HEALTH & LIFESTYLE

బీ అలర్ట్: విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు.. 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ జ్వరాలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. అయితే సాధారణంగా ఇవి వర్షాకాలం ప్రారంభం కాగానే వస్తాయి. ఎందుకంటే.. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవుల వ్యాప్తికి అనుకూలంగా మారుతుంది. దీని ఫలితంగా రకరకాల వైరల్ జ్వరాలు ప్రబలుతాయి.

ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా వైరల్ ఫీవర్ లక్షణాలు శరీర ఉష్ణోగ్రత పెరగడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ముక్కు కారడం, వాంతులు, విరేచనాలు, అలసట, కళ్లు తిరగడం వంటివి. ఈ లక్షణాలు వైరస్ రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ జ్వరాలు మూడు రోజుల నుంచి రెండు వారాల వరకు వేధించవచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.  

జాగ్రత్తలు

* జ్వరం ఉన్నన్ని రోజులు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. 

* తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థపై భారం పడకుండా చూసుకోవచ్చు.

* నిమ్మరసం, తేనె వంటివి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే, వ్యక్తిగత శుభ్రత పాటించడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

* నీటిని నిల్వ ఉండనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం, దోమలు రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం ముఖ్యం. కొన్ని రకాల జ్వరాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి కాబట్టి, జ్వరం ఉన్న వ్యక్తులు ఇతరులతో దగ్గరి సంబంధాన్ని తగ్గించుకోవాలి.

* ఈ జాగ్రత్తలన్నీ పాటించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాల నుంచి రక్షణ పొందవచ్చు. ఎటువంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకోవచ్చు.

Show More
Back to top button