
ధన్వంతరి.. హిందూ పురాణాల ప్రకారం, ఆరోగ్యం, వైద్యం, ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన దేవుడు. దేవతల వైద్యుడు అని కూడా పిలుస్తారు. ఈయన ఆయుర్వేదానికి మూలపురుషుడు, వైద్య దేవుడు అని పురాణాల్లో చెప్పబడింది.
ఆయుర్వేద వైద్య పితామహుడు ధన్వంతరి. ఈయనకు ముందు ఆయుర్వేద వైద్యులు ఎవరూ లేరు అని చెప్పవచ్చు. అసలు ఈ ధన్వంతరి దేవుడా లేక వైద్యుడా అనే విషయం అంతుపట్టని విషయం. ఇది ఒక సందేహంగా కూడా చెప్పవచ్చు. నిజానికి ధన్వంతరి వారణాసికి రాజు అని దివోదాస ధన్వాంతరియే ఈ ధన్వంతరి అని ఆయుర్వేదంలో ప్రఖ్యాతి చెందిన వైద్య పరిశోధకుడు అని కూడా చరిత్ర చెబుతోంది. అయితే ధన్వంతరి సాక్షాత్తు మహా విష్ణు స్వరూపం అని మన భారతీయ హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ రెండు కథల్లోని రహస్యాలు ఏమిటన్నది తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు పాలసముద్రం చిలికినప్పుడు అందులో నుండి అనేకమైన వస్తువులు, వ్యక్తులు, దేవతలు బయటపడతారు. అలా ధన్వంతరి నాలుగు చేతులతో ఆ పాలసముద్రం నుంచి బయటకు వచ్చాడు. అలా వచ్చిన ఆయన ఒక చేతిలో పుస్తకం ఒక చేతిలో శంకు ఒక చేతితో ఆయుర్వేద మూలిక మరొక చేతితో అమృత కలశంతో ఉంటాడు. ఇలా చాలా చిత్రాలు ధన్వంతరి గా మనకు కనిపిస్తాయి. అయితే నాలుగు చేతులతో బయటకు వచ్చిన ధన్వంతరి సాక్షాత్తు మహా విష్ణువు అంశ గా చెబుతారు. ఆయన ఒక చేతిలో పట్టుకొని ఉన్న అమృతాన్ని రాక్షసులు తీసుకుపోవడం విష్ణు దేవుని మరొక అంశ జగన్మోహినిగా అవతరించి వచ్చి అమృతాన్ని పంచడం అన్న కథ జరుగుతూ ఉంటుంది.
ఆయుర్వేద పరిశోధనలు చేసి దేవతలకు వైద్యం చేయమని జగన్మోహిని ధన్వంతరిని ప్రోత్సహించింది. అనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ విధంగా ధన్వంతరి దేవ వైద్యుడు అయ్యారు. తర్వాత ఈ భూమిపైన వారణాసిలో వారణాసికి రాజుగా ధన్వంతరి అవతారం ధరించాడు అని మరొక కథనం ఉంది. ఈ కథ అంతరార్థం ఏమిటంటే ఆయుర్వేదంలో భూమిపైన ధన్వంతరి అతి ప్రాచీనుడు అని. ధన్వంతరి అన్న ఈ రాజే శుశ్రుతుడు అను మొట్టమొదటి శాస్త్రజ్ఞుడికి గురువు అనే కథనం కూడా ఉంది. అయితే పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో పరిణతి ప్రదర్శించిన వారిని ధన్వంతరి అనే బిరుదుతో పిలిచేవారని అందుకే ధన్వంతరి ఒకరిని ఉద్దేశించి పిలిచిన మాట కాదని వేరువేరు పరిశోధకుల యొక్క కథనాలే ఒక ధన్వంతరి పేరుకు వచ్చి చేరాయని మరొక వర్గం వాదిస్తూ ఉంటుంది.
మొట్టమొదటి ధన్వంతరి పాలకడలిని చిలికిన నాటి కాలంనాటివాడు అనుకుంటే ఆయనకు మూడు తరాల తర్వాతివాడు కాశీరాజు అయిన దివోదాస ధన్వంతరి అని అంటారు. రెండవ విక్రమాదిత్యుడు ఆస్థానంలో నవరత్నాల పేరుతో తొమ్మిది మంది దిగ్గజాలు ఉండేవారు. ఈ తొమ్మిది మందిలోని ఒకరి పేరు కూడా ధన్వంతరి. ఈ ధన్వంతరి శిష్యుడే సుశ్రుతుడు అని అంటారు. ఇలా వేరు వేరు కాలాలలో ధన్వంతరి ఉన్నట్లు వ్రాయబడి ఉంది. దీనికి కారణం ఏమిటంటే ధన్వంతరి ఆయుర్వేదాన్ని మొదటిసారి పరిచయం చేసిన వాడని ఆయన దానిని గొప్పగా పరిశోధించి ప్రచారంలోకి తెచ్చాడని ఆయన వారసులు అంతా ధన్వంతరిగానే పిలవబడ్డారని అర్థం చేసుకోవచ్చు.
శరీరానికి దోషాలు, రోగాలు, గాయాలు, అనారోగ్య సమస్యలు కలిగినప్పుడు వాటిని నివారించడానికి సూచించే పదమే ధన్వంతరి. దీనిని ధనుష్యల్యం, దస్యంతం, పారంమిల్తీగర్జదీతి ధన్వంతరిహి అని సంస్కృతంలో చెప్పబడింది. మహానుభావుడైన ధన్వంతరి ఆయుర్వేదాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి చెప్పాడు. అవి ఒకటి కాయ చికిత్స. కాయం అంటే శరీరం. దీనికి వచ్చే జబ్బులన్నింటికీ నోటి నుండి ఇచ్చే మందుల ద్వారా తగ్గించడమే కాయ చికిత్స. రెండవది కౌమార మృత్య లేదా బాల చికిత్స. తల్లి గర్భం ధరించిన నాటి నుండి శిశువు పుట్టి యుక్త వయసు వచ్చే దశ దాకా జబ్బులు పడితే వాడిని నివారించడానికి ఈ భాగంలో ఉంటుంది.
మూడవది భూతవైద్యం లేదా గ్రహ చికిత్స. నాలుగు షెలాక్య తంత్ర. కన్ను ముక్కు చెవి గొంతులకు సోకు రోగాల గురించి ఈ భాగంలో ఉంటుంది. షేల్య తంత్ర మందులతో కాకుండా శస్త్ర చికిత్స చేయడం ఈ భాగంలో ఉంటుంది. విషాతంత్ర శరీరంలోకి విషం వెళ్లినప్పుడు కలిగే లక్షణాలను గురించి నివారణల గురించి ఈ భాగంలో ఉంటుంది. ఏడు రసాయన తంత్ర. ఆధునిక అల్లోపతి వైద్యులు దీనిని జిలియాట్రిక్స్ అంటారు. ఎనిమిది వశీకరణ తంత్ర అంటే నపుంసకత్వాన్ని పోగొట్టడం, స్త్రీలలోని సంతానలేమిని పోగొట్టడం వీటి గురించి ఈ భాగంలో ఉంటుంది.
ఈ విధంగా దాదాపుగా మనిషికి కలిగే అన్ని రకాల శారీరక, మానసిక రోగాలను ధన్వంతరి ఒక క్రమ పద్ధతిలో వివరించాడు. ధన్వంతరి రచనలుగా చికిత్స, తత్వ విజ్ఞానం చికిత్స, చికిత్స దర్శిని, చికిత్స కౌముదిగా చెబుతారు. వీటిని ఆధారంగా తీసుకొని సుశ్రుతుడు సుశ్రుత సంహిత రచించాడు అని అంటారు. దీనిని బట్టి ఆయుర్వేదానికి శస్త్ర చికిత్సకు కూడా ధన్వంతరి మొదటి వైద్యుడు అని తెలుస్తోంది. జలుబు, జ్వరం లాంటి చిన్న రోగాల నుండి పక్షవాతం, కామెర్లు, క్యాన్సర్ల దాకా అన్ని రకాల జబ్బులకు ధన్వంతరి మందులను సూచించాడు. పసుపును క్రిమిసంహారిణిగా సూచించాడు. ఆయన చెప్పిన నాటి నుండి గాయాలకు పసుపును వాడడం మొదలైంది. ఇలా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విధానాలు, చికిత్సలు ఆయన తెలియజేసాడు. చరిత్రకు అందనంత సుదీర్ఘ ప్రాచీన కాలంలోనే ఇవన్నీ చేశాడు ధన్వంతరి.
మన భారతీయుల మనసు చాలా గొప్పది. మనకు ఎవరైనా ఉపయోగపడితే వారిని దేవుడు అంటాము. అలాంటిది ఆ రోజుల్లోనే దేశం మొత్తం ఆరోగ్యాన్ని రక్షించిన ధన్వంతరి దేవుడు కాకుండా ఎలా ఉంటాడు. అందుకని ఆయన ఆనాటి నుండి అందరి హృదయాల్లోనూ దేవుడుగా నిలిచాడు. దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయనకు చాలా ఆలయాలు ఉన్నాయి. అందులో నిత్య పూజలు కూడా జరుగుతాయి. ఉత్తర భారతంలో కూడా అక్కడక్కడా ధన్వంతరికి దేవాలయాలు ఉన్నాయి. దేవుడు అంటే మంచి చేసేవాడు, బాగు చేసేవాడు అనే కదా మన అనుకుంటాం.
నిజంగా ధన్వంతరి వేల ఏళ్ల క్రితం చేసింది ఇదే. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. దంత్యరాజ్ అనే పేరుతో దీపావళి మొదటిరోజులో ఈయనకు పండుగ జరుపుతారు. ఇదే రోజున ధన్వంతరి జయంతిగా కూడా జరుపుతారు. “ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ వస్తాయా వజ్రపాక హస్తాయా సర్వామయ్య వినాశాయ త్రైలోక్యనాధాయ శ్రీ మహా విష్ణువే నమః” అంటూ ప్రసిద్ధమైన ధన్వంతరి మంత్రం కూడా ఉంది. దీనిని సూర్యోదయ సమయంలో 108 సార్లు జపిస్తే ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది అని పండితులు చెబుతారు. ఇదే విధంగా ధన త్రయోదశి రోజు ధన్వంతరి వ్రతం కూడా జరుపుకుంటారు.
మరో కథనం ప్రకారం…
శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని, ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు కూడా ఉన్నాయి.
దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా, దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం, కామధేనువు ఐరావతం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. ‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో, ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’ అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది.
దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా, దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. ‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో, ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’ అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది.
ధన్వంతరిని విష్ణువు ‘అబ్జుడు’గా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని, అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది.
సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం.
బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి, మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి, అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహతప్పింది.
ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతణ్ని తేరుకునేట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి, ద్రోణ, పుండరీక, ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి త శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తారు.
అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారంచేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి; శలాక్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వవైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.
చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావడం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్ సమీపంలో ‘ధన్వంతరి క్షేత్రం’ ఉంది.