గాలిలో తెలియాడే విగ్రహం. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఈ ఆలయం గురించి తెలుసా?

కోణార్క్ సూర్య దేవాలయం అనేది భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలోని కోణార్క్ పట్టణంలో ఉంది. పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రమట్టానికి దగ్గరలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఒక్క పెద్ద సైజులో ఉండే రథం ఆకారంలో నిర్మించారు. అందువల్ల దీనిని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయానికి కోణార్క్ సూర్యదేవాలయం అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ ఆలయాన్ని సూర్యదేవునికి అంకితం చేస్తూ కట్టడం జరిగింది. కోణార్క్ అనే ఈ పదం రెండు పదాల కలయికతో ఏర్పడింది. అదే కోణం మరియు మందసము. కోణం అంటే మూల మందసం.. అంటే సూర్యుడు అని అర్థం. కోణార్క్ అనగా అర్థం సూర్యుని మూలలు ఈ దేవాలయాన్ని సూర్యునికి అనుకూలంగా ఉండే తరహాలో కట్టినందుకు కోణార్క్ సూర్యదేవాలయం అని పేరు పెట్టడం జరిగింది.
ఈ పురాతన కోణార్క్ సూర్య దేవాలయాన్ని క్రీస్తు శకం 1255లో తూర్పు గంగరాజు వంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి నరసింహాదేవుడు నిర్మించారు.12వేలమంది కార్మికులు కలిసి దాదాపు 12 సంవత్సరాల పాటు కష్టపడగా అంటే 1243 నుంచి 1255 వరకు కష్టపడగా ఈ అందమైన దేవాలయం పూర్తయింది.
ఈ సూర్య దేవాలయం కట్టడం వెనుక ఉన్న కథ ఏమిటంటే..
ఈ ఆలయం గురించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. 1200 నుంచి 1250 మధ్య సంవత్సరాలలో అనగా 13వ శతాబ్దంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలను ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం పాలకులు యుద్ధంలో గెలిచి ఆక్రమించారు. ఈ శక్తివంతమైన ముస్లిం పాలకులచే ఏ భారత దేశ రాజులు సరిగా పోటీ పడలేకపోయారు. ఇలా దాదాపుగా చాలా ప్రాంతాలను ఆక్రమించేసిన ఈ ముస్లిం పాలకులు ఇక హిందూ సాంప్రదాయం నాశనం చేసేందుకు వరుసగా హిందూ దేవాలయాలను సైతం నాశనం చేస్తూ వచ్చారు. ఇలా అయితే ఈ ప్రాంతంలో అనగా ఒరిస్సాలో కూడా హిందూ సామ్రాజ్యం అనేది ముగిసిపోతుందని పసిగట్టిన అప్పటి ప్రాంతపు రాజు గంగ వంశ పాలకుడు నరసింహదేవుడు ముస్లిం పాలకులతో పోరాడేందుకు సాహసించాడు. వాళ్లందరికీ ఒక గుణపాఠం నేర్పాలని భావించి తెలివైన విధానాలతో ఆ ముస్లిం పాలకులపై దాడి చేశాడు.
ఇలా ఈ విధంగా తుగాన్ ఖాన్ అనే ముస్లిం పాలకునితో ఈ హిందూ రాజు యుద్ధం చేసి ముస్లిం సైన్యాన్ని తెలివిగా చదరగొట్టి విజయం సాధించాడు. ఇలా ఈ విధంగా ఎంతో కష్టమైన యుద్ధాన్ని జయించిన ఈ నరసింహ దేవరాజు ఆనందంలో ఇష్ట దైవమైన సూర్యునికి అంకితం చేస్తూ ఒక దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్మించినది ఈ కోణార్క్ దేవాలయం. ఈ దేవాలయం కట్టడం వెనుకున్న మరో మతపరమైన పురాణ కథ ఏమిటంటే.. శ్రీకృష్ణుని కొడుకు అయిన సాంబుడు ఒకరోజు నీళ్లరేవులో అభ్యంగ స్నానం చేస్తున్న కొందరు ఆడవాళ్ళని చూడడంతో శ్రీకృష్ణుడు కోపంతో అతడు కొడుకును శపిస్తాడు. ఈ శాపం వల్ల శంబుడు కృష్ణుని ఆగ్రహానికి గురవుతాడు.
కుష్టు వ్యాధి బారిన పడతాడు. వ్యాధి నుండి బయటపడేందుకు ప్రస్తుతం కోణార్క్ గా పిలవబడుతున్న మైత్రివనంకు వచ్చి అక్కడ నది స్నానం చేస్తూ సూర్యదేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. ఇలా ఈ విధంగా 12 సంవత్సరాలు సూర్య దేవుని కోసం తపస్సు చేయగా చివరికి సూర్యదేవుడు ప్రత్యక్షమై శంభుడినిఆశీర్వదించగా అతని కుష్టు రోగం పోతుంది. దాంతో శంబుడు సూర్యదేవుడు తనకు చేసిన మేలు ఫలితంగా వారికి ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ ఆలోచనతో ఉన్న సమయంలో ఒకరోజు శంబుడు నదిలో స్నానం చేస్తుండగా అతడికి సూర్యదేవుని విగ్రహం దొరుకుతుంది. దాంతో వెంటనే ఆవిగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించి ఈ కోణార్క్ దేవాలయాన్ని కట్టించాడని పురాణ కథలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆ విగ్రహం ఇప్పుడు కనిపించడం లేదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. శంబుడు విషయంలో ఇలా తన వ్యాధి న్యాయం కావడంతో చాలామంది భక్తులు విశ్వాసంతో ఈ ఆలయానికి అప్పటినుండి వస్తున్నారు.
ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని సూర్య గమనానికి అంటే సూర్యుని దిశలకు అనుగుణంగా ఉండేలా నిర్మించారు. ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథానికి మొత్తం 12 జతల చక్రాలు ఉంటాయి. ఈ 12 జతల చక్రాలు కూడా సంవత్సరంలోని 12 నెలలను 12 రాశులను సూచిస్తాయి. అలాగే ఈ 12 జతల చక్రాలు అనేది రోజులోని 24 గంటలను కూడా సూచిస్తాయి. చక్రాల మీద పడే సూర్యకిరణాల ఆధారంగా సమయం ఎంత అవుతుంది అనే విషయాన్ని స్థానికులు చెప్పగలరు. రథాన్ని లాగుతున్నట్లుగా గుర్రాల శిల్పాలు కనిపిస్తాయి.
ఈ ఏడు గుర్రాలు కూడా వారంలోని ఏడో రోజులుగా పరిగనిస్తారు. ఉధర భాగంలో అంటే నేలకు రెండు అడుగుల ఎత్తులో ఏనుగులు, కోతులు లాంటి వివిధ రకాల జంతువులు, పక్షుల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇవి పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయి. వీటిపై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు నాట్యం చేస్తున్న శిల్పాలు, కుస్తీ లాంటి యుద్ధ కలలు అభ్యసిస్తున్న శిల్పాలు వంటివి ఎన్నో కనబడతాయి. ఈ శిల్పాలలో ప్రత్యేకంగా ఒరిస్సా నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు ఉంటాయి. అలాగే ఈ ఆలయ గోడల పై యవ్వనంలో ఉండే వారిని ఆకర్షిస్తూ కామసూత్ర భాష్యం చెప్పే శిల్పాలు ఉంటాయి. ఇది హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియజేస్తాయి.
మరికొంత ముందుకు వెళితే దేవతమూర్తులు విగ్రహాలు కనపడతాయి. దేవాలయానికి పైన పద్మము, కలశము అనేది ఆకర్షణయంగా చెక్కబడి ఉన్నాయి. ఇక ఈ ఆలయం ప్రధాన ద్వారం దగ్గర ఒక సింహం, ఏనుగు విగ్రహాలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఈ సింహం ఏనుగు పై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లుగా అర్థం వచ్చేలా కనిపిస్తాయి. ఇలా వీటిని చెక్కడం వెనుక కారణం ఆ సింహం బొమ్మ అనేది అహంకారానికి పొగరుకి నిదర్శనంగా, ఏనుగు దనానికి ప్రతీకగా ఉన్నాయి. ఇక ఈ రెండు ఉంటే మనిషికి పతనం తప్పదన్నట్లే అని అర్ధాన్ని చూసేవారికి తెలిపేలా ఈ శిల్పాలను ఆలయ ద్వారం వద్ద చెక్కారు. అలాగే పది అడుగుల పొడవు ఏడడుగుల వెడల్పు ఉన్న గుర్రాల శిల్పాలు కనిపిస్తాయి.
ఇవి వీరత్వానికి ప్రతీకలుగా చెబుతారు. ఇలాంటి మరెన్నో గొప్ప విషయాలను తెలియజేసే శిల్పాలు ఉన్నప్పటికీ వీటిని వదిలేసి కొందరు ఆలయంలోని శృంగార భంగిమలను మాత్రమే చూస్తూ ఈ ఆలయాలు బూతు బొమ్మలు అన్నట్టు కొందరు విమర్శించడం వారి మూర్ఖత్వమని ఇక్కడ వారు చెబుతున్నారు. ఈ ఆలయ ముఖ ద్వారంలో గోపురానికి ఉపయోగించిన రాళ్లు అనేవి ఎంతో దృఢమైనవి, శక్తివంతమైనవి. అప్పట్లో ఈ రాళ్ల గొప్పతనాన్ని చూసిన బ్రిటిష్ వారు ఈ రాళ్ళను పరీక్షలు చేసేందుకు కొన్నింటిని ఇంగ్లాండ్ కు కూడా తీసుకుపోయారు. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆయన సందర్శించినప్పుడు ఆయన తన అనుభవాన్ని ఒక్కమాటలో స్పష్టం చేశారు. ఇక్కడి శిల్పాల భాష మనిషి భాషను సైతం అధిగమించింది అని అన్నారు.
ఈ ఆలయం ద్వంశం కథలోకి వెళ్లేముందు ఈ ఆలయంలో ఉన్న అత్యంత ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఆలయంలోని అత్యంత అద్భుతమైనది ఆలయ గర్భగుడి. ఈ గర్భగుడిపై కప్పులో 52,000 కేజీల బరువు అయినా అయస్కాంతాన్ని అమర్చారు. అలాగే దేవాలయాల్లోని మాగ్నెట్ రాళ్లను కూడా ఒక క్రమ పద్ధతిలో ఒకదానిమీద ఒకటి అమర్చారు. ఇలా ఎంతో జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని కట్టిన తర్వాత ఇనుముతో సూర్యదేవుని విగ్రహాన్ని తయారు చేయించి ఈ విగ్రహాన్ని చివరికి గర్భగుడిలో పెట్టగా ఆ విగ్రహం ఈ అయస్కాంత ప్రభావం వలన నేలను తాకకుండా గాలిలోనే తేలుతూ స్థిరపడింది. ఇది చూసేందుకు ఎంతో అద్భుతంగా అప్పట్లో నిలిచింది. అలాగే ఈ సూర్య దేవుని విగ్రహం తల పైన ఒక వజ్రపు కిరీటం ఏర్పాటు చేశారు. దాంతో ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు అనేవి ఈ కిరీటం పై పడగా ఒక్కసారిగా ఆలయమంతా ఎంతో అద్భుతంగా వెలుతురుతో మెరిసిపోయేది. ఇలా ఈ దేవాలయం అనేది ఎంతో అద్భుతంగా అప్పట్లో భారతదేశాల్లో పేరుని తెచ్చుకుంది.
సూర్య దేవుని అనుగ్రహం వలన శంబుడు తన శరీర రోగాల నుంచి విముక్తి పొందడం వలన కట్టించిన ఈ ఆలయానికి ఎన్నో వందల మంది ప్రజలు రోగాలతో బాధపడుతున్న వారందరూ సూర్యదేవుని అనుగ్రహం పొందేందుకు వచ్చేవారు. ఇలా ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ దేవాలయాన్ని 15వ శతాబ్దంలో ముస్లిం పాలకులు భారతదేశాన్ని ఆక్రమించాక వారి సైన్యం ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం తర్వాత కూడా ఈ ఆలయం కాస్త తట్టుకొని నిలబడిన సమయంలో పోర్చుగీసు వారు ఈ ఆలయం దగ్గరలో ఉన్న సముద్ర తీరాన వెళుతుండగా వారి నౌకల్లోని దిక్సూచి ముళ్ళు అనేవి పని చేయడం ఆగిపోయాయి. దీనికి కారణం ఆలయంలో ఉన్న 52 కేజీల అయస్కాంత ప్రభావం వలన అని దీనిని గమనించిన పోర్చుగీస్ వారు ఈ ఆలయాన్ని మరింత ధ్వంసం చేసి ఆయస్కాంతాన్ని తీసుకెళ్లిపోయారని చరిత్ర చెబుతోంది. ఇలా ఎంతో అద్భుతమైన ఈ ఆలయం అనేది నేటికీ పూర్తిగా తన ప్రత్యేకతలను కోల్పోయి కొంతమేర మాత్రమే మిగిలి మన వరకు రావడం జరిగింది.
భారతదేశంలోని దేవాలయాల అన్నింటిలోనూ ఈ దేవాలయం ఎంతో ప్రఖ్యాత చెందినది కావడంతో 1884వ సంవత్సరంలో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా దీనిని గుర్తించారు. అలాగే భారత దేశంలోని 7 వింతలలో ఒకటిగా కూడా ఈ దేవాలయాన్ని చెబుతారు. ప్రస్తుతం మనం పది రూపాయల నోటు మీద కనిపించే ఆ చక్రం అనేది ఈ కోణార్క్ దేవాలయంలోని 12 జతల చక్రాలలోనిదే. ఈ ఆలయం ఎంతగానో ద్వంశమైనప్పటికీ ఈ ఆలయంలో పాక్షికంగా దెబ్బతిని పడిపోయిన కొన్ని శిల్పాలను దగ్గరలోనే ఉన్న సూర్య దేవాలయం మ్యూజియంలో ప్రజలు చూసేందుకు భద్రపరిచారు. ఈ మ్యూజియంలో దేవాలయానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు పత్రాలు పురాతన చిత్రాలను మార్గ చిహ్నాలను భద్రపరిచారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పర్యటకుల సందర్శనార్థం ఈ మ్యూజియం తెరిచి ఉంచుతారు. ప్రతి శుక్రవారం సెలవు. ఈ మ్యూజియం ఎంట్రన్స్ గేట్ కాస్ట్ కేవలం ఐదు రూపాయలు మాత్రమే.
ఈ కోణార్క్ సూర్యదేవాలయానికి వెళ్లాలనుకుంటే ఒడిస్సాలోని భువనేశ్వర్ కి విమానంలో చేరుకుంటే అక్కడ నుంచి 64 కిలోమీటర్లు దూరం రోడ్డు ప్రయాణం చేయాలి. రైలు ద్వారా వెళ్లాలనుకుంటే ఒడిస్సాలోని పూరి నగరం వరకు రైల్లో చేరుకొని అక్కడ నుంచి 33 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయాలి. అదే బస్సు ద్వారా అయితే పూరి నగరానికి లేదా భువనేశ్వర్ కి చేరుకుంటే అక్కడ నుంచి ఈ ఆలయానికి గవర్నమెంట్ బస్సులు అలాగే ప్రైవేటు బస్సులు అనేది ప్రతిరోజు నడుస్తూనే ఉంటాయి. ఇక ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.