
శ్రీరాముడు తెలుగు వారి ఇలవేల్పు. సీతమ్మ తల్లి తెలుగులోగిల్ల కలపవల్లి. అలాంటి సీతారాములు కొలువుదీరిన ప్రతి ఊరు అయోధ్యపురిగా భక్తులు భావిస్తారు అలాంటి పతిత పావన మూర్తులైన జానకి రాఘవులు వెలసిల్లుతున్న దివ్యధామం గొల్లలమామిడాడ క్షేత్రం. అనంత కల్యాణ గుణకారకుడు భక్తాభి ప్రదాయకుడైన శ్రీ రామచంద్రుడు యుగయుగాలుగా తెలుగువారి ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నాడు.
మూర్తి వహించిన ధర్మ స్వరూపిణిగా రఘునందనలు తరతరాలకు ఆదర్శప్రాయుడై తేజరిల్లుతున్నాడు. ఈ నేపథ్యంలో గొల్లల మామిడాల దివ్య క్షేత్రంలో కోదండ రామస్వామిగా ఆలయంలో పూజలు అందుకుంటున్నాడు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామాలయ శోభ వర్ణనాతీతం. ఐదు ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన లోగిలిలో ఈ ఆలయం విరాజిల్లుతుంది ఈ ఆలయం.
ఈ కోదండరామ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ఉంది. ఈ ఆలయం కాకినాడ నుండి 25 కిమీ దూరంలో, రాజమండ్రి నుండి 45 కిమీ దూరంలో, విశాఖపట్నం నుండి 180 కిమీ దూరంలో ఉంది . సూర్య దేవాలయమైన సూర్యనారాయణ దేవాలయం కూడా ఇదే గ్రామంలో ఉంది .
ఈ ఆలయ వైభవ ప్రభావాలకు చిహ్నంగా సమున్నతిమైన తూర్పు పశ్చిమ గోపురాలు గోచితమవుతాయి. ఆలయం పై రామాయణం, మహాభారతం, భాగవతానికి సంబంధించిన చిత్రాలు శిల్పాల రూపంలో చెక్కబడి ఉంటాయి. స్థూపాకృతుల్లో ఉన్న ఈ గోపురాలు ఎంతో విలక్షణమైనవిగా విరాజిల్లుతున్నాయి. ప్రధాన ఆలయం ప్రవేశ ద్వారం పై శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులని భక్తులు దర్శించుకుంటారు. 1948వ సంవత్సరంలో 160 అడుగుల ఎత్తుతో 9 అంతస్తులతో పంచకలిష సమన్వితంగా ఈ మహారాజ గోపురాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణానికి ఎడమటి వైపున 1958 వ సంవత్సరంలో 210 అడుగుల ఎత్తుతో 11 అంతస్తుల మహా వైభవ రాజగోపురాన్ని నిర్మించారు. ఈ రామాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న తూర్పు పడమటి దిక్కులలో నిర్మించిన ప్రత్యేక అతిపెద్ద రాజగోపాలపై వరకు మెట్లు ఎక్కి వీక్షించే అవకాశం భక్తులకు ఉంది.
గొల్లల మామిడాడ వాస్తవ్యులైన ద్వారంపూడి సుబ్బిరెడ్డి రామిరెడ్డి అనే శ్రీరామ భక్తులు ఎందరో వధాన్యులతో కలిసి 1889వ సంవత్సరంలో నిర్మించిన ఈ దేవాలయం 1934వ సంవత్సరంలో పునరుద్ధరించారు. 1951 వ సంవత్సరంలో కాతేరు రాయి, ఇనుప ఊచలు, సిమెంటుల మిశ్రమంతో దృఢమైన ధ్వజ స్తంభాన్ని నిర్మింపజేశారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు ప్రదీక్షణాలు పూర్తిచేసి గర్భాలయమునకు ముందుకు సాగుతారు. గొల్లల మామిడాడ క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాధలు ప్రచారంలో ఉన్నాయి. గౌతమీ నదిలోని ఓ పాదను సప్త పురుషులలో ఒకరైన కస్యపు మహర్షి తన వెంట తీసుకొని వెళ్ళాడు. ఈ పాయ మిగతా మహర్షులు తరలించిన నదీపాయలన్నింటి సమ్మేళనం గా వాటితోల్యంగా విద్యాధికాల్సింది.
అందుకే ఈ పాయకు తూయ అని పేరు. ఈ తుల్యా నది తీరాన వెలసిన క్షేత్రం గొల్లల మామిడాడ. ఈ నదీ తీరాన మామిడి చెట్లు అధికంగా ఉండేవి. సిద్ధ పురుషుల స్నానాధ్యాన తపస్సులకు అణువుగా ఉండేది. అందుకే దీనిని మామిడా వాటికగా మామిడి వాడగా వ్యవహరించేవారు. వ్యవహారికరంలో మామిడి వాడగాను అనంతరం మామిడాడగా అయ్యింది. తదనంతరం యాదవుల నివాసస్థలిగా మారడంతో ఈ గ్రామం గొల్లల మామిడాడ అయ్యిందని చెబుతున్నారు. గర్భాలయంలో ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు భక్తా బీష్ణవంతులై నెలకొని ఉంటారు. 1934వ సంవత్సరంలో గర్భాలయంలో ఈ ధర్మమూర్తులను ప్రతిష్టించారు.
వేడుకున్న వారి పాలిట కొండంత వేల్పుగా కోదండ రాముడు భక్తుల్ని అనుగ్రహిస్తాడని ఓ నమ్మకం. గర్భాలయంలో సమన్నత పీఠంపై స్థానిక భవ్యములో రత్నకుండలాలతో కిరిటాలుతో హస్తభూషణాలతో పుష్పక మాలంకృతంగా సర్వాంగ సుందరంగా మూలవరులు ముచ్చట కలుపుతారు. సంపూర్ణ అలంకార శోభితంగా నైనా మనోహరంగా నవన వన్నెషగా కోదండ రామాదులు భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. 1859 వ సంవత్సరంలో శ్రీ సీతామహాలక్ష్మి శ్రీ రామచంద్రమూర్తి అనే పేరుతో ఇక్కడ రెండు కోళ్లను అనగా కొయ్య బొమ్మలను ప్రతిష్టించారు. అయితే 1934వ సంవత్సరంలో మార్చి 24వ తేదీన ప్రస్తుతం మన వీక్షిస్తున్న సీతారామ లక్ష్మణ అచ్చావతార మూర్తులను కొయ్య బొమ్మల స్థానంలో ప్రతిష్టించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం దివ్య ప్రభావితంగా దివ్య మూర్తులతో వెలుగొందుతుంది. శ్రీ కోదండ రామపాద సన్నిధిలో ఉన్న ఆంజనేయ స్వామి ప్రతిమ 1964 సంవత్సరంలో జూలై 1వ తేదీన ప్రతిష్టాపన చేశారు.
గొల్లల మామిడాడ కోదండరామ దివ్య సన్నిధిలో పలు ఉపాలయాలు ఉన్నాయి. వాటితో పాటు మోగ మండపం ఇతర మండపాలు కళా నైపుణ్య శైలి భక్తులను ఆకట్టుకుంటుంది. కోదండ రామాలయానికి అభిముఖంగా శ్రీ దాసాంజనేయ స్వామి సన్నిధి అలరారుతుంది. నిమ్మకాయల మాలికతో రజతాభరణాలు ధరించిన పవనసుతుడు కొలువుదీరి ఉంటాడు. శ్రీ ఆంజనేయ స్వామికి మంగళవారం గంధంతో సింధూరంతో మరియు తమలపాకులతో సహస్రనామ పూజలను జరుపుతారు. ప్రధాన ఆలయంలో శ్రీ కోదండ రామాలయానికి చేరువలోని బాల గజానన స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. సాధారణంగా గోచరమయ్యే వినాయక ప్రతిమలకు పూర్తి విభిన్నంగా ఈ ప్రతిమ గోచరం ఉంటుంది.
సంపూర్ణ కళాకృతుడైన స్వామికి సర్పకృతి అలంకార విశేషంగా అమరి ఉంటుంది. పశ్చిమ గోపురానికి అనుకొని మధ్యమండపం పుష్పక మండపాలను కలుపుకొని 120 అడుగుల విడిది 60 అడుగుల వెడల్పు 18 అడుగుల ఎత్తుతో రమణీయ భరితమైన అద్దాల మండపాన్ని 1975 వ సంవత్సరంలో నిర్మించారు. ఈ మండపంలో రామాయణ విశేషాలకు సంబంధించిన పలుకదా ఆత్మక శిల్పాకృతులు గోచరమవుతాయి. గొల్లలమామిడాడలో కొలువుదీరిన కోదండరాముడు భక్తులందరికో ఆరాధ్యదైవం కల్యాణోత్సవ రథోత్సవ సదస్వ వసంతోత్సవ డోలోత్సవ ఉత్సవాల కోసం మూలమూర్తులు ప్రక్కనే కౌతుక భేదాలు నెలకొని ఉంటాయి.
శ్రీ చక్ర తల్వార్ల సహితంగా ఉన్న ఈ ఉత్సవ మూర్తులని 1935వ సంవత్సరంలో రూపొందించి గర్భాలయంలో నెలకొల్పారు. గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామాలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంది ప్రతినిత్యం రాములవారికి తులసీపత్ర పూజ సీతమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి గురువారం ఆలయంలో రామదేవుని వ్రతాల నిర్వహించడం ఇక్కడ విశేషం. ధనుర్మాసం కార్తీక మాసం మరియు శ్రావణ మాసాలలో స్వామి వారికి విశేష పూజలు జరుపుతారు చైత్రమాసంలో కోదండరాముడికి వసంత ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు ఇక్కడ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు.