HEALTH & LIFESTYLE

క్యాన్సర్ ఎలా వస్తుంది? ముందస్తు జాగ్రత్తలు..

ప్రాణాంతక రోగాల్లో క్యాన్సర్ ఒకటి. అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది? దీనిని గుర్తించడానికి ఏ లక్షణాలు ఉంటాయో చూద్దాం. దీన్ని ఆరంభ దశలోనే గుర్తించగలిగితే తగిన చికిత్స చేసి నివారించవచ్చు. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. ఈ కణాల విభజన తర్వాత కొంతకాలానికి చనిపోతాయి. డీఎన్ఏలో ఒక్కసారిగా మార్పులు రావడంతో కణాలు చావకుండా అదుపు చేయలేనంతగా పెరిగితే దానినే క్యాన్సర్ అంటారు. ఆహార అలవాట్లు (జంక్‌ పుడ్స్), జీవన విధానంలో మార్పులు రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయంతో క్యాన్సర్ వస్తుంది.  అసలు దీని ప్రారంభ లక్షణాలు, క్యాన్సర్ ఎలా లో రకాలు  అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

డీఎన్ఏతో మన తల్లిదండ్రుల ఉండే లక్షణాలు మనకు వచ్చినట్టే.. అలాగే క్యాన్సర్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.

 ముఖ్యంగా.. అలసట, ఎప్పుడూ నీరసంగా ఉంటే.. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. జ్వరం వచ్చి అది అలాగే కొద్ది నెలల పాటు ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్‌కు సూచనగా భావించాలి. గొంతు-మెడభాగంలో ఎల్లప్పుడూ ఉబ్బి ఉంటే దాన్ని గొంతు క్యాన్సర్‌గా పరిగణించాలి. వృషణాల సైజ్‌లో మార్పు, వాపు, భారంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని వృషణాల క్యాన్సర్‌గా భావించాలి. చర్మంలో ఉన్నట్టుండి మార్పులు, రక్తస్రావం, మచ్చల వంటివి ఏర్పడితే అది చర్మక్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది. తినే ఆహారం మింగేటప్పుడు గొంతులో ఇబ్బందిగా ఉంటే అది గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. నోట్లో, నాలుకపై తెల్లని మచ్చలు ఎక్కువగా ఉంటే అది ఓరల్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది.

 వైద్యులు.. బేరియం ఎనిమా, బోన్ మ్యారో ఆస్పిరేషన్ మరియు బయాప్సీ, కొలనోస్కోపీ మొదలైన క్యాన్సర్ పరీక్షలు చేసి తెలుసుకుంటారు.

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే.. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దురలవాట్లను వదిలేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలి.

బ్రోకలి, క్యారెట్లు, బీన్స్, నట్స్, సిట్రిస్ జాతిపండ్లు వంటివి ఎక్కువ తీసుకోవాలని వైద్యుల సలహాలిస్తున్నారు.

ప్రాసెస్డ్‌ ఫుడ్‌, చక్కెరలు, నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

ముఖ్యంగా వంశపారంపర్య క్యాన్సర్‌ సంక్రమించే అవకాశాలున్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.

తాజా పండ్ల రసాలు అలవాటుగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.


ఎంత త్వరగా క్యాన్సర్‌ను గుర్తిస్తే, చికిత్సకయ్యే ఖర్చు అంత త్వరగా, తక్కువగా ఉంటుంది. నివారణ కూడా ఎక్కువే.

Show More
Back to top button