెత్తని ఆహారం, సరైన పోషణ, విశ్రాంతి ఇవ్వాలి. దవడలకు వేడినీటి కాపడం హాయినిస్తుంది. కడుపులో నొప్పి వంటి ఇతర లక్షణాలుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. వీరికి అవసరమైతే స్టెరాయిడ్స్‌ వంటివి ఇస్తారు. 

Show More
Back to top button