HISTORY CULTURE AND LITERATURE

ఉలి ముట్టని దేవుడు

పుణ్యక్షేత్రాలు అంటేనే చాలా మందికి ఆసక్తి ఎక్కువ ఎందుకంటే అక్కడి ప్రశాంత వాతావరణం,అక్కడి ప్రత్యేకతలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది, అలాగే తమకు తెలియని ప్రదేశాలకు వెళ్తే కాస్త మనసికోల్లాసం,మనసు తేలికగా అవుతుంది.ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఆ వాతావరణంలో ఉపశమనం పొందవచ్చు అనేది కూడా ఒక కారణం.అలాగే ఆ దేవుని సన్నిధిలో తమ బాధలను,తమ వేదనను చెప్పుకునేందుకు కూడా వెళ్తాం.

మనసు ప్రశాంతతను కోరుకోవడం వల్లనే కాకుండా నిత్యం దైవాన్ని దర్శించుకుంటే మంచి ఆలోచనలు కలుగుతాయి,అలాగే నిత్య దైవ స్మరణ వల్ల మానసికంగా కూడా బాగుంటుంది.

దైవాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనిషికి తోటి మనుషుల పట్ల మంచి ఆలోచనలు కలిగి ప్రేమభావం పెరుగుతుంది.

మనిషి జీవితంలో ఎన్నో సమస్యల నుండి బాధపడుతూ ఉంటాడు.జీవితంలో బాధ్యతలు కూడా ఒక్కోసారి సమస్యల నుండి బయటకు రాలేక దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాడు.

తన సమస్యల పరిష్కారానికి కూడా సమాధానం చెప్పగల ఒకే ఒక వ్యక్తి దేవుడు అని మనిషీ నమ్మకం,తనకు పరిష్కారం తెలిసినా కూడా అయోమయంలో పడి, దేవుణ్ణి ఆశ్రయించడం మనిషి చేసే మొదటి పని.

మనిషికి బాధల నుండి విముక్తి కోసం , లేదా కాస్త ప్రశాంతత కోసం గుళ్ళను వెతుకుతూ ఉంటాడు.ఎక్కడ ప్రశాంతమైన గుడి ఉందో అక్కడికి వెళ్లి కాసేపైనా తన బాధలన్నీ మరిచిపోయి,ప్రశాంతంగా గడిపి రావడం ఎన్నాళ్ళుగానో వస్తున్న ఆనవాయితీ.

అందరి మధ్య మనిషి ఉన్నా తన భవిష్యత్ ఏమిటో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు,లేదా సమస్యలకు పరిష్కారం తెలియని సమయంలో కూడా దేవుడిని ఆశ్రయిస్తాడు.

కొందరు మంచి, మంచి ప్రదేశాలను చూడాలనే ఉద్దేశ్యంతో వెళ్తే చాలా మంది మాత్రం భక్తి,ప్రశాంతత,మానసిక ఉల్లాసం కోసం కూడా వెళ్తాడు.

అయితే అలాంటి మానసిక ఉల్లాసం,లేదా భక్తి,లేదా ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం ఆసక్తిగా వెళ్లేవారి కోసమే ఈ మన్యం కొండ వెలిసింది.

భక్తులకు ప్రశాంతత తో పాటూ ఒంటరిగా ఉండాలి అని అనుకునే వారికోసం కూడా ఈ మన్యం కొండ వెలిసింది.ఇక్కడ పొద్దున్న అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది.ఊరంతా కొండ కింద ఉంటుంది.కొండపై ఎక్కువ కుటుంబాలు ఉండవు. కొండ కింద ఉన్నవారే కొండపైన తినుబండారాలు అమ్ముతూ ఉంటారు.వారు కూడా సాయంత్రం అవ్వగానే కొండ దిగి వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ కోతులు,కొండెంగాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.ఇవి భక్తుల చేతిలో ఏవి ఉన్నా వాటిని లాక్కెళ్ళి పోతుంటాయి.   

అందువల్ల ఇక్కడికి రాత్రుళ్ళు వెళ్ళే బదులు పొద్దున్న పూట ,అది కూడా సొంత వాహనం ఉంటేనే వెళ్ళవచ్చు.ఇది భయం కల్పించడానికి చెప్పడం లేదు,కేవలం భద్రత గురించి మాత్రమే చెప్తున్నాను.ఇక పైకి వెళ్ళే కొండను కారును ఎక్కించడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది.కానీ దిగేటప్పుడు చాలా తేలికగా దిగవచ్చు,కాకపోతే బ్రేకుల దగ్గర కాస్త జాగ్రత్త అవసరం..ఆలయ ప్రాంగణం ముందు పెద్ద బండ పరచినట్లుగా ఉంటుంది.

ఇక్కడ మరమరాలు లాంటి తినుబండారాలు మాత్రమే దొరుకుతాయి కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు తినుబండారాలు తీసుకుని వెళ్ళాలి. కాకపోతే కారులో తినడం మంచిది.

ఇక ఆలయం గురించి,ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

మన్యంకొండ ఈ పేరు ఇంతవరకు ఎవరు విని ఉండరు కొందరు మాత్రం వినే ఉంటారు అంటే స్థానికులు వినే ఉంటారు. అన్ని దేవాలయాల్లో కెల్లా ప్రత్యేకమైన దేవాలయం ఇది. దీని గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు.

ఇలాంటి దేవాలయం ఒకటి ఉందని తొలిసారిగా విన్న వారు కచ్చితంగా అక్కడికి వెళ్లి చూడాలని అనుకుంటారు.

మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం పేదల తిరుపతిగా అభిమానిస్తారు అలాగే మహబూబ్ నగర్  నుంచి రాయచూరు వెళ్లి అంతర్ రాష్ట్ర రహదారి మార్గం నుంచి నాలుగు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది.

ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. ప్రతి సంవత్సరం ఇక్కడ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

అయితే దాని కన్నా ముందు మనం అక్కడి ప్రకృతి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి ప్రశాంత వాతావరణము ఉంటుంది.

మొదట మనకు వెళ్లగానే అక్కడ ప్రాకారం కనిపిస్తుంది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళితే ఎడమవైపున అమ్మవారి గుడి ఉంటుంది అక్కడి అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు అని అక్కడి స్థానికులు నమ్ముతారు. దీనికి కారణం లేకపోలేదు.

ఈ అమ్మవారు ఎప్పుడు దవల వర్ణ కాంతిలో మెరిసిపోతూ ఉంటారు అమ్మవారికి రకరకాల చీరలు అలంకరించిన అవి మనకు దవలవర్ణంలోనే కనిపిస్తాయి. గుడి చుట్టూ లోపల పాలరాతి బండలతో నిర్మించారు.

అలాగే మనం కోరుకున్న కోర్కెలు తీరాలి అంటే ధ్వజస్తంభం దగ్గర ఒక నాణాన్ని పెట్టి పరీక్షించుకోవాల్సి ఉంటుంది. మనం కోరిన కోరికలు తీరతాయా లేదా అనేది అమ్మవారు మనకు ఆ నాణెం ద్వారా తెలియజేస్తుంది.

ఇలాంటివి మీరు అన్ని ఆలయాల్లో వినే ఉంటారు కాకపోతే ఇక్కడ ధ్వజస్తంభం కింద ఒక నల్లని రాతి పలక ఉంటుంది

 ఆ రాతి పలకపై ఐదు రూపాయల నాణెం లేదా రూపాయి నాణెం పెడితే నిలబడిందంటే మన కోరిక తీరుతుందని అర్థం. ఒకవేళ నిలబడక ఎన్నిసార్లు పెట్టిన కింద పడిపోతూ ఉంటే మన కోరిక తీరదని అర్థం.

అక్కడ నాణ్యం పెట్టి మనం కోరుకున్న కోరికలు తీర్చమని తల్లిని ప్రార్థించిన తర్వాత ఇక అసలైన స్వామిని దర్శించుకోవడానికి వెళ్లవచ్చు అమ్మవారు అంటే ఇక్కడ పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు.

అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక సన్నని కాలిబాట కనిపిస్తుంది. అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి మనకు కనువిందు చేస్తూ ఉంటుంది కొండల మధ్య అస్తమిస్తున్న సూర్యుని చూస్తుంటే మనసు పులకరించిపోతుంది.

ఇక కాలిబాట వెంట వెళ్తుంటే తిరుపతికి ఎలా అయితే వెళ్తాము అన్ని మలుపులు దాటుతూ స్వామి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అచ్చం తిరుపతి కొండ లాగే ఇక్కడ కూడా ఏడు కొండలు ఎక్కితేనే మనకు స్వామి దర్శన భాగ్యం కనిపిస్తుంది అలా ఏడుకొండలు ఎక్కిన తర్వాత విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది అయితే ఈ ఆలయ ప్రాంగణానికి ప్రహరీ గోడ లాంటివి ఏమీ లేవు మనం పక్కనే ఉన్న జలాశయం దగ్గర కానీ లేదా నల్లాల దగ్గర కానీ కాళ్లు చేతులు కడుక్కుని నెత్తిపై నిలిచి అల్లుకొని ఆలయలోపాలకి వెళ్లాలి ఆలయం మొత్తం రాయితో మలచబడి ఉంటుంది.

అలా లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపు సన్నని బాట ఉంటుంది ఆ సన్నని బాట ద్వారా పైకి వెళ్ళడానికి కూడా ఏడు మలుపులు ఉంటాయి అవి ఏడు మలుపులు దాటిన తర్వాత గృహలో స్వామి కొలువై ఉంటాడు.

మిగిలిన ప్రదేశాలలో అన్ని రకాల దేవతలకు కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు రావడానికి మరొక ద్వారం ఉంటుంది అయితే అది చాలా చిన్నగా సన్నగా ఉంటుంది ఎక్కుతూ ఉంటే మనకు ఆయాసం వస్తుంది తప్పకుండా చేరుకోలేము. చివరికి ఎలాగో కష్టపడి కొండను చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రద ప్రసాదాలు తీసుకున్న తర్వాత బయటకు రావడానికి మళ్లీ సన్నని దారి ఉంటుంది.

కొంచెం లావుగా ఉన్నవారు ఈ దారి నుంచి కాకుండా మరోవైపు నుంచి వెళ్తారు సన్నగా ఉన్నవారు అటువైపు నుంచి వస్తున్న సమయంలో అక్కడ అమ్మవారు ఆంజనేయస్వామి సీతారాముల విగ్రహాలు మనకు దర్శనం ఇస్తారు.

చరిత్ర

మన్యంకొండ అని దీనికి పేరు ఎలా వచ్చింది అంటే మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం పందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ప్రస్తుతం ఈ దేవాలయం తెలంగాణ దేవాదాయశాఖ ఆధీనంలో ఉంది. అయితే చరిత్ర ఆధారంగా అక్కడి పూజారులు చెప్పిన స్థల పురాణం వల్ల ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎలా వెలిశాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కేశవయ్య అనే మునికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి మన్యంకొండ గుహలో నేను ఉన్నానని నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అంతర్దానం అయ్యారని అక్కడ ఉన్న పూజారులు ఆ స్థల పురాణంలో రాసిపెట్టిన శిలాఫలకాల ద్వారా తెలిసింది. అయితే కేశవయ్యకు కలలో కనిపించిన వెంకటేశ్వర స్వామి తనకు నిత్యసేవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరడం వల్ల కేశవయ్య ఆ కొండపైకి వెళ్లి అక్కడ ఉన్న స్వామిని గుర్తించి నిత్య పూజలు చేస్తూ ఉండడంవల్ల అక్కడి ప్రజలకు ఈ విషయం తెలిసి వాళ్లు కూడా స్వయంభుగా విరిసిన వెంకటేశ్వర స్వామిని కొలవడం వల్ల ఈ మన్యంకొండ ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే కేశవయ్య తర్వాత చాలా సంవత్సరాలకు ఎత్తైన కొండలపై ఘాట్ రోడ్డు నిర్మించి ప్రస్తుతం ఉన్న స్థితిలోకి తీసుకువచ్చిన వారు మాత్రం అలహరి రామయ్య ఈయన ఆలయం కోసం కోనేరును అలాగే మంచినీటి బావిని కూడా నిర్మించాడు.

ప్రారంభ సమయంలో ఇది మునులు తపస్సు చేసే స్థలం కాబట్టి మునల కొండగా పిలువబడిన కాలక్రమమైన దీని పేరు మన్యంకొండగా స్థిరపడింది.

ఇకపోతే ఇది అంటే మన్యంకొండ రెండవ తిరుపతి గాను పేరుగాంచింది మరొక విధంగా చెప్పాలంటే తీరితే తిరుపతి తీరకుంటే మన్యంకొండ అన్నట్లు పాలమూరు పేదలు దూరాన ఉన్న తిరుపతికి వెళ్లలేని వారు తీరిక లేనివారు ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైకి బస్సులు వెళ్తాయి మామూలు రోజులలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవలసి ఉంటుంది.ప్రస్తుతం ఈ కొండపైకి వెళ్లడానికి ఉన్న ఘాట్ రోడ్డును డబుల్ రోడ్డుగా మలిచారు.

ఆలయ ప్రత్యేకతలు

మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాలలో మన్యంకొండ రెండవ స్థానం సంపాదించింది.

అలాగే తిరుపతి వాళ్ళ ఎత్తైన కొండల మధ్య స్వామి వెలిశాడు. అంటే మూడు కొండలు కాబట్టి ఇవి కూడా ఒక ప్రత్యేకతనే.

అలాగే త్రవ్వని కోనేరు దేవుని పాదాలు కూడా ప్రత్యేకత సంతరించుకుంటాయి. మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయాన్ని ఏ శిల్పులు నిర్మించలేదు.

తనకు తానుగా స్వయంభుగా వెలసిన ఉలి ముట్టని దేవుడు ఈ మన్యంకొండ వెంకటేశ్వరుడు. పేదల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు.

ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం పురాతన కాలాలలో నరసింహ యోగి ఎర్రప్ప, రామయోగి ,కసిరాయలు, వీరప్పయ్య , మధుసాను వంటి గురువులు మునిల కొండ అని పిలిచారు ఇక్కడ ధ్యానం చేశారు సమయం గడిచే సమయంలో ఇది ఏతం కొండకు మార్చబడింది ఇక్కడ పురాతన గుహల యొక్క సంగ్రహణం ఉంటుంది.

ఇక్కడ ఋషులు గురువులు ధ్యానం చేస్తారు. వెంకటేశ్వర స్వామి ఈ ప్రదేశంలో ప్రధాన దేవత హరిహర క్షేత్రం ఈ దేవాలయం ఒక గుహలో ఉన్నది. ఇది మూడు కొండలపై ఉన్నది అలాగే ఇక్కడ ప్రఖ్యాత గాయకుడు శ్రీ నారాయణ కొండ హనుమదాసు ఈ ప్రదేశానికి అనుసంధాకర్తగా ఉన్నారు.

మన్యంకొండ ప్రకృతి ఒడిలో అందమైన సౌందర్యాల మధ్య దేవుని దర్శించుకుని ఆనందాన్ని పొందవచ్చు అలాగే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు ఇక్కడ వార్షిక ఉత్సవాలు నాగపూర్ణిమ రోజున జరుగుతాయి.

ఎటువంటి శిల్పులు చెక్కకుండానే ఇక్కడ స్వామి వారు స్వయంభుగా తనకు తానుగా వెళ్తారు కాబట్టి ఈ మహిమాన్విత క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించి అక్కడి ప్రత్యేకతలు స్వయంగా తెలుసుకుంటే ఆ ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది.

అలహరి రామయ్య గారు ఇక్కడ కేవలం బావిని తవ్వించారు. కానీ ఇక్కడ కోనేరును ఎవరు తవ్వలేదు. అలాగే ఎవరూ చెక్కలేదు. అదే ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి.

అలాగే ఉత్సవాలు కూడా ఘనంగా జరిపిస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారైనా మీరు మన్యంకొండకు వెళ్లి వస్తారని ఆశిస్తూ.. ఆ వెంకటేశ్వరస్వామి కృపాకటాక్షాలు మీ అందరికీ కలగాలని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ…

Show More
Back to top button