
విజయనగరం జిల్లా… భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా.. ఇది కల్యాణ కర్ణాటక ప్రాంతంలో ఉంది. ఈ జిల్లా 2020లో బళ్లారి జిల్లా నుంచి వేరుచేయబడి రాష్ట్రంలో 31వ జిల్లాగా అవతరించి, హోస్పేట జిల్లా కేంద్రంగా ఉంది.
ఇది ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్యపు పూర్వ రాజధాని. ఈ రాజధాని హంపికి నిలయం. ఇది ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా పేరుగాంచింది. విజయనగరాన్ని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సంస్కృతి, సంప్రదాయానికి స్వర్ణయుగంగా భావిస్తారు. అటువంటి విజయనగరం సామ్రాజ్యంలో చాలామంది సామంతులు, రాజ్యాలు ఉన్నాయి. ఆ ప్రాంత శోభ, విశేషాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..
విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి దక్షిణ భారతదేశంలోని దక్కన్‌లో ఉంది. దీనిని హక్కా అని కూడా పిలుస్తారు. హరిహరరాయలు, అతడి సోదరుడు బుక్కరాయలు దీన్ని స్థాపించారు. భారతదేశంలోని ఆధునిక కర్ణాటకలోని విజయనగర రాజధాని నగరం (ప్రస్తుతం శిథిలమై ఉంది) పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. ఇది దాదాపు 1336 నుంచి దాదాపు 1660 వరకు కొనసాగింది.
1713లో మొదటి ఆనందరాజు తన కొడుకు పెద్ద విజయరామరాజు పేరుమీద కట్టించిన అద్భుతమైన కట్టడం ఈ విజయనగరం కోట. పూసపాటి వారి వరుస విజయాలకు ఘనకీర్తిగా, ప్రతీకగా విజయదశమి పర్వదినాన మంగళవారం రోజున కోటను నిర్మించడం జరిగింది. ఈ కోట చుట్టూ ఉన్న సుందరమైన నగరమే నేటి విజయనగరం. పూసపాటి వంశస్తులు క్షత్రియ వంశానికి చెందినవారు. సామనిషేకం 514 నుంచి 592 వరకు బెజవాడ రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మాధవవర్మగారి వంశస్తులే ఈ పూసపాటివారని చెబుతుంటారు. నిజానికి వీరి అసలు ఇంటి పేరు పరిచేది.
మాధవర్మ వారసులు కొండపల్లి ప్రాంతానికి సమీపంలో పూసపాడు ప్రాంతంలో స్థిరపడటం వల్ల ఆ ఊరి పేరు మీద పూసపాటి అనే పేరు వచ్చింది. ప్రస్తుత ఉత్తరాంధ్రను ఒకప్పుడు ఉత్తర సర్కారులుగా పిలిచేవారు. మొగల్ చక్రవర్తులు ఉత్తర సర్కారులను గెలుచుకోవడంలో మొగల్ ఫౌజ్ దార్, షేర్ మహమ్మద్ ఖాన్ కి పూసపాటివారు సాయం చేశారు. అందుకు నజరానాగా మొగల్ చక్రవర్తి పూసపాటి వారికి కుమిలి, భోగాపురాలను బహుమతిగా ఇచ్చారు. ఆ రోజుల్లో కుమిలిని
కుంబిలపురం అని పిలిచేవారు. పూసపాటివారు ఈ కుమిలిలో ఒక మట్టికోటను కట్టుకొని పరిపాలించడం మొదలుపెట్టారు.1686లో ఔరంగజేబు గోల్కొండపై దాడి చేసి, కుతుబ్ షాహీని అంతం చేశాడు. ఆ దాడిలో పూసపాటివారు ఔరంగజేబుకు సహాయం చేశారు.
దాంతో ఔరంగజేబు మెచ్చి, వీరికి జులిఫికర్ అనే రెండువైపులా పదునున్న ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చి పంపాడు. అంతేకాదు మహారాజా అనే బిరుదుని కూడా ప్రసాదించాడు.1713లో మొదటి ఆనందరాజు ఈ కోటకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కోట నిర్మాణం ప్రారంభించిన 4 ఏళ్లకే ఆనందరాజు మరణించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పెద్ద విజయరామరాజు ఈ భవ్యమైన కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. పెద్ద రామరాజు రాజధాని కుమిలిని కళింగ విజయనగరంగా మార్చి సరికొత్త రూపునిచ్చారు.
ఇకపోతే విజయనగరం కోట లోపల అనేక దేవాలయాలు, రాజభవనాలు, విజయగోపురాలు ఉన్నాయి. 1713లో ఐదు విజయ చిహ్నాలు ఉండే ప్రదేశంలో నిర్మించడం జరిగింది. విజయనగరం మహారాజా అయిన ఆనందరాజు దీని స్థాపకుడు. ఆ అడవిలో తపస్సు చేస్తున్న మహబూబ్ వలీ అనే ముస్లిం సాధువు మహారాజులకు కోట కోసం స్థలాన్ని సూచించాడు. కోట రెండు ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా అందమైనవి. అంతర్నిర్మాణం రాజస్థానీ నిర్మాణ శైలిలో ఉంటుంది. తూర్పు ప్రధాన ద్వారం పైభాగంలో డ్రమ్ టవర్ ఉన్నందున దీనిని నగర్ ఖానాగా పిలుస్తారు.
ఇది ప్రజలకు రాయల్ ఆర్డర్లు, రాజఅతిథుల రాకను తెలియజేయడానికి డ్రమ్స్ కొట్టడానికి ఉపయోగపడేది. పశ్చిమ ద్వారం విజయనగరం కోటకు వెనుక ద్వారం. ఈ గేట్‌వే కూడా అంతర్నిర్మిత రాజస్థానీ శైలిలో పైన పెవిలియన్‌తో నిర్మించడమైంది. ఈ ద్వారం రాజ సమాధులకు ప్రవేశాన్ని, దహన సంస్కారాల కోసం మృతదేహాలను బయటకు తీయడానికి ఉపయోగపడే సంప్రదాయ ద్వారం. గతంలో ఉన్న కందకం స్థానంలో ఇప్పుడు పశ్చిమ ద్వారం వరకు ఏర్పాటు చేసిన ఉద్యానవనం ఉంది. మోతీ మహల్ 1869లో విజయరామరాజు-III చేత నిర్మితమైన దర్బార్ హాల్ అనేది రాజ దర్బారు..
ఈ హాలు ప్రవేశం వద్ద రెండు పాలరాతి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇది గత వైభవాన్ని సూచించే స్మారక చిహ్నం. అప్పట్లో మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ పి.వి.జి.రాజు విజయనగరం రాజా సాహెబ్ ద్వారా విరాళంగా ఇచ్చాడు.
తదనంతరం ఇప్పుడు దాని మొదటి అంతస్తులో మహిళా కళాశాలగా నడుస్తోంది. కోట నుంచి పాలించిన గత రాజుల కళాఖండాలను కలిగి ఉన్న మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. ఔద్ ఖానా అనేది విజయనగరం రాజుల రాజభవనం. ఫూల్ బాగ్ ప్యాలెస్‌కి ఆనుకుని ఉన్న అష్టభుజి రాతి నిర్మాణం ఈ ప్యాలెస్‌లోని ప్రత్యేక భాగం రాజులకోసం ప్రత్యేకంగా నిర్మించిన బాత్రూమ్. ఈ నిర్మాణం 50 అడుగుల ఎత్తులో రాళ్లతో నిర్మించబడింది. పైభాగంలో ఉన్న నీటి ట్యాంక్‌కు దారితీసే స్పైరల్ మెట్ల మార్గాన్ని కలిగి ఉంది. ఇది సమీపంలోని బావి నుంచి నీటిని పంపింగ్ చేయడం ద్వారా నీరు అందుతుంది. అలకనంద ప్యాలెస్‌ను రాజు అతిథి గృహంగా నిర్మించారు. ఇది అతిథుల కోసం ఖరీదైన శైలిలో నిర్మించారు.
ఈ ప్యాలెస్ మైదానంలో, రాయల్టీ ఉపయోగం కోసం ఇటీవలి సంవత్సరాల్లో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటైంది. అయితే ఈ ప్యాలెస్‌లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసుల 5వ బెటాలియన్ ఉంది. అలకనంద ప్యాలెస్‌కు సమీపంలో కోరుకొండ ప్యాలెస్ ఉంది. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ చుట్టూ ఉన్న భూమి ఆటస్థలంగా వినియోగంలో ఉంది. చక్కటి తోటలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ చోటే విద్యాసంస్థలు వెలిశాయి. రక్షణ దళాలలో చేరాలనుకునే యువతకు శిక్షణ ఇవ్వడానికి ఒక పెద్ద పాఠశాల ఉంది. గంటాస్తంభం అనేది లండన్‌లోని బిగ్ బెన్ తరహాలో రూపొందించబడిన క్లాక్ టవర్. బ్రిటిష్ రాజుల కాలంలో లండన్‌కు తరచూ వచ్చే విజయనగరం రాజులే దీనిని నిర్మించారు. ఇది నగరం నడిబొడ్డున ఉన్న కోటకు వెలుపల ఉంది. 1885లో ఇసుకరాయితో నిర్మించిన అష్టభుజి గోపురం 68 అడుగుల ఎత్తుకు చేరుకుంది.
విజయనగర సామ్రాజ్యం పాలకులు తమ భూభాగాలను పరిపాలించడానికి తమ పూర్వీకులైన హొయసల, కాకతీయ, పాండ్య రాజ్యాలు అభివృద్ధి చేసిన పరిపాలనా పద్ధతులను అవసరమైన చోట మాత్రమే మార్పులు చేశారు. ఇక్కడ ప్రధానమంత్రి (మహాప్రధాన) నేతృత్వంలోని మంత్రుల మంత్రి (ప్రధాన) సహాయంతో రాజు అంతిమ అధికారం నిర్వహిస్తాడు. ప్రధాన కార్యదర్శి (కార్యకర్త లేదా రాయస్వామి), సామ్రాజ్య అధికారులు (అధికారి) మాత్రమే పాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉన్నత స్థాయి మంత్రులు, అధికారులు సైనిక శిక్షణ పొందవలసి ఉంది. రాజు భవనం సమీపంలో ఉన్న ఒక సచివాలయం రాజు ఉంగరంతో ముద్రించిన మైనపు ముద్రను ఉపయోగించి అధికారికంగా చేసిన రికార్డులను నిర్వహించడానికి లేఖరులను, అధికారులను నియమించింది. దిగువ పరిపాలనా స్థాయిలో సంపన్న భూస్వాములు (గౌదాలు) అకౌంటెంట్లను (కరణికలు లేదా కరణం), కాపలాదారులను (కావలు) పర్యవేక్షించారు. రాజభవన పరిపాలనను 72 విభాగాలు (నియోగాలు)గా విభజించారు.
ఈ సామ్రాజ్యాన్ని ఐదు ప్రధాన ప్రావిన్సులుగా (రాజ్య) విభజించారు. ఒక్కొక్కటి ఒక కమాండర్ (దండనాయక లేదా దండనాథ) ఆధ్వర్యంలో రాజప్రతినిధి నేతృత్వంలో (తరచూ రాజకుటుంబానికి చెందినవారు ఉంటారు) పాలనా వ్యవహారాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక రాజ్యాన్ని అనేక ప్రాంతాలుగా విభజించారు. వీటినీ మరింతగా కౌంటీలుగా (సిమే లేదా నాడు) విభజించారు. వాటిని మునిసిపాలిటీలుగా (కంపన లేదా స్థలా) విభజించారు.
యుద్ధభూమిలో రాజు కమాండర్లు దళాలను నడిపించారు. ఇక్కడి ఆర్మీ దళాలు రెండు రకాలు: రాజు వ్యక్తిగత సైన్యం నేరుగా సామ్రాజ్యం నుంచి నియమించడం. ప్రతి భూస్వామ్య అధిపతుల సైన్యం. రాజు కృష్ణదేవరాయ వ్యక్తిగత సైన్యంలో 1,00,000 పదాతిదళాలు, 20,000 మంది అశ్వికదళ సిబ్బంది, 900మందికి పైగా ఏనుగులు ఉన్నాయి. ఈ సంఖ్య సైన్యంలో 1.1 మిలియన్ల మంది సైనికుల్లో ఒక భాగం మాత్రమే. రెండు మిలియన్ల సైన్యం, నావికాదళాలతో ఏర్పడింది.
రాజధాని నగరం నీటిని సరఫరా చేయడానికి, నిల్వ చేయడానికి, తుంగభద్రనదికి సమీపంలో ఉన్న సారవంతమైన వ్యవసాయ ప్రాంతాల్లో నది నీటిని నీటిపారుదల వ్యవస్థని ట్యాంకుల్లోకి నడిపించడానికి కాలువలు తవ్వారు. ఈ కాలువల్లో నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి తెరిచి మూసివేయడానికి అనువైన తూములు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో పరిపాలనా అధికారుల పర్యవేక్షణతో బావులను తవ్వటానికి అనుమతి ఇచ్చింది. రాయలు ప్రోత్సాహంతో రాజధాని నగరంలో పెద్ద ట్యాంకులను నిర్మించారు.
విజయనగరం కోటను రాళ్లతో అదికూడా పూర్తిగా కొండరాళ్లతో నిర్మించారు. ఈ కోట 26 ఎకరాల విస్తీర్ణంలో, చుట్టూ నాలుగువైపులా నాలుగు పెద్ద పెద్ద బురుజులతో కట్టబడింది. కోట చుట్టూ విజయనగర రాజులు కందకం తవ్వించారు. ఈ కందకం రెండు ఏనుగులు లోనికి మునిగెంత లోతు ఉండేది. ఆనాడు శత్రువులు లోనికి ప్రవేశించకుండా ఉండటానికి కోట గోడలు 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. విజయనగరం జిల్లాలో మరొక ప్రధాన ఆకర్షణ.. గంటస్తంభం. 68 అడుగుల ఎత్తుగల ఈ స్తంభం విజయనగరం మొత్తానికి గుర్తుండిపోయే చిహ్నం. హైదరాబాద్ కి చార్మినార్ ఎలాగో విజయనగారానికి ఈ చిహ్నం అలాగన్నట్టు.
విజయనగరం జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో చింతపల్లి బీచ్ ఒకటి. ఇది పర్యాటకులను కనువిందు చేస్తూ, ఇక్కడున్న లైట్ హౌస్, సముద్రంలోని రాళ్ళ గుట్టలు, పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పూసపాటిరేగ అనే గ్రామానికి ఇది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది. జాతీయ రహదారి నెంబర్ 5 ఈ ఊరి గుండా వెళుతుంది కనుక మీరు ఇక్కడ దిగి ఆటోలో గాని, ప్రభుత్వ బస్సుల్లో గాని వెళ్ళవచ్చు. చుట్టూ కొండలతో .. నిండుగా ఉన్న జలాశయంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడున్న కొండపై నిర్మించిన గిరి వినాయకుడు, వెదురు కర్రలతో చేసిన పలు ఆకారాలు ఆకర్షణీయంగా కనపడతాయి.
తోటపల్లిలో ఉన్న ప్రధాన ఆకర్షణ.. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర మొత్తం ప్రసిద్ధిగాంచినది. పార్వతీపురం నుంచి పాలకొండ వెళ్లే రోడ్డు మార్గంలో 10 కి. మీ. దూరంలో ఈ ఆలయం ఉంది. గుడి పక్కనే నాగావళి నది ప్రవహిస్తుండటంతో భక్తులు అందులో దిగి స్నానాలు చేస్తుంటారు. అలా చేస్తే వారి కోరికలు నెరవేరతాయని నమ్మకం.
పైడిమాంబ లేదా పైడి తల్లి, ఉత్తరాంధ్ర ప్రజల దైవం, ఇలవేల్పు. ఇక్కడ జరిగే అమ్మవారి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. ఇందులో సిరిమానోత్సవం ప్రముఖ ఘట్టం. ఆ ఉత్సవ సమయంలో ఒక పొడవాటి గడ తీసుకొని, చివరన ఒక పీఠాన్ని (కుర్చీ) తగిలించి, అందులో పూజారిని కూర్చోబెట్టుకొని గుడి ప్రాంగణం మొత్తం ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. ఇలా మరెన్నో విశిష్టతలను
కలిగి ఉన్న జిల్లాలోనే చరిత్ర ప్రసిద్ది గాంచిన బొబ్బిలి యుద్దం, చెందుర్తి యుద్దం జరిగాయి. ఈ విజయనగర ప్రదేశాన్ని కళింగ గంగరాజులు 100 సంవత్సరాల పాటు, గజపతిరాజులు ఏకంగా 140 సంవత్సరాలపాటు పరిపాలించారు. ఇంతటి ఘనమైన చరిత్ర గల ఈ జిల్లా గురుంచి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.