
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఠారెత్తిపోతోంది. తెలంగాణాలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలు ఒక ఎత్తైతే.. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాధవీ లత, అసదుద్దీన్ల తీరు మరో రీతిలో కనిపిస్తోంది.
నాలుగు సార్లు ఎంపీగా గెలుస్తూ వస్తున్న MIM అధినేతను ఢీ కొట్టేందుకు బీజేపీ నుంచి మాధవీ లత బరిలో దిగారు. దీనిలో భాగంగా ఆమె తనదైన శైలితో ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రచారంలో ఇప్పటి వరకు అభివృద్ధి చెందని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు విద్య, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని, ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే, ఇప్పటికే నాలుగు సార్లు ఎంపీగా అసదుద్దీన్ గెలవగా..
ఆ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 6 స్థానాల్లోనూ గెలుస్తూ MIM మంచి పట్టుతో ఉంది. మిగిలిన ఆ ఒక్క అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలుపొందింది. ఈసారైనా హైదరాబాద్ నడిబొడ్డున గాలిపటాన్ని విరిచి కమలం పువ్వు వికసిస్తుందా..? లేదా? అనేది వేచి చూడాల్సిందే.