Telugu News

బ్లూ ఆధార్‌కు దరఖాస్తు ఇలా..

ఆధార్‌ కార్డు గురించి అందరికీ తెలిసిందే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్‌లో మన పూర్తి పేరు, చిరునామా, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఉంటాయి. ఎలాంటి ప్రభుత్వ పథకాలు పొందాలన్న ఆధార్‌ కార్డు తప్పనిసరి. అయితే, మీరు ఎప్పుడైనా బ్లూ ఆధార్ కార్డు గురించి విన్నారా..? 

దీనిని పిల్లల కోసం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేస్తుంది. ఇది నీలం రంగులో ఉంటుంది. 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలకు ఈ ఆధార్ కార్డును జారీ చేస్తారు. కాబట్టి దీనిని బాల ఆధార్‌గా కూడా పిలుస్తారు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత ఆధార్‌ కార్డును అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు 15 సంవత్సరాలు నిండిన తర్వాత మళ్ళీ అప్‌డేట్ చేయించుకోవాలి. 

దరఖాస్తు విధానం..

బ్లూ ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గరలోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌ నమోదు ఫారం తీసుకుని అందులో అన్ని వివరాలు నింపాలి. ఈ ఫారంలో తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. వాటితో పాటు పిల్లల తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు, చిరునామా రుజువు, పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, ఒక ఫొటో కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో తల్లిదండ్రుల వివరాలు ఉంటాయి.

కాబట్టి పిల్లల వేలిముద్రలు తీసుకోరు. దరఖాస్తు చేసుకున్న వెంటనే మొబైల్‌ నంబర్‌కు నమోదు ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది. ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవడం తప్పనిసరి. ఇందులో బ్లూ ఆధార్‌ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఉంటాయి. దీని తర్వాత 60 రోజుల్లో బ్లూ ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా మీ చిరునామాకు చేరుతుంది. బ్లూ ఆధార్‌కు దరఖాస్తు ఉచితంగా ఉంటుంది.

Show More
Back to top button