TRAVEL ATTRACTIONS

కోటలు, హవేలీలు, ఎడారి సోయగాలు

జైసల్మేర్ పేరు విన్నారా..? అయితే ఈ ప్రదేశం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారి మధ్యలో ఉన్న ఈ నగరాన్ని “గోల్డెన్ సిటీ” అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి ఇళ్లు, కోటలు, హవేలీలు అన్నీ పసుపు రంగు రాళ్లతో నిర్మించబడి బంగారు వెలుగులా మెరిసిపోతాయి. ఇక్కడి చారిత్రక కోటలు, ఎడారి సఫారీలు, రాజస్థానీ సంస్కృతి ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ.

జైసల్మేర్‌లో చూడాల్సిన ప్రదేశాలు:

*జైసల్మేర్ కోట (Sonar Quila)

*పట్వాన్ కి హవేలీ

*సామ్ సాండ్ డ్యూన్స్ – ఎడారి ఒంటెల సఫారీకి ప్రసిద్ధి

*గదిసర్ సరస్సు

*నాథ్మల్ కి హవేలీ

*సలీం సింగ్ కి హవేలీ

జైసల్మేర్ ఎలా చేరుకోవాలి:

బస్సు మార్గం: జైపూర్, జోధ్‌పూర్, బికానేర్ నగరాల నుండి డైరెక్ట్ బస్సులు లభిస్తాయి.

రైలు మార్గం: జైసల్మేర్ రైల్వే స్టేషన్ ప్రధాన నగరాలతో బాగా కలుపబడింది. ఢిల్లీ, జైపూర్ నుండి స్పెషల్ ట్రైన్లు ఉన్నాయి.

ఎయిర్ మార్గం: జైసల్మేర్ ఎయిర్‌పోర్ట్ సీజనల్‌గా పనిచేస్తుంది. సమీప అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ జోధ్‌పూర్ (285 కి.మీ).

టూర్ బడ్జెట్:

జైసల్మేర్‌కి రానుపోను ఖర్చులు సుమారు రూ.4000 నుంచి రూ.7000 వరకు ఉంటాయి. రూమ్ అద్దె రోజుకు రూ.1000 నుంచి రూ.2500 వరకు, ఫుడ్‌కి రోజుకు రూ.600, గైడ్‌కి రూ.800, ఎడారి సఫారీకి రూ.1200 వరకు ఖర్చవుతుంది.

Show More
Back to top button