
ఏ ఎమోషన్స్ లేకుండా ఉండటానికి మనం ఏం యంత్రాలు కాదు. ఒక మనిషి ఆరోగ్యం, ఆనందానికి చుట్టూ సమాజం, మానవ సంబంధాలే కారణం. కొన్ని అనుభూతులు పొందినప్పుడు మెదడు సెరోటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు విడుదల చేస్తుంది. వీటినే ‘ఫీల్-గుడ్ హార్మోన్స్’ అని పిలుస్తారు. ఇవి మనల్ని సంతోషానికి గురిచేస్తాయి. మరి ఇలాంటి హార్మోన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఒత్తిడికి గురవుతాము? ‘అనుకున్నది జరగకపోతే బాధపడతాం’ ఏవైనా ఎంత గట్టిగా కోరుకుంటే అది దక్కకుంటే అంతే.. ఒత్తిడి(డిప్రెషన్)కి లోనవుతారు. దు:ఖానికి కారణం కోరికలే. కోరికలు వస్తువులు, వ్యక్తులపై ఉంటాయి. ఆ కోరికలు తీరకపోతే సమస్యలు తప్పవు. అందుకే దేనిపైనా ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు.
మూడ్ స్వింగ్స్
జీవితంలో సుఖదుఃఖాలు, సంతోషం, ఆనందం ఇవన్నీ సహజం. కానీ, కొందరిలో వెంటవెంటనే మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. అంటే అప్పటికప్పుడే కోపం వ్యక్తం చేస్తారు. మళ్లీ ఉన్నట్లుండి బాధపడతారు. నిరాశగా కనిపిస్తారు. వెంటనే హ్యాపీగా ఉంటారు. వీటిని ‘మూడ్ స్వింగ్స్’ అంటారు. మహిళల్లో పీరియడ్స్ టైంలో ఇలా మూడ్ స్వింగ్స్ అవుతుంటాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో తలనొప్పి, తిమ్మిరి ఇలా మూడ్ మారుతుంది. గర్భంతో ఉన్నప్పుడు పిండానికి, తల్లికి సరిపడా హార్మోన్లు విడుదల అవుతాయి. ఆ హార్మోన్ల అసమతూల్యత కారణంగా కూడా మూడ్ స్వింగ్స్ అవుతుంటుంది.
మూడ్ స్వింగ్స్‌కు కారణాలు
బైపోలార్డ్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు
ఒత్తిడి, ఆందోళన, లోబీపీ.