HISTORY CULTURE AND LITERATURE

శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి,వాటి చరిత్ర

శ్రీ చాముండీ అమ్మవారిని చాలా మంది నమ్ముతారు.కారణం అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుస్తుందని నమ్మకం ప్రజల్లో ఉంది.ఎనిమిది రూపాల్లో దర్శనమయ్యే అమ్మవారు ఈ చాముండీ రూపంలో చాలా ఉగ్రంగా కనిపిస్తారు,కానీ చల్లని దేవతగా పుజిస్తారు,అమ్మ మనసు వెన్న అని ఉగ్ర రూపం అయినా అమ్మవారు దీవెన ఉంటె చాలని నమ్ముతారు.

అయితే అసలు ఈ అమ్మవార్లను ఒక్క చోటనే కాకుండా అన్ని చోట్ల ప్రతిష్టించాలని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా పట కొదురు గ్రామంలో భరద్వాజ గోత్రానికి చెందిన ఐలావజల కుటుంబం మాతృ దేవతలను పూజించడంలో నిష్ణాతులు.

ఈ కుటుంబంలో 19౧౭ లో జన్మించిన శ్రీ వెంకట రమణయ్య శక్తి లేదా మాతృ దేవతలను ఆరాధించే సంప్రదాయంలో నిష్ణాతులు.వారిని ,వారి కుటుంబాన్ని గ్రామ దేవత అయిన ముక్కంటమ్మ దేవత ఆశిర్వధించింది.

ఆయుర్వేదం,జ్యోతిష్య,తెలుగు,సంస్కృతం,వ్యాకరణంలో వెంకట రమణయ్య సిద్ద హస్తులు.అతను కవే కాకుండా గొప్ప పండితుడు కూడా అవధానంలోనూ,జ్ఞాపకశక్తిలోనూ నిపుణుడు.

ఆయన తన జ్ఞాపకశక్తిని మరియు కవితా ప్రక్రియలో విధానాలను తెలుసుకోవడానికి ఒక దశాబ్దం పాటు దేశమంతటా పర్యటించి,చివరికి శ్రీశైలంలో ఒక సంవత్సరం ఉన్నారు.

అలా ఉంటూనే రొజూ పాతాళ గంగా,కృష్ణ నది నుండి నుండివెయ్యి మెట్ల లోతులో నీటిని తెచ్చి భ్రమరాంబిక అమ్మవారికి అభిషేకం చేసేవాడు.అతని జీవన విధానం కానీ,ఆహారపు అలవాట్లు కానీ చాలా సాత్వికంగా ఉండేవి.అయితే అతను అంత గొప్ప వ్యక్తి అని ఎవరూ నమ్మేవారు కాదు.అంత నిరాడంబరంగా ఉండేవారు.అతని శిష్యులు మాత్రం అతన్ని ఆప్యాయంగా అయ్యవారు అని పిలిచేవారు.

వెంకట రమణయ్య 1968 లో శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శక్తి మండల్ అనే సమూహాన్ని ప్రారంభించారు.చాముండేశ్వరి ని ఆరాధించే కార్యక్రమాన్ని తెలుగు నెలలో ఒకసారి మాత్రమే నిర్వహించేవారు.

ఈ కార్యక్రమంలో దేవత ఫోటో కానీ కలశం,శ్రీచక్రం,పవిత్ర గ్రంధాల పారాయణం,సప్తాహతి,కుమారి పూజ,మహా పూజ ,మ్హపుజ (అగ్నిబలం) చేస్తారు.కొన్ని ప్రదేశాలలో అంటే కాశీ-రామేశ్వరంలో మూడు,ఐదు రోజుల పాటూ అలాగే కన్యాకుమారి-బదరీనాథ్ ఈ వేడుకలు జరిగాయి.

అలాగే త్రిపుర సుందరి స్థాపన కోసం హైదరాబాద్ లోని ఫిల్ ఖానాలో ఒక లక్ష దీపాలు వెలిగించాడంతో పాటు ఆలంపూర్ లో ఇదురోజుల కార్యక్రమం, జోగులాంబ

దేవస్థానంలో అసామాన్యమైన వేడుకలు నిర్వహించేవారు.

వెంకట రమణయ్య సంప్రదాయకంగా సూచించిన పద్దతులు,పరిశుభ్రమైన,స్వచ్చమైన మనస్సుపై ఎక్కువ శ్రద్ద పెట్టారు.అలాగే తాంత్రిక పద్దతులకంటే అన్నదానం,మహిళలను శక్తిగా తన దృష్టిలో చూడడం ముఖ్యమైనది.

వెంకట రమణయ్య జనవరి ౩1,1988 నా దేవతలలో ఐక్యం అయ్యారు.ఆ తర్వాత ఆయన కుమారుడు సుభ్రమణ్య శాస్త్రి ఆలయాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు,వీరి కుటుంబం మొత్తం చాముండీ అమ్మవారి సేవలో తరిస్తుంది.

దేవతా ప్రతిష్ట

దీనికన్నా ముందు వెంకట రమణయ్య గారు చాముండీ దేవికి ఆలయాన్ని ఏర్పాటు చేయాలనీ అనుకున్నారు.దాని కోసం అనేక ప్రదేశాలను చూసి, చివరికి మెదక్ జిల్లాలోని చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామాన్ని ఎంచుకున్నారు.ఇక్కడ మంజీరా నది ప్రవహిస్తూ ఉంటుంది.అలా ఎంచుకున్నప్పుడు అక్కడి ఆసాములు తమ భూమిని ఇవ్వమని అన్నారు,దేవతను మేము నమ్మం,ఇక్కడ దేవాలయం నిర్మించం అంటూ అతను చేసే పుణ్య కార్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.కానీ వెంకట రమణయ్య ఊరుకోకుండా ఇక్కడే దేవాలయం నిర్మిస్తాను అంటూ భీష్మించారు. కానీ గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు.అలా నిర్మానుష్యమైన ప్రేదేశంలో రాత్రి ఆయన నిద్రిస్తున్న సమయంలో నా విగ్రహాన్ని నిర్మించు అని నీకేలాంటి ఇబ్బందులు తలెత్తవు అని శక్తి చెప్పిందని చరిత్ర చెప్తుంది,అక్కడి పూజారులు కూడా ఈ కథను ఇప్పటికి గుర్తు చేసుకుంటారు.

తర్వాత ఆలయ నిర్మాణం,గురించి తెల్సుకున్నకరీంనగర్ ధర్మపురి నుండి విగ్రహం కోసం రాళ్ళను తెచ్చారు.ఆ రాళ్ళను శిల్పంగా మలచడానికి వెంకట రమణయ్య శిష్యులు తమిళనాడు నుండి శిల్పులు వచ్చారు.

వారు విగ్రహాన్ని తొమ్మిది అడుగులుగా,పద్దెనిమిది చేతులతో,జ్వాల కిరీటాన్ని తయారు చేసారు,అమ్మవారి విగ్రహం చాలా రౌద్రంగా ఉంటుంది.చూడడానికి భయపడేలా ఉంటుంది,కానీ చాలా మహిమ గల అమ్మవారు.అలా విగ్రహ ప్రతిష్ట రోజు అభిషేకానికి మంజీరా నదిలోని నీటితో అభిషేకించారు. దీనిని తిలకించడానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. అయితే ఎవరు సాయపడలేదు.దాంతో వెంకట రమణయ్య గారే వండి భక్తులకు అన్నదానం చేశారు.

వంటకు కావాల్సిన సరుకులన్నీ రాత్రికి రాత్రే అక్కడ ప్రత్యేక్షం అయ్యాయని చెప్తారు. అలా ఇక్కడి విగ్రహాన్ని ఆనంద సంవత్సరంలో పుష్యమాసం,నల్లపక్షం ఏడు రోజులకు అనుగుణంగా జనవరి 2,1983 న ప్రతిష్టించారు.అయితే ఇక్కడ మరో విశేషం కూడా ఉంది.సాధారణంగా ఆలయ నిర్మాణం జరిగాక విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు,కానీ ఇక్కడ ముందు విగ్రహ ప్రతిష్ట తర్వాత ఆలయ నిర్మాణం,ఇతర సౌకర్యాలు చేపట్టారు. అలాగే వచ్చే భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నదానం కూడా చేస్తారు.ఇది మరొక వారణాసి అని చెప్పవచ్చు.

చాముండేశ్వరి విగ్రహం ఎదురుగ బ్రాహ్మి,కాశీ,వైష్ణవి అనే మరో మూడు విగ్రహాలను ఏర్పాటు చేశారు.శరీరాన్ని తడవకుండా,దుస్తులు మార్చకుండా కొబ్బరి కాయలను వారి సమర్ధాన్ని బట్టి ముడుపులుగా ఒక గుడ్డలో ముడుపుగా కట్టి కోరికలు కోరుకుంటారు.

వెంకట రమణయ్య గారి పట్టుదల చూసి,విగ్రహ ప్రతిష్ట జరిగాక ఆ ఊరువాళ్ళు దేవాలయానికి విరాళాలు ఇచ్చి,ఇంకిన్ని సౌకర్యాలు చేశారు.ఇక్కడ చాముండీ అమ్మవారికి పూజలు చేసే పురోహితులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.వారి వంశస్థులే కాకుండా వేరే పూజారులు కూడా ఇక్కడ పూజలు చేస్తారు,ప్రతిరోజూ అర్చనలు,అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి.

అలాగే సాముహిక వ్రతాలూ చేయడానికి పెద్ద మండపం ఉంటుంది.అలాగే ఇక్కడ బలి దానం కూడా చేస్తారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం, పక్కనే ఉన్న మంజీరా నది గలగలలతో ప్రశాంతంగా ఉంటుంది.అయితే ఇక్కడ రాత్రి అయితే పూజారులతో సహా ఎవరూ ఉండరు.దానికి కారణం చాముండీ అమ్మవారు ప్రతి రాత్రి నెత్తి పై దీపంతో అక్కడ తిరుగుతారని ప్రతీతి.

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (మెదక్ నుండి 146 కిలోమీటర్ల దూరంలో) సమీప విమానాశ్రయం, మేడక్ నుండి చిట్కుల్ గ్రామానికి శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయానికి చేరుకోవలసిన దూరం 32.2 కిలోమీటర్లు, బస్సులు / టాక్సీలు మెదక్ నుండి గమ్యస్థానానికి అందుబాటులో ఉంటాయి.

రైలులో మార్గంలో వెళ్ళడానికి..

అక్కన్నపేట రైల్వే స్టేషన్ చిట్కుల్ గ్రామానికి 51 కి. లింగంపల్లి రైల్వే స్టేషన్ 64 కిలోమీటర్లు, సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ 81 కిలోమీటర్లు.

రోడ్డు ద్వారా వెళ్ళడానికి..

జోగిపేట బస్ స్టేషన్ 6.8 కిలోమీటర్లు, మెదక్ బస్ స్టాండ్ 32 కిలోమీటర్లు, సంగారెడ్డి బస్ స్టాండ్ చిట్కుల్ ఆలయం నుండి 37.4 కిలోమీటర్లు. ఈ ఆలయం హైదరాబాద్ నుండి 96 కిలోమీటర్లు. NH9 ముంబై హైవే తీసుకోండి. పటాన్ చెరు  దాటి సంగారెడ్డి వైపు వెళ్ళండి. సంగారెడ్డి ఎక్స్ రోడ్ వద్ద మెదక్ వైపు కుడి మలుపు తీసుకోండి. సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగిపేటకు చేరుకోండి.ఈ ఆలయం మెదక్ రోడ్‌లోని జోగిపేట నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులో మీరు నారాయణ్ ఖేడ్  ఎక్స్‌ప్రెస్ సేవను ఆశ్రయించవచ్చు, జోగిపేట వద్ద దిగండి. ఈ ఆలయం జోగిపేట నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయానికి వెళ్ళడానికి ఆటో లేదా బస్సులో వెళ్ళవచ్చు..

పటాన్ చెరువు ,సంగారెడ్డి మీదుగా హైదరాబాద్ నుంచి మెదక్ బస్సులు ఆలయం వద్ద ఆగుతాయి. ఇలా వెంకట రమణయ్య దేశంలో ప్రతి చోటా చాముండేశ్వరి దేవాలయాలను ప్రతిష్టించడం జరిగింది.ఆయన వెనకున్న శక్తే ఆయనను నడిపించింది, ఇప్పటికి వారి వంశమే చాముండేశ్వరి దేవతకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మీరు చూడాల్సిన దేవాలయాలలో జోగిపేట్ చాముండేశ్వరి దేవి ఆలయం ముఖ్యమైనది.నేను వెళ్ళి వచ్చాను, మరి ఒక్కసారి వెళ్లి వస్తారు కదా..వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే చాలు మీ భయాలన్నీ తొలగిపోతాయి అనేది నిజం.

Show More
Back to top button