Telugu News

ప్రపంచ కరెన్సీగా డాలరే ఎందుకు..?

ప్రపంచంలో చాలా దేశాలు డాలర్‌నే కరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌గా పరిగణిస్తున్నాయి. డాలర్ విలువ కంటే ఎక్కువ విలువ ఉన్న యూరో, పాండ్ వంటి కరెన్సీలు ఉన్నా కూడా డాలర్‌నే ఎక్స్‌ఛేంజ్ కరెన్సీగా ఎందుకు వాడుతారు అనే సందేహం మీలో ఒకసారి అయినా వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర చూసుకుంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది.

అమెరికా మాత్రం దాని బలం పెంచుకుంటూ పొయింది. యుద్ధంలో పాల్గొన్న కొన్ని దేశాలు కావలసిన వసతులను, వనరులను US నుంచి దిగుమతులు చేసుకునేవి. అలా 1944లో విదేశీ లావాదేవీలకు ఒక కరెన్సీ కావాల్సి వచ్చింది. దీంతో 44 దేశాలు కలిసి IMF(ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) అనే సంస్థను ఏర్పాటు చేశాయి.

IMF సంస్థలో ఉన్న 44 దేశాలు కలిసి విదేశీ లావాదేవీలకు బంగారాన్ని వాడుకోవాలని నిర్ణయించాయి. దీనికోసం బ్రిట్టేన్ వుడ్ అగ్రిమెంట్‌ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం అన్ని దేశాలు వస్తువులను మార్చుకోవడానికి బంగారాన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. దీంతో USలో బంగారం నిల్వలు పెరిగాయి. దీనికి తోడు ఇతర దేశాల దగ్గర బంగారు నిల్వలు తగ్గిపోయాయి.

దీంతో US సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ తమ పలుకుబడిని ఉపయోగించి US డాలర్‌ని ప్రపంచ కరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌గా మారేలా చేసింది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్‌నే విదేశీ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారు. ఇదండీ ప్రపంచ కరెన్సీగా డాలర్ ఉండడానికి వెనుక ఉన్న కథ.

Show More
Back to top button