HEALTH & LIFESTYLE

అలర్ట్: ఈ కాలంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఈ సీజన్‌లో జలుబు, జ్వరం, దగ్గు, కండరాల నొప్పులు వంటి రుగ్మతలు కామన్. ఇవే ఒక్కోసారి ప్రమాదంలోకి నెట్టేస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుండి రిలీఫ్ పొందవచ్చు. ఇంట్లో గాని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీటి నిల్వ ఉండటంతో దోమలు చేరి, అవి కుట్టడం వల్ల ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడతాం. దీంతో మలేరియా ఆశించే ప్రమాదం ఉంది. ఇంటిలో తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఫంగస్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ కాలంలో చల్లటి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో వంటిని శుభ్రం చేసుకోవాలి. వర్షంలో తడిస్తే మాత్రం తల స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే జుట్టు సమస్యలు, దుర్వాసన, చుండ్రు వంటివి రాకుండా నివారించవచ్చు.

ఈ కాలంలో గోరువెచ్చటి నీటిని తాగడం మంచిది. కలుషిత నీరు తాగితే కామెర్లు, టైఫాయిడ్ వంటి రోగాలు బారినపడే ప్రమాదం ఉంది. కాచి చల్లార్చిన నీటిని తీసుకోండి. జలుబు, జ్వరం, తలనొప్పి వంటి రుగ్మతలు వస్తే సాధ్యమైనంత వరకూ డాక్టర్లను సంప్రదించడం మంచిది. పిల్లలు ఎక్కువగా బయట తిరగకుండా చూసుకోవాలి. ఈ కాలంలో కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. ఈ సీజన్ టైంలో దోమల బెడద ఎక్కువ. కాబట్టి వాటినుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం శ్రేయస్కరం. ఈ సీజన్‌లో పిల్లలు, గర్భిణులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.

Show More
Back to top button