HISTORY CULTURE AND LITERATURETelugu Special Stories

క్రూరమైన రాజు అనగానే గుర్తొచ్చేవాడు ఛంఘిస్ ఖాన్ బానిసలే ఆయన ఆస్తి…

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రాజుల చరిత్రలు మనం విని ఉంటాం. ప్రజల మానప్రాణాలను రక్షించి ప్రజా క్షేమమే ధ్యేయంగా రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప రాజులు మన భరతమాత ఒడిలో ఒదిగారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో సైతం ఎంతో మంది రాజులు ప్రజల మనసు గెలుచుకున్న వారే. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక రాజు మాత్రం.. ఈ సమస్త భూభాగంలోని అటువంటి క్రూరుడు ఉండడేమో అనిపిస్తుంది. అతని క్రూర నికృష్ట చేష్టలు తెలిస్తే ముఖాన ఉమ్మి వేయాలి అనిపిస్తుంది. ఇటువంటి నీచులు కూడా రాజులలో ఉంటారా అని ముక్కున వేలేసుకుంటాం. అటువంటి దుర్మార్గపు చరిత్ర కలిగినటువంటి రాజు ఛంఘిస్ ఖాన్. ఇతని చరిత్ర అడుగడుగునా నరకప్రాయమే. బానిసలను ఆస్తులుగా భావించి వికృత ఆనందం పొందిన నికృష్టపు రాజు మరొకరు ఉండరేమో. మహిళలతో దారుణమైన లైంగిక చర్యలు.. వారిని ఆట బొమ్మలుగా భావించే దుర్మార్గుడు మరొకరు ఉండరేమో అనిపిస్తుంది.

ఈ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మొదటగా గుర్తొచ్చే పేరు చెంఘిస్ ఖాన్. ఎన్నో కోట్ల మంది జనాలను హత్య చేసి, ఎన్నో నగరాలను స్మశానాలుగా మార్చిన అత్యంత క్రూరుడు చెంఘిస్ ఖాన్. ప్రపంచంలోనే మూడింట భూభాగాన్ని ఆక్రమించడం ఆయన లక్ష్యం. తన బానిసలతో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ఊహించడం కూడా చాలా కష్టం. అసలు ఎవరు ఆయన  ఇప్పుడు తెలుసుకుందాం.

చెంఘిస్ ఖాన్ కేవలం తన బానిసలనే కాదు జంతువులను కూడా అత్యంత దారుణాతి దారుణంగా హింసించేవాడు. అతన్ని అసలు మనిషిగా భావించడం కూడా తప్పు అని అనిపిస్తుంది అతని చర్యలు తెలిస్తే. అటువంటి క్రూరమైన రాజు ఇప్పుడు గనక ఉంటే అతని మొఖం నరికేయ్యాలి అనిపిస్తుంది. అసలు అటువంటి శాడిస్ట్ రాజు బహుశా ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండకపోవచ్చు. యుద్ధంలో ఓడించిన బానిసలు అందర్నీ కూడా అతిదారునాతి దారుణంగా హింసించేవాడు. అయినప్పటికీ చంగిష్ ఖాన్ ఈ ఒక పేరు మీద ఎన్నో అభిప్రాయాలు. హీరో అంటారు కొందరు. కాదు క్రూరుడు అంటారు ఇంకొందరు. తండాలో పుట్టిన నాయకుడు ప్రపంచాన్ని ఎలా జయించాడు. చంఘిస్ ఖాన్ పేరు చెబితే రక్తంతో తడిసిన చరిత్ర పేజీలు కళ్ళ ముందు కదులుతాయి.

భూమిని పాలించిన గొప్ప చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటల్లో తమ గుర్తులు వదిలి వెళ్లారు. వారిలో నిరంతర యుద్ధాల ద్వారా ప్రపంచ దేశాలను ఆక్రమించి చక్రవర్తులైన వారిలో ప్రపంచ చరిత్ర మార్చినవారు అలెగ్జాండర్, సీజర్, చంగిస్ ఖాన్. అలెగ్జాండర్, సీజర్ ఇద్దరు ఐరోపా దేశాల నుంచి బయలుదేరి ఆసియా దేశాలకు రాగా.. చంగిష్ ఖాన్ ఆసియా  నుండి బయలుదేరి ప్రపంచ దేశాలు ఆక్రమించాడు. అలెగ్జాండర్, సీజర్ ఇద్దరు నగర జీవితాల నుంచి వచ్చిన వారైతే చెంగిస్ ఖాన్ తండా జీవితం నుంచి వచ్చి చివరి వరకు అందులో బ్రతికినవాడు.

చంగిస్ ఖాన్ అంటే ముస్లిం పేరులా అనిపించిన నిజానికి అది మంగోల్ పేరు. చెంగిస్ ఖాన్ అసలు పేరే కాదు చెంగిస్ ఖాన్ అసలు పేరే కాదు. ఒక బిరుదు. ఇప్పటివరకు తెలిసిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు 12 కోట్ల చదరపు మైళ్ళ భూమిని యుద్దాల ద్వారా గెలిచిన ఒకే ఒక్క యోధుడు చంగిస్ ఖాన్. చంగిస్ ఖాన్ హీరోనా వీలనా? అనే ప్రశ్న ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే నెహ్రూ వంటివారు చంగిస్ ఖాన్ తన ఆదర్శ వీరుడు అంటూ రాసిన మాటలు కొంత ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాయి. సినీ హీరో బాలయ్య బాబు కూడా ఒక్కసారైనా చంగిస్ ఖాన్ క్యారెక్టర్ లో నటించాలని ఉందనడం ఆలోచించాల్సిన విషయం.

123 గుడిసెలు, డేరాలు ఉన్న బంజారి తండా నాయకుడు ప్రపంచంలో ముప్పావు వంతు  జయించి మూడు శతాబ్దాల పాటు సువర్ణ యుగాన్ని అనుభవించి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే అది సైనిక శక్తి వల్లే సాధ్యమైంది. చైనా సముద్రం నుండి ఇప్పటి ఉక్రెయిన్ దేశం దాకా తన సైన్యాన్ని నడిపించిన మంగోల్ మహావీరుడు చెంగిస్ ఖాన్ ఊరు పేరు లేని ఒక చిన్న మంగోలు తెగ నాయకుడుగా పుట్టి 11వ శతాబ్దంలో ప్రపంచాన్ని గడగడలాడించిన తిరుగులేని నాయకుడు అంటే ఒక రాజుగా అతడు ముందుండి సైన్యాన్ని నడిపించకుండా బానిస సైన్యం వెనుక దాక్కునేవాడు. చరిత్రకారుల ప్రకారం ఇది యుద్ధంలో అత్యంత భయంకరమైన సంఘటన. శత్రు సైన్యం చెంగిస్ ఖాన్ సైన్యం మీద దాడి చేయడానికి అంటే ముందుగా ఈ బానిసలను చంపాల్సి ఉంటుంది.

అంటే బానిసలను తన సైన్యానికి రక్షణగా వాడుకునే వాడు చెంగిస్ ఖాన్. మంగోల్ సైన్యానికి ఈ బానిసల వల్ల అత్యంత తక్కువ నష్టం కలిగేది. చంగిస్ ఖాన్ సైనికులు 1203, 1209 మధ్యలో చైనాలోని అనేక ప్రాంతాల మీద దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఎంతోమంది బానిసలు శత్రు సైన్యానికి బలయ్యారు. దానివల్ల అసలైన సైనికులు తక్కువ గాయాలతో బయటపడేవారు. 1223వ సంవత్సరంలో చేసిన యుద్దంలో కూడా ఇటువంటి ప్రయోగాన్ని ఉపయోగించాడు చంగిస్ ఖాన్. యుద్ధంలో గెలవడానికి బానిసలను ఒక బానిసపు ముద్దలాగా వాడుకుంటూ శత్రు సైన్యాలకు వారిని బలిచ్చేవాడు. చెంగిస్ ఖాన్ ఈ క్రూరమైన చర్య ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన సంఘటనగా నిలిచింది. కోరా జియాన్ ఎంటైర్ మీద అతను దాడి చేసినప్పుడు కూడా ఇదేవిధంగా బానిసలను శత్రు సైనికులకు బలి ఇచ్చాడు. యుద్ధంలో గెలవడానికి ఏదైనా చేయొచ్చు అని ఆలోచించే చెంగిస్ ఖాన్ క్రూరత్వానికి ఇవి కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.

బానిసలను కేవలం యుద్ధాలకు మాత్రమే కాకుండా గానుగలను తవ్వడానికి, భారీ రాళ్లను వస్తువులను ఎత్తుపెట్టే రాళ్లను చెక్కడానికి, రోడ్ల పనులకు ఉపయోగించుకునేవాడు. ఈ బానిసలు ఎప్పుడు నిద్ర పోతారో ఎప్పుడూ లేవాలో వంటి విషయాల మీద ఎలాంటి నియమాలు లేవు. వాళ్ల కనీస అవసరాలు కూడా తీర్చడానికి ఉండేవారు కాదు. వాళ్లను కొరడాలతో కొట్టడం, చిన్నచిన్న తప్పులకు ఎక్కువగా హింసించడం  చేసేవాడు చంగిస్ ఖాన్. ఎక్కడైతే యుద్ధాలు చేసి గెలుస్తాడో ఆ ప్రాంత ప్రజలను తన బానిసలుగా మార్చుకునేవాడు. యుద్దంలో తమ కవచాలుగా మాత్రమే కాదు ఈ బానిసలను మరికొన్ని పనులకు కూడా ఉపయోగించుకునేవాడు. ఈ బానిసలకు మధ్య కొన్ని పోరాటాలు నిర్వహించి వారిలో వారు పోరాడుకుంటూ ఉంటే చెంగిస్ ఖాన్ అతని మనుషులు ఎంతగానో ఆనందించేవారు.

రోమ్ లో ఎలాగైతే గ్యాడియేటర్స్ మధ్య యుద్ధాలు నిర్వహించి దానిని చూస్తూ ఎంజాయ్ చేసేవారో అదే విధంగా మంగోలు లో కూడా ఇద్దరు బానిసల మధ్య తీవ్రమైన పోరాటాలు నిర్వహించి వారు ఒకరిని ఒకరు చావకొట్టుకుంటూ ఉంటే ఎంజాయ్ చేసేవారు. కేవలం తమ వినోదం కోసం ఆ బానిసలు చచ్చిపోయిన సరే చంగిస్ ఖాన్ పట్టించుకునేవాడు కాదు. అతని దృష్టిలో ఆ బానిసలు కేవలం ఆట బొమ్మలు మాత్రమే. వాళ్లకు అసలు సిసలైన దేవుడు చెంగిస్ ఖాన్ మాత్రమే. చంగిస్ ఖాన్ ఏది చెబితే అది వారు తూచా తప్పకుండా పాటించాల్సిందే. అతని ఆదేశాలను ఎవరైతే పాటించరో వాళ్లకు మరణమే శిక్ష. ఎవరైనా అతనికి ఎదురు తిరిగితే వాళ్లను అత్యంత ఘోరంగా హింసించి చంపేవాడు. అంతేకాకుండా ఈ బానిసలు కూడా తమ  విధేయత నిరూపించుకోవలసి ఉంటుంది. వారు చెంగిస్ ఖాన్ కు అత్యంత నమ్మకమైన బానిస అని అతని నమ్మకాన్ని సంపాదించుకోవలసి ఉంటుంది. అందుకోసం తమ బంధువులను కూడా చంపుకునేవారు. తమ సొంత పిల్లలను కూడా చంపుకున్న బానిసలు ఎంతోమంది ఉన్నారు.

దీనికి ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. 1219లో పారా అనే నగరాన్ని చెంగిస్ ఖాన్ మనుషులు ఆక్రమించారు. వాళ్లు చేసిన దాడిలో ఆ నగరానికి చెందిన గవర్నర్ కొడుకుని చంగిస్ ఖాన్ బంధించాడు. అయితే ఆ కొడుకును చంపే ముందు ఒకవేళ అతని తండ్రిని చంపినట్లైతే తనను విడిచిపెడతానని చెంగిస్తాను అన్నాడు .ఆ దారుణం కొరకు చెంగిస్కాన్ చెప్పినట్టుగానే తన తండ్రిని ఆ గవర్నర్ కొడుకు నిర్ధాక్షణంగా చంపేశాడు. అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా చెంగిస్ ఖాన్ ఆ కొడుకును కూడా చంపేశాడు. ఇక ప్రపంచంలో ఏ బానిసకు తప్పని మరొక శిక్ష ఒకటి ఉంది. ముఖ్యంగా ఆడవాళ్లు బానిసలుగా మారిపోతే వాళ్ల జీవితం నరకప్రాయంగా మారిపోతుంది.

లైంగిక పరంగా వాళ్ళని ఎన్నో రకాలుగా హింసిస్తూ వాళ్లను కేవలం ఆట బొమ్మల్లాగా మారుస్తూ ఉంటారు. ఎంతమంది ఆడవాళ్లు చెంగిస్ ఖాన్ చేతిలో నలిగిపోయారో లెక్కేలేదు. ఈ బానిసలను తన ఆస్తులుగా భావించే చెంగిస్ ఖాన్ వాళ్లను దోచుకునేవాడు. అతనితోపాటు అతని అనుచరులు కూడా బానిసలుగా ఉన్న ఆడవారిపై అత్యాచారాలు చేసేవారు. యుద్ధంలో బంగారం, నగలు దోచుకున్నట్లే స్త్రీలను కూడా వస్తువులుగా పరిగణించి వాళ్లతో తమ లైంగిక అవసరాలను తీర్చుకుంటూ రాక్షసంగా రాక్షస క్రీడలు చేసేవారు. ఈ బానిసలలో కొంతమంది ఆడవాళ్లకు చంగిస్ ఖాన్ ద్వారా పిల్లలు కూడా పుట్టారు. ఈ పిల్లలు కూడా చెంగిస్కాన్ కు అత్యంత సన్నిహితులుగా మారిపోయారు. రాకుమారులతో సరి సమానంగా వీళ్ళు కూడా పెరిగారు. చెంగిస్ ఖాన్ వారసత్వ సామ్రాజ్యంలో వాళ్ళు కూడా భాగం సంపాదించుకున్నారు. ఈ చెంగిస్ ఖాన్ వారసులలో కుబ్లై ఖాన్ అనేవాడు చాలా క్రూరుడు. ఇతను బానిసగా మారిన ఒక యువ రాణికి పుట్టాడు. ఇతని పేరుతోనే చంగిస్ ఖాన్ మనవడు కూడా ఉన్నాడు.

ఇక్కడ ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న 0.5% జనాభా చంగిస్ ఖాన్ వారసులే. అంటే ప్రపంచంలో 16 మిలియన్ల ప్రజల జీన్స్ లో చెంగిస్ ఖాన్ జీన్స్ ఉన్నాయి. అంటే అతను ఎంతమంది ఆడవాళ్ళతో పిల్లల్ని కన్నాడో మీరే ఆలోచించండి. రోమన్ సామ్రాజ్యంలో అమెరికాలో కూడా బానిసత్వం ఉండేది. కానీ చెంగిస్ ఖాన్ లాగా దారుణమైన బానిసలను ఘోరాతి ఘోరంగా ప్రవర్తించే చరిత్ర ఇక ఎక్కడా లేదు. కానీ ఇటువంటి దుర్మార్గమైన నాయకుడిని ఇప్పటికి కూడా హీరోలాగా భావించి పూజించేవారు చాలామంది ఉన్నారు.

Show More
Back to top button