HEALTH & LIFESTYLE

నోరు తెరిచి నిద్రపోవడం- వైద్యులు ఏమంటున్నారు?

నిద్రలో నోరు తెరిచి ఉంచడం అనేది చాలా మందిలో కనిపించే అలవాటు. దీనిపై ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మరియు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని వైద్య నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. వారి ప్రకారం, చాలా సందర్భాలలో ఇది సాధారణమే అయినా, కొన్ని పరిస్థితులలో ఇది ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

ముక్కులో ఏదైనా అడ్డంకులు ఉన్నప్పుడు లేదా జలుబు చేసినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా, పిల్లల్లో టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ పెద్దవిగా ఉండటం వల్ల ఈ అలవాటు కనిపిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఈ సమస్య తగ్గిపోతుంది. అయితే, సెప్టమ్ కార్టిలేజ్ వంకరగా ఉన్నప్పుడు (దీనిని డీవియేటెడ్ నాసల్ సెప్టం లేదా DNS అంటారు), నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నోరు తెరిచి నిద్రపోతున్నప్పుడు గురక వంటి శబ్దాలు వినిపిస్తే, అది స్లీప్ అప్నియా వంటి సమస్యలకు సంకేతం కావొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అటువంటి సందర్భంలో, నోటి పరిశుభ్రత దెబ్బతినే అవకాశం కూడా ఉంది కాబట్టి, ENT నిపుణుడిని సంప్రదించడం మంచిది.

Show More
Back to top button