
వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో చాలామంది సముద్రతీర ప్రాంతాలకు వెళ్లి వానలో తడుస్తూ, అలలతో ఆడుకోవాలని చాలామంది ఇష్టపడతారు. మీరు కూడా అలాంటి ప్లాన్ చేస్తే.. కోవలం బెస్ట్ ప్లేస్‌గా చెప్పుకోవచ్చు.
కోవలం కేరళలోని ప్రసిద్ధ బీచ్. వర్షాకాలంలో ఇక్కడ సముద్రం మరోలా కనిపిస్తుంది. అలలు బలంగా కొట్టుకోవడం, వాన చినుకులు పడుతుండగా బీచ్‌పై నడవడం మైండ్‌కి ఫ్రెష్‌గా ఉంటుంది. కోవలంలో లైట్హౌస్ బీచ్, హవా బీచ్, సముద్ర బీచ్ ఈ మూడు ప్రధాన ఆకర్షణలు. ఈ సీజన్‌లో ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడటానికి మిస్ అవ్వకండి.
తెలుగు రాష్ట్రాల నుంచి కోవలం వెళ్లే మార్గాలు:
విమానంలో: తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌కి ముందుగా చేరాలి. అక్కడి నుంచి క్యాబ్‌లో 15 కి.మీ దూరంలో కోవలం ఉంటుంది.
రైలులో: తిరువనంతపురం రైల్వే స్టేషన్‌కి వచ్చి, అక్కడి నుంచి రోడ్ మార్గంలో వెళ్లవచ్చు.
బస్సులో: కేరళ RTC, ప్రైవేట్ బస్సులు తిరువనంతపురం వరకు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి లోకల్ బస్సులు లేదా ఆటోలు అందుబాటులో ఉంటాయి.
సొంత వాహనంలో: రోడ్డు ప్రయాణం కూడా బాగుంటుంది. హైదరాబాద్ నుంచి కోవలం దాదాపు 1,250 కి.మీ.
కోవలంలో చూడాల్సిన ప్రదేశాలు:
లైట్హౌస్ బీచ్
హవా బీచ్
విజింజం మత్స్యకార గ్రామం
కేరళ మత్స్య పరిశోధన కేంద్రం
పద్మనాభస్వామి ఆలయం (తిరువనంతపురం)
బడ్జెట్ (3–4 రోజులు):
ఆహారం: రోజుకు ఒక్కరికీ రూ.300–రూ.600
రూమ్: రోజుకు రూ.1500–రూ.4000
బీచ్ యాక్టివిటీస్: రూ.1000–రూ.3000
ఇతర ఖర్చులు: రూ.1000–రూ.2000
టిప్:
వర్షాకాలంలో సముద్రం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పెద్ద అలల దగ్గరికి వెళ్లకండి. కానీ, వానలో బీచ్‌పై కూర్చుని కాఫీ తాగితే వచ్చే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం.












