Telugu News

శిథిలాల కింద మహిళలు చచ్చిన సరే వారిని ముట్టుకోం..

“స్త్రీ కార్యేషు దాషి, కరణేషు మంత్రి. భోజ్యేషు మాతా, శయనేషు రంభలాంటి సర్వీసెస్కు తప్ప రాజు హోదాకు తాను పనికి రాదు -పితృస్వామ్యం” 

కొంచెం ఆలస్యంగా నాజీవితంలోనే అత్యంత హేయమైన విషయం ఒకటి చదివాను ఇవాళ. ఆఫ్గానిస్తాన్లో భూకంపం వచ్చి మూడువేలమంది ప్రాణాలు కోల్పోగా అనేకవేల-మంది ఇంకా శిథిలాలలో ఇరుక్కుని ఉన్నారు. తాలిబాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్యం, సామాన్య పౌరులూ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. అయితే నీచమైన విషయం ఏంటంటే.. సదరు రెస్క్యూ ఆపరేషన్ చేసేవాళ్లు మొదట పురుషుల్ని, తరవాత పిల్లల్ని రక్షిస్తున్నారు. స్త్రీలను ఆఖర్లో, లేదా అసలు కాపాడే ప్రయత్నమే చేయడంలేదు. ఎందుకం-టే.. రక్షణ చర్యలు చేపట్టినవాళ్లు పురుషులు. పరాయి పురుషుల స్పర్శ తగలకూడదు.

అనే నియమం ఆసమాజంలోని స్త్రీలకు ఉంది. శిథిలాలలో ఇరుక్కున్న స్త్రీలను బయటకు తీయాలంటే వాళ్ల శరీరాన్ని తాకకుండా ఆపని జరగదు కాబట్టి వాళ్లను అక్కడే వదిలేస్తు-న్నాం అని తమ మతనిష్టను గొప్పగా చెప్పుకుంటున్నారు. బహుశా సదరు స్త్రీలు కూడా చావనైనా చస్తాం కానీ మరో పురుషుడి స్పర్శ మాత్రం మేము అంగీకరించం అని శిథి-లాల కిందనుండి అరిచి చెప్పినా చెప్పి ఉంటారు. భర్తలు చస్తే వాళ్ల చితుల్లో దూకి తమ పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న చరిత్రను మనం కూడా చూసాం కదా!

మతం దేనికోసం పనిచేస్తుంది

మతం అంతే.. అది ఎప్పుడైనా ఎక్కడైనా పురుషుడు, అందునా ఆధిపత్య వర్గపు పురు-షుడి సంతోషం, క్షేమం, దోపిడీ కోసమే పనిచేస్తుంది. అందులో అందరికన్నా అత్యంత దారుణంగా నష్టపోయేది, హింసింపబడేదీ స్త్రీలే! కానీ.. వాళ్లే మతానికి అత్యంత బల–5 . Women is the most powerful tool of patriarchy. -తృస్వామిక భావజాలాన్ని వ్యాప్తిచేసే అతి శక్తివంతమైన ఆయుధం స్త్రీ. మగాడు చాలా తెలివిగా పితృస్వామ్యానికి స్త్రీని custodian చేశాడు. స్త్రీ మూర్ఖంగా దాన్ని స్వీకరించి మోస్తూనే ఉంది. భవిష్యత్తులో కొనసాగిస్తుంది కూడా..

‘ముస్లిం మహిళలను హిందువులు రేప్ చెయ్యాలి’

ఈ మాట చెప్పింది బీజేపీ మహిళ నేత సునీత సింగ్.. పురుషాధిక్య ఆలోచనా విధానం పురుషులలో మాత్రమే ఉండే రోగం కాదు. సమాంతరంగా అది స్త్రీలలోనూ ఉంటుంది. ఎవరి ప్రభావం వలన ఇది జరిగినా, ప్రస్తుతం మతం దాన్ని పెంచి పోషిస్తుంది. పురుషు-లకన్నా స్త్రీలే మత వాహకాలుగా ఇప్పుడు పనిచేస్తున్నారు. మతం లేని స్త్రీ, శీలం లేని ఆడది అనే భావన కలిగించిన పురుషుడు అందుకు కారణం కావచ్చు. లేదా తన ఇంటి స్త్రీలు మతంలో ఉంటే తన ఆధిపత్యాన్ని దైవ విధిగా వాళ్లు అంగీకరిస్తారు అనే కుట్ర అయి ఉండవచ్చు. మొత్తానికి పురుష ఆధిక్యత ప్రధానంగా మతం అనే పల్లకిలో ఊరే-గుతుంది. దానిలోని ఉత్సవ విగ్రహాలు పురుషులు… బోయీలు స్త్రీలు. ఉన్మాదం ఎక్కువ-యి ఈ స్త్రీ ఏం వాగుతుందో చూడండి. కాళ్లమధ్య అంగం లేదు కానీ.. ఉంటే ఈపాటికి ఎందరిని చెరిచి తొడ కొట్టేదో! పిచ్చిది.. ముస్లిం స్త్రీలను చెరిచాకా తన కులపురుషుల అంగాలు ముడుచుకు కూర్చుంటాయి అనుకుంటుంది! అలవాటు పడ్డాక.. అందుబాటు-లో ఉన్న అమ్మనైనా వదిలే రకాలు కాదు వాళ్లు అని తెలియనట్టు ఉంది.

కావల్సింది ఏంటి? 

మతం ఉంది. దానితో చాలామందికి పేచీ లేదు. కానీ అందులోని ఆచారా-లు మనుషుల హక్కులను లాగేస్తున్నప్పుడు, నిస్సహాయులను చేస్తున్నప్పు-డు అందరికి పేచీ ఉంటుంది. ఉండాలి! ఏడో శతాబ్దంలో ఆవిర్భవించిన ఇస్లాం మతంలో అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అనేక ఆచారాలు రూపొందాయనేది అందరికి తెలిసిందే. ఇస్లాంలో భార్య తన భర్త నుంచి విడిపోయేందుకు ‘ఖులా’ ఉంది. భర్త తన భార్య నుంచి విడిపోవా-లంటే మనందరికీ తెలిసిన ‘తలాఖ్’ ఉంది. ఒకవేళ అలా విడిపోయిన ఢా-ర్యాభర్తలు మళ్లీ కలవాలంటే? అక్కడ వచ్చింది చిక్కు. భర్త నుంచి విడిపో-యిన స్త్రీ తిరిగి అతణ్ని చేసుకోవాలంటే, మధ్యలో మరొకరిని పెళ్లి చేసుకో-వాలి. అతనితో ఒక రోజైనా పరిపూర్ణ వివాహ జీవితం గడిపిన తర్వాతే వి-డాకులిచ్చి ముందు భర్తను మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. ఈ నియమం పురుషు-లకు లేదు. దీన్ని ‘నిఖా హలాలా’ అంటారు.

2011లో సువీరన్ అనే దర్శకుడు బ్యారీ భాషలో ‘బ్యారీ’ అనే సినిమా తీ-శారు. దక్షిణ కర్ణాటక, కేరళ సరిహద్దులో మాట్లాడే ఆ భాషకు లిపి లేదు. ఆ భాషలో వచ్చిన తొలి సినిమా ఇది. ‘నిఖా హలాలా’ వల్ల మహిళలు పడు-తున్న మానసిక ఇబ్బందుల గురించి చెప్పే కథ. నటి మల్లిక(‘నా ఆటోగ్రాఫ్” సినిమాలో విమల పాత్ర చేసిన నటి) ఇందులో నాదిరా అనే ముస్లి మహిళ పాత్ర పోషించారు. భర్తకు, తండ్రికి జరిగిన గొడవ కారణంగా తన ప్రమేయం లేకుండానే భర్త చేత విడాకులు పొందిన నాదిరా అప్పటికే ఓ బి-డ్డ తల్లి. కొన్నేళ్ల తర్వాత తండ్రి తన తప్పు తెలుసుకుని కూతుర్ని, అల్లుడినీ కలపాలని చూస్తే మతాచారాలు ఆపేశాయి. మతం ప్రకారం అన్ని విధులూ చేపడితేనే మళ్లీ వాళ్లు కలిసేది. లేకపోతే లేదు.

ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసు-కుని, రెండ్రోజులు ఉండి తలాఖ్ చెప్పి వెళ్లిపోయేది ఎవరు? ఎక్కడ దొరుకు-తారు? డబ్బులిస్తే వస్తారా? ఒక ఆడదాని జీవితం అంటే ఇంత చులకనా? అంతా మగవాళ్ల ఇష్టమా? మతాచారాలన్నీ మగవాళ్ల కోసమేనా? అక్కడ ప్రశ్న మొదలవుతుంది. నాదిరా ఆలోచన మారుతుంది. నాదిరాను పెళ్లి చే-సుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోతే చివరకు ఆమె చిన్ననాటి స్నేహి-తుడు పెళ్లి చేసుకుంటాడు. అందరూ తృప్తిపడతారు. లాంఛనానికి తొలిరా-త్రి పడగ్గది ఏర్పాటు చేస్తారు ‘ఇదంతా కేవలం ఆచారం కోసమే! నిన్ను నేను ముట్టుకోను.

రేపు నువ్వు నీ భర్తను పెళ్లి చేసుకోవచ్చు’ అని ఆమెతో అం-టాడతను. ఆమె నవ్వుతుంది. ‘మనం ఈ తతంగాలు చేసి మనుషుల కళ్లు కప్పగలమేమో కానీ దేవుడి కళ్లు కాదు. ఆయన దృష్టిలో మనిద్దరం భార్యా-భర్తలం. మన బంధం పరిపూర్ణమయ్యాకే మనం తీసుకునే విడాకులకు ఆయన దృష్టిలో విలువ’ అంటుంది. అతను భయపడతాడు. ఆమె అతణ్ణి గట్టిగా పట్టుకుంటుంది. ఈ ముగింపు నన్ను భయపెట్టింది. ఒకానొక స్థితిలో స్త్రీలు ఆచారాల మీద, మగవారి మీద నిరసనను ఎంత ధైర్యంగా వ్యక్తం చే-స్తారో చూసి వణికాను. కావాల్సింది ఇదే!

Show More
Back to top button