Telugu Special Stories

76వ గణతంత్ర దినోత్సవం నేడు.ప్రత్యేకతలు ఇవే.!

గణతంత్రం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలని అర్థం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి మన దేశం సర్వసత్తాక, స్వామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రాజ్యాంగబద్ధత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ప్రస్తుతం దేశ పాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలను అనుసరిస్తూ పాలిస్తున్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన డా. బీఆర్ ​అంబేడ్కర్.. ఆలోచనలు, సిద్ధాంతాలు తత్వాల ఫలమే నేడు మన జాతికి దిశానిర్దేశం అయ్యాయి. 

సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మాత్రం కాదు. అయితే జనవరి 26నే ఎంచుకోవడానికి కూడా బలమైన కారణం దాగి ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ ‘పూర్ణస్వరాజ్’ని ప్రకటించుకుంది ఆరోజునే. అందుకు సంపూర్ణ స్వరాజ్యం అయిన రాజ్యాంగం అమలు 26నే చేయాలనీ నిర్ణయించింది. 

తొలి గణతంత్ర వేడుకలను మూడు రోజులు జరిపారు. ఆ రోజున భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేసి సైనిక వందనం చేయడం ఓ ఆనవాయితీగా నేటికీ కొనసాగుతోంది. అంతేకాకుండా ఏటా ఒక దేశం నుంచి ప్రముఖులను మనదేశానికి ఆహ్వానించి సకల లాంఛనాలతో వారిని సత్కరించడం కూడా ఓ ఆనవాయితీ. ఈ ఆనవాయితీ 1976 నుంచి పాటిస్తున్నారు. ఇక రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇప్పుడు దేశమంతటా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోనుంది.

రాజ్యాంగ పీఠిక..

1947 ఆగస్టు 29న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అధ్యక్షతన అనేక సవరణల అనంతరం 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

సుమారు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేసి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది.

భారత పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సమకూర్చాలని మన రాజ్యాంగ పీఠిక నిర్దేశించింది. సమాజంలో అన్ని వర్గాల హక్కులకు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు భరోసానిచ్చే ముఖ్యమైన సాధనం. కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా విచక్షణలకు ఆస్కారం ఇవ్వకుండా పౌరులందరికీ సమానత్వం ప్రసాదిస్తోంది. 

1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన, అది పూర్తిస్థాయిలో అయితే కాదు. స్వాతంత్రం వచ్చేనాటికి మనకు రాజ్యాంగం లేదు. 1935లో ఆంగ్లేయులు అమలులోకి తెచ్చిన చట్టం ప్రకారమే పాలన కొనసాగింది.

1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచన కమిటీని ఏర్పాటు చేసి, ఏడుగురు సభ్యుల బృందానికి అంబేడ్కర్ చైర్మన్‌గా కీలకపాత్ర పోషించారు. 

ప్రపంచంలోని బ్రిటన్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, కెనడా వంటి వివిధ దేశాల నుంచి అనేక అంశాలను పరిశీలించి రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రూపొందించారు. 

అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం లాంటివి ప్రధాన అంశాలు.

1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ, దాన్ని రెండునెలల పాటు అమల్లోకి తేకుండా ఆపారు. 1930లో లాహోర్ సదస్సులో సంపూర్ణ స్వరాజ్యం కోసం కాంగ్రెస్ నినదిస్తూ, జనవరి 26ను సంపూర్ణ స్వరాజ్యం దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. అందువల్ల అదే ముహూర్తాన్ని గౌరవిస్తూ కొత్త రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న ఆవిష్కరించారు.

రాజ్యాంగ ప్రతిలో సీతారాములు, అక్బర్ ,టిప్పు, బోస్ చిత్రపటాలను చేర్చారు. రాజ్యాంగ అసలు ప్రతిని టైపు చేయలేదు. ప్రింట్ చేయలేదు. చేతిరాతతో హిందీ, ఇంగ్లీషు భాషల్లో రాశారు. క్యాలిగ్రఫీ రాయడంలో దిట్టగా పేరొందిన ప్రేమ్ బిహారి నారాయణ్‌తో దీన్ని రాయించారు. సనాతన భారతీయ పత్రికలతో పాటు జాతీయ ఉద్యమంలోని నేతలు, ఘట్టాలతో పాటు వేదాలు, రామాయణ ఘట్టాలు, మొహంజోదారో, బుద్ధుడు, మహావీరుడు, గుప్తుల పాలనలోని స్వర్ణ యుగాలతో మొదలుపెట్టి మధ్యయుగం నాటి మహాబలిపురంలోని నటరాజ శిల్పం, మొగల్ చక్రవర్తి, అక్బర్, మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ, మైసూర్ మహారాజు, టిప్పు సుల్తాన్, వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి, గాంధీ దండి సత్యాగ్రహ యాత్ర, త్రివర్ణ పతాకానికి సుభాష్ చంద్రబోస్ సెల్యూట్ చేస్తున్న బొమ్మలను మొదలైనవి గీశారు. రాజ్యాంగం అమల్లోకి రాగానే రాజ్యాంగ సభ సహజంగానే రద్దై తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగేదాకా తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. సభా చైర్మన్ బాబు రాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతి అయ్యారు.

వీదేశీ పాలన పూర్తిగా అంతరించిపోయి, స్వతంత్ర దేశంగా పురుడుపోసుకుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది. దాదాపు 2 శతాబ్దాలకుపైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా, 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. కావున అదే రిపబ్లిక్ డే!

Show More
Back to top button