
ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా టెక్నాలజీ ఎంతగానో మారింది. వ్యక్తిగత అవసరాలతో పాటు ఆఫీసు వర్క్ విషయంలో కూడా మొబైల్, కంప్యూటర్ వాడకం అలవాటుగా మారింది. గంటల తరబడి మొబైల్, కంప్యూటర్ చూడడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. తీవ్రమైన తలనొప్పి, వెన్ను, మెడ , భుజం నొప్పులు, కళ్లు పొడిగా మారడం, కంటిపై ఒత్తిడి, కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో దురద సమస్యలు తరచుగా వస్తాయట. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టచ్చంటున్నారు నిపుణులు.
.కంప్యూటర్ పనిలో నిమగ్నమయ్యే వారు తప్పని సరిగా యాంటి రిఫ్లెక్ట్లింగ్ కోటింగ్ గ్లాసెస్ వాడాలి. కంప్యూటర్ స్క్రీన్‌ను అదేపనిగా చూడకుండా.. కళ్లకు అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటి రెప్పలను కొడుతూ ఉండాలి. దీంతో కళ్లు పూర్తిగా పొడిగా మారకుండా తేమతో ఉంటాయి. గంటకి ఒకసారైనా రెండు కళ్లను మూసుకుని గాలిని పీల్చుకుంటూ ఉండాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్ ముందు సరిగ్గా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. సరైన రీతిలో కూర్చోక పోతే నడుము, మెడ నొప్పులు వస్తాయి. వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. వీటితో పాటు రోజూ.. వ్యాయామం చేయడం, నడుము, మెడకు సంబంధించిన వర్కవుట్లు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
మొబైల్ వాడే వారు కూడా ఈ చిట్కాలను పాటించాలని, లేకపోతే తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోక తప్పదు.