Telugu News

ఏ వయసులో ఇన్వెస్ట్ చేస్తున్నారు..!

మనకు వచ్చే రాబడి అనేది మనం ఎందులో పెట్టుబడి పెడుతున్నాం అనే దాని మీదే కాదు, ఎప్పుడు పెట్టుబడి పెడుతున్నాం అనే విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. రిటర్న్స్ ఎక్కువగా ఉండాలంటే వీలైనంత చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 25 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రారంభించిన వ్యక్తికి, 35 ఏళ్ల వయసులో ప్రారంభించిన వ్యక్తికి మధ్య వచ్చే లాభాల్లో తేడా చాలా ఎక్కువగా ఉంటుంది.

దీనిని ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. రవి, వాసు అనే ఇద్దరు స్నేహితులు తమ 65వ ఏట రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వాసు తన 25వ ఏట నుంచే పెట్టుబడి ప్రారంభించగా, రవి మాత్రం 35 ఏళ్లు వచ్చాక ప్రారంభించాడు. వారు రిటైర్ అయ్యే సమయానికి వారి రాబడిలో భారీ వ్యత్యాసం ఉంది.

వీరిద్దరూ 12% వార్షిక రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ. 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేశారు.

వాసు: 25 ఏళ్లకే ప్రారంభించినందుకు 40 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాడు. తను పెట్టిన మొత్తం రూ. 48 లక్షలు కాగా, 65వ ఏట అతనికి లభించే మొత్తం సుమారు రూ. 11.8 కోట్లు. 

రవి: 35 ఏళ్ల నుండి ప్రారంభించినందుకు 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాడు. తను పెట్టిన మొత్తం రూ.36 లక్షలు కాగా, అతనికి లభించే మొత్తం సుమారు రూ. 3.5 కోట్లు.

కేవలం 10 ఏళ్ల ముందుగా ప్రారంభించడం వల్ల వాసు, రవి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ డబ్బును జమ చేయగలిగాడు. దీనినే ‘కాంపౌండింగ్ మ్యాజిక్’ అంటారు. పెట్టుబడి కాలం ఎంత ఎక్కువగా ఉంటే, చక్రవడ్డీ వల్ల వచ్చే లాభం అంత అద్భుతంగా ఉంటుంది.

Show More
Back to top button