Telugu News

ఇరాన్‌పై ట్రంప్ 60 రోజుల మాస్టర్ ప్లాన్.. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం

పశ్చిమాసియా మరోసారి నిప్పుల గుండంలా మారబోతోంది. ఈసారి ఇరాన్‌ను పూర్తిగా అణచివేయడమే టార్గెట్‌గా అమెరికా ఏకంగా 60 రోజుల భారీ యుద్ధానికి తెరలేపింది. జులై 7 నుంచే అమెరికా సైన్యం ఇరాన్‌పై విరుచుకుపడుతోందని, ఈ సరికొత్త సైనిక చర్యకు తానే స్వయంగా ఆదేశాలు ఇచ్చానని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యూఎస్ పార్లమెంట్‌కు పంపిన అధికారిక ‘వార్ పవర్స్ నోటీసు’లో బాంబు పేల్చారు. “మా దేశ భద్రత కోసం ఎంతకైనా తెగిస్తాం” అని ట్రంప్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు అమెరికా పార్లమెంట్‌కు తెలియకుండా ట్రంప్ ఆడుతున్న ఈ 60 రోజుల మైండ్ గేమ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?

నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఏ దేశంపైనా యుద్ధాన్ని ప్రకటించే పవర్ కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్‌కు అస్సలు ఉండదు. అందుకే అమెరికా అధ్యక్షులు చాలా తెలివిగా దీన్ని ‘యుద్ధం’ అనకుండా, సేఫ్ సైడ్ ‘సైనిక చర్య’ అని పిలుస్తుంటారు. పార్లమెంట్ పర్మిషన్ లేకపోయినా.. ప్రెసిడెంట్ తన సొంత పవర్‌తో కేవలం 60 రోజులు మాత్రమే సైన్యాన్ని వాడుకునే ఒక లూప్‌హోల్ ఇక్కడ ఉంది. దళాలను పంపిన 48 గంటల్లోగా పార్లమెంట్‌కు ఆ విషయం చెప్పి, ఆ 60 రోజుల్లోగా వారి అప్రూవల్ తెచ్చుకోవాలి. ఒకవేళ పార్లమెంట్ నో చెప్తే, దాడులు ఆపేసి సైన్యాన్ని వెనక్కి రప్పించాల్సిందే.

ఇక్కడే ట్రంప్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. నిజానికి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28నే దాడులు స్టార్ట్ చేశాయి. ఆ లెక్కన చూసుకుంటే మే ఒకటితోనే ఆ 60 రోజుల డెడ్‌లైన్ ముగిసిపోయింది. ఆ తర్వాత కొన్ని దేశాల మధ్యవర్తిత్వంతో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. దాంతో మొదటి దఫా సైనిక చర్య అక్కడితో క్లోజ్ అయిపోయిందని ట్రంప్ టీమ్ ప్రకటించింది. కానీ ఇప్పుడు మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో.. పాత కథ ముగిసిపోయిందని, ఇప్పుడు జులై 7 నుంచి సరికొత్తగా మళ్లీ మరో 60 రోజుల సైనిక చర్యను స్టార్ట్ చేస్తున్నామంటూ ట్రంప్ సర్కార్ ఒక వింత లాజిక్‌ను తెరపైకి తెచ్చింది.

కానీ ట్రంప్ ఆడుతున్న ఈ టైమ్ గేమ్‌ను అమెరికా రాజ్యాంగ నిపుణులు గట్టిగా ఎండగడుతున్నారు. పార్లమెంట్ రూల్స్ నుంచి తప్పించుకోవడానికే ట్రంప్ ఈ తాత్కాలిక దౌత్య విరామాలను ఒక పొలిటికల్ ఎత్తుగడగా వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇరాన్‌పై అనధికారికంగా, ఎప్పటికీ ముగిసిపోని ఒక శాశ్వత యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికే ట్రంప్ ఈ తరహా డెడ్‌లైన్ డ్రామాలకు తెరలేపారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సరికొత్త సైనిక చర్య పశ్చిమాసియాను ఎలాంటి వినాశనానికి దారితీస్తుందోనని ఇప్పుడు ప్రపంచమంతా ఊపిరి బిగబట్టుకుని చూస్తోంది.

Show More
Back to top button