Telugu News

అయోధ్య భోజనం అదరహో…

శ్రీరామ ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది.అయితే 500 ఏళ్ళ తర్వాత జరిగే ఈ ప్రాణ ప్రతిష్ట కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, అయోధ్యకు తిరుపతి నుండి లడ్డులు పంపుతుంటే,సిరిసిల్ల నుండి చీరను,హైదరాబాద్ నుండి కూడా చీరను, అలాగే మరో దంపతులు ఒక పెద్ద తాళాన్ని పంపిస్తున్నారు. ఇలా భక్తులు తమకు తోచిన కానుకలను అయోధ్యకు పంపడం చాలా అదృష్టం.అలాగే ఆలయాల పరిశుభ్రత అనే కార్యక్రమం కూడా హర్షనియమే.

ఎన్నో సమస్యలు,గొడవల తర్వాత జరిగే ఈ అద్భుతమైన ఘట్టం కోసం కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్నారు. అన్ని టివీలలో ప్రాణ ప్రతిష్టను లైవ్ ఇవ్వబోతున్నారు,అలాగే నిజాం గ్రౌండ్స్ లో అతి పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి కూడా చూపిస్తున్నారు.అక్కడికి చాలా మంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి అనే విషయం మీకు తెలిసిందే.

బల్కురి లాంటి చెట్టు తో,ఇనుము,స్టిల్ లాంటివి ఉపయోగించకుండా కేవలం రాళ్ళతో వందేళ్ళైనా చెక్కు చెదరకుండా నిర్మించిన ఆలయం ఇది, త్రేతాయుగం,ద్వాపరయుగం తర్వాత వచ్చేదే కలికాలం,కాలి కాలం మొదలయ్యి కూడా అయిదువందల ఏళ్ళు అయ్యిందని మీకు తెలుసా,నిజమే అండి కలికాలం వచ్చి అయిదువందల ఏళ్ళు అయ్యింది, అందుకే అప్పట్లో గొడవలు జరిగే ఆలయాన్ని కూల్చి వేశారు.దాన్ని నిర్మించే ప్రయత్నం ఎవరూ చేయలేక పోయారు.ఎందుకంటే కొందరు నాస్తికులు ఆలయాన్ని నిర్మిస్తే చంపేస్తామని బెదిరించడమే కారణం అయితే, ఇంకా కొన్ని కారణాల వల్ల ఏ ప్రభుత్వం సాహసం చేయలేకపోయింది.ఇప్పుడు మోడీ వల్ల ఆలయాన్ని నిర్మించడం మనం చేసుకున్న పుణ్యం,ఎందుకంటే రాముడు తిరుగాడిన నేలను తాకడం పూర్వజన్మ సుకృతం.కాబట్టి మోడీ గారిని అభినందించాల్సిందే,ఎవరి బెదిరింపులకు లొంగకుండా ఆలయ నిర్మాణం చేపట్టడం అంటే మామూలు విషయం కాదు.

కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాటలు కాస్త హాస్యంగా అనిపిస్తున్నాయి.500 నోట్లపై రాముని చిత్రాన్ని వేయాలి అనడం,సరే అదంతా మనకు అనవసరం ,మనం కేవలం భోజనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులోకి వెళ్ళి అక్కడ దొరికే ప్రత్యేక పదార్ధాలు తినడం గురించి కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం..

అయితే అక్కడికి వెళ్ళిన ,వెళ్తున్న వారికి భోజన విషయంలో చాలా అనుమానాలు, సందేహాలు ఉండడం సహజం,ఏం తినాలి, ఎక్కడ తినాలి అనే దాని పై ఒక అవగాహన కోసం, నిజానికి భక్తుల కోసం రామమందిరం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు, కానీ అయోధ్యలో తినే ప్రత్యేకమైన వంటకాల రుచి కూడా చూడాలి కాబట్టి అవేంటో తెల్సుకుందాం..

మీరు అయోధ్యకు వెళ్తున్నారా అదేనండి 22వ తారీకు రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వెళ్లాలని చాలామంది అనుకుంటారు ఇప్పటికే చాలామంది వెళ్లి కూడా ఉంటారు. వెళ్లడానికి టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారు కూడా ఉండే ఉంటారు కదా అందులోనూ మన ఆంధ్రావాళ్ళు ,తెలంగాణ వాళ్లు కాస్త భోజనం ప్రియులే. కాబట్టి భోజన ప్రియల కోసం అక్కడ మన వంటకాలు ఏమేమి దొరుకుతాయి ఏమేమి దొరకవు అని తెలుసుకోవాలి కదా అందుకోసమే మీకీ విషయాలు తెలియజేస్తున్నాను.

ఉత్తర భారతంలో అన్నం వాడకం తక్కువ ఎక్కువగా ఇక్కడ చపాతీలు లేదా కచోరి వంటి వంటకాలు దొరుకుతాయి. అలాగే ఇక్కడ రోటీలు కూడా ఉంటాయి కానీ ఆ రోటీలు చాలా మందంగా ఉంటాయి. మనం రోటి ఆర్డర్ ఇచ్చినప్పుడు రోటీతో పాటు వాళ్ళు శనగల కూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇస్తారు. ఇక్కడ వాళ్లు మనలాగా కారం ఎక్కువగా తినరు కారం తినే మనలాంటి దక్షిణ భారతీయులకు ఈ వంటకాలు అంతగా రుచించవు. అయితే ఇక్కడగా మరొక విషయం ఏమిటంటే మనం అన్నం కావాలి అని అనుకున్న అడిగినప్పుడు వాళ్లు ఒక చిన్న ప్లేట్ లో అన్నం వేసి శనగల కూర వేసి ఇస్తారు. అయితే ఆ అన్నం చాలా పొడిపొడిగా గట్టిగా ఉంటుంది అది వారికి టిఫిన్ లాగా అన్నమాట.

ఏ రైల్వేస్టేషన్లో చూసిన ఏ బస్టాండ్ లో చూసిన ఇలాంటి బండ్లు చాలా కనిపిస్తాయి. అసలైన ఆంధ్రా భోజనం లేదా తెలంగాణ భోజనం ఎక్కడ కనిపించదు. అక్కడికి వెళ్ళావంటే మనం భోజనం గురించి ఆలోచించకుండా కేవలం రాముని దర్శనం కోసమే వెళ్లాలి లేదా మన ఇంట్లో తయారు చేసుకుని నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకొని వెళ్ళాలి.

కాకపోతే అక్కడి తీపి పదార్థాలను కచ్చితంగా రుచి చూడాల్సిందే. ఎందుకంటే దక్షిణాది వారు తీపి పదార్థాలను చాలా తక్కువగా తింటారు. కానీ ఉత్తర భారతం వారు తీపి పదార్థాలను చాలా ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి అక్కడ తీపి పదార్థాలు తినడానికి భోజన ప్రియులు ఉత్సాహం చూపిస్తారు.

వీరికి తీపి అంటే మహా ఇష్టం. ఆ తీపిలో కూడా ప్రత్యేక వంటకాలను ఏ కల్తీ లేకుండా చేయడంలో వీరు సిద్ధహస్తులు.

ఉత్తర ప్రదేశ్ అంటేనే తీపికి పెట్టింది పేరు. స్వచ్ఛమైన నెయ్యితో స్వచ్ఛమైన పాలతో తయారు చేసే ఆహారానికి వీరు అధిక ప్రాధాన్యత ఇస్తారు.

మన దగ్గర ఉన్నట్టు పాలు కల్తీ గాని నెయ్యి కల్తీగానే ఉండకుండా చాలా స్వచ్ఛమైన వాటితో రకరకాల తీపి పదార్థాలు తయారు చేస్తారు.ఇక అసలు విషయానికి వస్తే అయోధ్య ఆధ్యాత్మికకే కాదు పసందైన వంటకాల కూడా పెట్టింది పేరు ఇక్కడ లభించే చిరుతిళ్ళు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి ఇక్కడ దాల్ కచోరి చాట్ రబ్ది దహీ బల్లావ్ వంటి వంటకాల పేరు చెబితే ఎవరైనా లొట్టలు వేయాల్సిందే.మీరు అయోధ్యకు వెళుతున్నప్పుడు కచ్చితంగా తినాల్సిన వంటకాలు కూడా ఇవే.

కేవలం స్వచ్ఛమైన పాలతో నెయ్యితో అలాగే అత్యంత అరుదైన కుంకుమ పువ్వుతో మీరు తీపి పదార్థాలను తయారు చేస్తారు.

దాల్ కచోరీ లో రకరకాల పప్పులను ఉపయోగించి చేస్తారు. ఇక తీపి పదార్థాలలో రండి ఒకటి. ఇది ఉత్తర భారతదేశ సాంప్రదాయ తీపి పదార్థం.

చిక్కటి పాలు చక్కెర యాలకులు డ్రైఫ్రూట్స్ తయారు చేసి రబ్బిని మాల్పువా గులాబ్ జామున్ జిలేబి పూరీలతో కలిపి తింటుంటే ఆ మజాయే వేరు అని ఇక్కడివారు అంటారు అలాగే ఇక్కడ వివిధ రకాల చాట్లు దొరుకుతాయి. ఒక్కో నగరంలో ఒక్కో తరహాలో చార్ట్లు తయారు చేస్తుంటారు అయోధ్యలో దొరికే చాట్ ను రుచి చూస్తే వావ్ అని ఉండలేరు

ఇది మిగతా చాట్ల కన్నా భిన్నంగా ఉంటుంది అయోధ్య చాట్ లో తీపి పులుపు చిక్ పీస్ పరిమళభరితమైన కొత్తిమీర మసాలా దినుసులు కలిపి తయారుచేస్తారు.

ఇక సాయంత్రం పూట అయోధ్యలో చాట్ల బండి దగ్గర విపరీతమైన గిరాకీ ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. దాల్ కచోరిని వీరు ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటారు దాల్ కచోరీలో మినప్పప్పు పెసరపప్పు కూరగాయలు వినియోగిస్తారు ఇవి చూడ్డానికి కొంచెం పూరీల అనిపిస్తాయి వీటిని చట్నీతో కలిపి తింటారు ఇది ఎంతో ఆరోగ్యకరమైన వంటకం ఉంటాయి.

అయోధ్యకు వెళ్ళిన వారికి ఎక్కడ చూసినా కనిపించే వంటకం దహీ బల్ల వివిధ రకాల పప్పులతో చేసిన వడలను పెరుగులో నానవేసి ఇస్తారు దీంట్లోకి తీపి పులుపు చెట్నీలు అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పాలి దక్షిణాది పెరుగులో బంగాళాదుంప ముక్కలు అప్పడాల మొక్కలు కూడా కలుపుతారు.

అయితే అయోధ్యలో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ వంటకాలలో ఎక్కడ ఉల్లి వెల్లుల్లి ఉపయోగించరు.

మీరు ఎప్పుడైనా పూరితో గులాబ్జామ్ కలిపి తిన్నారా అలాగే పూరితో మాల్పువా, జిలేబి కలిపి తిన్నారా, అవేం కాంబినేషన్స్ అంటారా అవును ఇక్కడ పూరి తో కలిపి గులాబ్ జామ్ జిలేబి తింటుంటే అదొక రకమైన రుచి మన నాలుక నుంచి విడిపోదు. అలా తిన్నక్షణం మీరు జీవితంలో మర్చిపోలేరు. అయితే ఇప్పటికే తిన్నవారు మాత్రం దాని రుచి మాకు తెలుసు అంటారా అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే , కాల్ వాయిస్ లో తయారుచేసే ఈ తీపి పదార్థాలు చాలా స్వచ్ఛమైనవి కాబట్టి రుచి వేరుగా ఉంటుంది. ఇంతకుముందే మీరు రుచి చూసినా కూడా ఇక్కడ తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది.

తీపి తినని వారికి ఇక్కడి నుంచి ఆహారాన్ని అది కూడా నిల్వ ఉండే ఆహారాన్ని తయారు చేసుకుని వెళ్లాల్సిందే ఎంత తీపి తిన్న కాస్త కారం తగలాలి కదా, అలాగే తీపి ఎక్కువగా తినని వారు కూడా ఒక్కసారి తింటే తప్పులేదు కావాలంటే వచ్చిన తర్వాత లేదా వెంట మెడిసిన్స్ తీసుకుని వెళ్ళండి కానీ ఇక్కడి పదార్థాలు రుచి చూడకుండా తిరిగి రావద్దు. అంత మంచి స్వచ్ఛమైన పదార్థాలు మరెక్కడ మనకు దొరకవు.

కాబట్టి మీరు అక్కడ తీపి పదార్థాలు తిన్నా కూడా మీరు వెంట తీసుకువెళ్లిన కారం పదార్థాలను అప్పుడప్పుడు తింటుంటే రుచి కోల్పోకుండా ఉంటారు. మనం వెళ్ళేది ఒక్కసారే కాబట్టి అక్కడ ఉన్న ప్రముఖమైన తీపి వంటకాలను కచ్చితంగా రుచి చూడాలి.

ఇక్కడ ఎక్కువగా కష్టపడి పనిచేసే వారే ఉండడంవల్ల వారికి రోటీలు శనగలు లేదా రాజ్మ వంటి కూరలనే ఎక్కువగా కనిపిస్తాయి భోజనశాలకు వెళ్లిన మనకు ఇవే పదార్థాలు కనిపిస్తాయి. రోటి తో పాటు కూర అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవ్వడం మామూలు విషయం ఎందుకంటే రోటీలు చెప్పగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి ఘాటుగా ఉంటుంది కాబట్టి అలా వాళ్ళు ఇస్తారు కానీ వాళ్ళు ఇచ్చిన పచ్చిమిర్చి కూడా అంత ఘాటుగా ఉండదు.

ఇక్కడ భోజనశాలలు అంటే రెస్టారెంట్లు కూడా ఉంటాయి అందులో కూడా రోటీ శనగ కూర లేదా రాజ్మా లాంటి బలవర్ధకమైన ఆహారాన్ని తింటారు మనం ఒకవేళ అన్నం అంటే రైస్ అడిగితే ముందు చెప్పినట్లుగా ఒక చిన్న ప్లేట్ లో అంటే మనం టిఫిన్ తినే ప్లేట్ లో అన్నం  వేసి దానిపైన కూర వేసి ఇస్తారు. ఆ అన్నం మింగడానికి మనకు చాలా కష్టపడాల్సి వస్తుంది అవి కూడా బాస్మతి రైస్ ఏ ఎక్కువగా ఉపయోగిస్తారు.

కానీ భోజనం ప్రియులకు ఇవన్నీ ఒక వింత అనుభవం లాగా ఉంటాయి. ముందు చెప్పినట్లు వివిధ రకాల చాట్లను మనం రుచి చూడవచ్చు అలాగే తీపి పదార్థాలను కూడా ఎక్కువగా  తినవచ్చు.

వేడివేడి జిలేబి, రసగుల్లా, దహీ బల్ల, దాల్ కచోరి లాంటివి ఒక్కసారి రుచి చూస్తే జీవితంలో మర్చిపోలేరు.

అందువల్ల అయోధ్య వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఈ వంటకాలు అన్నిటిని రుచి చూసి రావాల్సిందే. ఇక్కడి మనుషులు కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుతారు మన భాష వారికి అర్థం కాకపోయినా వారి భాష మన మనకు అర్థం కాకపోయినా ఆకలికి భాషతో సంబంధం లేదు కదా కాబట్టి మీకు నచ్చిన పదార్థాలను కడుపునిండా తిని కంటి నిండా అయోధ్య రామయ్య దర్శనం చేసుకొని ఆ జ్ఞాపకాలు అన్నిటినీ మదిలో నింపుకొని తిరిగి ప్రయాణం అవ్వండి. జైశ్రీరామ్ నామాన్ని జపిస్తూ ఆ నెలలో అడుగు పెట్టండి. నేలలో అడుగుపెట్టిన క్షణం నుంచి మీకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

తిరిగి ఇంటికి వెళ్లాలనే ఆలోచన మీకు రాదు. భోజనం ప్రియులకు ఒక విధంగా అయోధ్య మంచి ఆహారాన్ని అందించడంలో ముందు ఉంటుంది. ఉత్తర భారతదేశం వారు తీపిని ఎక్కువగా ఇష్టపడతారు అలాగే కారం తక్కువగా తింటారు అనేది గుర్తుంచుకొని ఖచ్చితంగా మీరు వేడి వేడి జిలేబి అది కూడా పూరితో కలిపి తింటుంటే వచ్చే ఆనందం వర్ణనాతీతం.

జిహ్వచాపల్యం ఉన్నవారికి ఇదొక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకోండి. తిరిగి రావడం గురించి ఆలోచించకుండా అక్కడి పదార్థాలను ఎలా తినాలి అని ఎప్పుడు ఏది తినాలి అని ఒక ప్రణాళిక వేసుకొని తినండి.

చాట్ల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. అయోధ్యలో దొరికే చాట్లు చాలా రుచికరంగా ఉంటాయి. అది మన దగ్గర దొరకవు అవి కూడా చాలా పోషక విలువలతో బలవర్ధకమైన ఆహారంమే కాబట్టి చాట్లు కూడా మీరు వెళ్లిన ప్రదేశాలలో రుచి చూడండి.

కాబట్టి రామ దర్శనం తో పాటు భోజన ప్రత్యేకతలు కూడా తెలుసుకొని చూసి వచ్చి మీ అనుభవాలను మీ వాళ్లతో పంచుకుంటారని ఆశిస్తూ.. జై శ్రీరామ్

Show More
Back to top button