Telugu Special Stories

రాజకీయాల్లో సినీ తారలు ప్రభావం ఎంతవరకు..?

దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలను తారుమారు చేసే రంగాల్లో సినీ తారలు రంగం ఒకటి. అటువంటి సినీరంగాల్లో నటులు రాజకీయ పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. ఆ పార్టీలే రాజకీయాలను తారుమారు చేస్తుంటాయి. అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ నటులు చేరి రాణించడం తరతరాలుగా వస్తుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నందమూరి తారక రామారావు గురించి. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి.. తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు సేవలందించారు. ఆయన స్థాపించిన పార్టీలో అప్పుడు అనేకమంది సినీ తారలు చేరి.. రాజకీయాల్లో కూడా రాణించారు. ఇప్పటికీ వారిలో రాజకీయ నాయకులుగా స్థిరపడ్డవారు కొందరు ఉన్నారు. ఇక కేంద్రంలో 1989 సంవత్సరంలో నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బహుశా..! ఆయన బతికున్నట్లైతే దేవెగౌడ స్థానంలో ఆయనే ప్రధాన మంత్రి పదవి చేపట్టి ఉండేవారని తెలుగు రాష్ట్ర ప్రజలు భావించారు. ఇకపోతే ఆయన 1996లో మరణించడంతో.. మరికొంత మంది నటులు రాజకీయాల్లో రంగ ప్రవేశం చేశారు. అయితే, వారు ఎన్.టి రామారావు లాగా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు.

అసలు ఎవరు ఆ టాలీవుడ్ నటులు? ఎంతవరకు రాష్ట్ర రాజకీయాల్లో తమ పాత్ర కొనసాగించారో.. వివరంగా తెలుసుకుందాం.

చిరంజీవి: ఈయన 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు, బావమరిది, అరవింద్ ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయనకు 293 స్థానాలకుగాను 18 సీట్లే వచ్చాయి. దీంతో కేంద్రంలో 2012 నుంచి 2014 వరకు టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

మోహన్‌బాబు: టీడీపీలో ఎన్టీఆర్ స్పూర్తితో మోహన్‌బాబు రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ తరపున మోహన్‌బాబు ఎంపిగా ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆ కుటుంబంంతో బంధుత్వం ఏర్పడింది. రాజకీయాలకు మోహన్‌బాబు కొంత దూరంగా ఉన్నట్టు కన్పిస్తోంది.

బాలకృష్ణ: బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే. 2014లో టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. గతంలో తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

పవన్ కళ్యాణ్: ఈయన 2014 ఎన్నికలకు ముందే జనసేన పార్టీని ఏర్పాటు చేశారు.

అయితే, జనసేనను ఏర్పాటు చేసినప్పటికీ  తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు.

కొంతకాలనికి ఆ పార్టీలతో విభేదాలు రావడంతో 2019 ఎన్నికల్లో బీఎస్‌పీతో కలిసి రెండు స్థానాల్లో నిలబడ్డారు.కానీ, ఆయన రెండు స్థానాల్లో ఓడిపోయారు.

అయితే, పవన్ కళ్యాణ్ మళ్లీ 2024 ఎన్నికల్లో తనని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని భావించి, వారాహి యాత్రలో జనం ముందు వెళ్లి ప్రచారాలు మొదలు పెట్టారు.

ఏది ఏమైనప్పటికీ.. ఈసారైన ప్రజలు పవన్‌కి అధికారం ఇస్తారో లేదో వేచి చూద్దాం.

చంద్రబాబు: 1996లో ఎన్టీఆర్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన అల్లుడు ఎన్. చంద్రబాబు నాయుడు ఆయనను అధికారం నుంచి దింపిన కొద్ది నెలలకే రాజకీయ వారసుడిగా ఎదిగారు.

దీంతో కొందరు దాన్ని ఎన్.టి రామారావుకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అంటారు.

మరికొందరు పార్టీని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణించుకుంటారు. ఏది ఏమైనా తాను పోటీ చేసే.. 2024 ఎన్నికలే చివరిదని ఆయన పలుమార్లు చెప్పారు.

ఇక 2009లో కొంతకాలం టీడీపీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆయన ప్రచారానికి తెరపడింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

కాకపోతే 2019 ఎన్నికల్లో తగ్గిన టీడీపీ ప్రభావం, మళ్లీ పునః వైభవం రావాలంటే ఎన్టీఆర్‌ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ఏదీ ఏమైనప్పటికీ ప్రస్తుత తరం సినీ నటులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశాయి, చేస్తూనే.. ఉన్నాయి.

Show More
Back to top button