CINEMATelugu Cinema

మెకానిక్ రాకీ మూవీ రివ్యూ

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌. ఇప్పటికే ఈ ఏడాదిలో గామి, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రాలతో ప్రేక్షలను అలరించిన విశ్వక్‌.. ఇప్పుడు మెకానిక్‌ రాకీ అంటూ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈరోజు (నవంబర్ 22న) వచ్చేశాడు. మరి తనకి ఈ మూవీతో అదృష్టం వరించిందా..? లేదా అంటే రివ్యూ చూసేయాల్సిందే.

కథ..

అల్లరి చిల్లరిగా తిరిగే రాకీ (విశ్వక్ సేన్) బీటెక్‌ మధ్యలోనే ఆపేస్తాడు. చదువుపై ధ్యాసలేదని గమనించిన రాకీ తండ్రి రామకృష్ణ (నరేష్).. తన స్వశక్తితో డెవలప్ చేసి కార్ గ్యారేజ్‌లోనే రాకీని మెకానిక్‌గా పెడతాడు. కేవలం మెకానిక్‌గానే కాకుండా.. డ్రైవింగ్ స్కూల్‌ని నడిపిస్తుంటాడు రాకీ. అలా తన దగ్గరకు డ్రైవింగ్ కోసం ప్రియ (మీనాక్షి చౌదరి), మాయ (శ్రద్ధా దాస్)లు వస్తారు. కాలేజ్ రోజుల్లో రాకీ, ప్రియ ప్రేమించుకుంటారు. తన మిత్రుడు శేఖర్ (విశ్వదేవ్ రాచకొండ) చెల్లెలైన ప్రియని అనూహ్య పరిణామాలతో దూరం చేసుకుంటాడు రాకీ. మళ్లీ డ్రైవింగ్ స్కూల్‌లో ప్రియను కలుసుకున్న రాకీ.. ఆమె అన్న శేఖర్ చనిపోయిన విషయాన్ని తెలుసుకుంటాడు. శేఖర్ చావుతో కథలో మలుపు ఏంటి? అసలు శేఖర్ ఎందుకు చనిపోయాడు? దానికి కారణం ఎవ్వరు? వాళ్లని రాకీ ఎలా వలవేసి పట్టుకున్నాడు? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

మొదట్లో కనిపించిన ముక్కోణపు ప్రేమకథ కాస్తా.. సెంకండాఫ్‌కి వచ్చేసరికి సైబర్ నేరం చుట్టు అల్లిన థ్రిల్లర్ కథగా మారిపోతుంది. కొన్ని ట్విస్టులను ముందే ఊహించొచ్చు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. నేటి తరం యువత చేస్తున్న ఓ పెద్ద తప్పిదాన్ని చూపించడం, ఆన్‌లైన్ మోసాలు కళ్లకు కట్టినట్లు చూపించడం ఈ మూవీకి ప్లస్ పాయింట్స్‌గా చెప్పవచ్చు. స్క్రీన్‌ ప్లే కాస్త మారి ఉంటే, ఎడిటింగ్‌కి కూడా మంచి మార్కులే పడేవి. స్క్రీన్‌ ప్లే కారణంగా ఫస్టాఫ్లో ఎడిటింగ్‌ మైనస్‌‌గా చెప్పవచ్చు.

రేటింగ్: 2.5/5

Show More
Back to top button