ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ.. పుష్ప.. ది రూల్.. ఇప్పుడు బాక్సాఫీస్ ను పలకరించడానికి వచ్చేసింది. దాదాపు మూడేళ్లక్రితం విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ కు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్’ వస్తుండటంతో దీనిపై అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన మూవీ ప్రచార చిత్రాలు, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. మూవీపై హైప్ పెరిగింది. ఇకపోతే ఈ సినిమాను మొదట్లో ఒక సినిమాగానే తీసుకొద్దామని అనుకున్నారట. కానీ, సుకుమార్ స్క్రిప్ట్ ప్రకారం మూడున్నర గంటల పుటేజ్ రావడంతో.. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేద్దామని భావించారట. అలా అప్పటివరకూ తీసిన సినిమాను ఎడిట్ చేసి ‘పుప్పు 1: ది రైజ్ గా విడుదల చేయగా.. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ‘పుష్ప 2: ది రూల్’ వచ్చింది.
*అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా ఇది. 2001లో మొదటి సినిమా ఆర్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆర్య 2, పుష్ప ది రైజ్ లు రాగా… ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయ్యింది.
*ఈ సినిమా కోసం అల్లుఅర్జున్ ఏకంగా రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల జాబితాలో బన్నీ మొదటి స్థానంలో నిలిచారని ఇటీవల ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ సైతం ప్రకటించింది.
*ఈ సినిమాలో చేసిన గంగమ్మతల్లి జాతర సీక్వెన్స్ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ అని తెలియగా.. ఇందులో బన్నీ మాతంగి వేషంలో కనిపించే సీక్వెన్స్ కోసం ఏకంగా రూ. 60 కోట్లు ఖర్చు పెట్టారట. దాదాపు ఈ సీక్వెన్స్ ను 30 రోజులపాటు షూట్ చేయాల్సి వచ్చిందట.
*హీరోయిన్ రష్మిక.. శ్రీవల్లిగా, పుష్పరాజ్ భార్యగా కీ రోల్ లో కనిపించనున్నారు. పార్ట్ 1తో పోలిస్తే, ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని మూవీ రిలీజ్ కు ముందు ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం రష్మిక రూ.10 కోట్ల పారితోషికం తీసుకున్నారట.
*ఇకపోతే సినిమాలో మరో హైలెట్ అండ్ మెయిన్ విలన్ రోల్ కం పోలీస్ ఆఫీసర్ ఫహద్ ఫాజిల్ చేసిన భన్వర్ సింగ్ షెకావత్.. పార్ట్-1లో ఆయన పాత్ర నిడివి తక్కువ. కానీ పార్ట్-2లో స్క్రీన్ టైమింగ్ తో పాటు నటన బాగుంటుందని టాక్.
*ఇక స్పెషల్ సాంగ్ కోసం పుష్ప 1లో ఊ అంటావా.. మావా.. అంటూ సమంత మాస్ రచ్చ చేయగా. ఇక ఈసారి ఆ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించగా.. ‘కిస్సిక్’ అంటూ ఆమె బన్నీతో కలిసి చేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ పాట కోసం శ్రీలీల రూ.2 కోట్లు తీసుకున్నారట.
*పుష్ప ది రూల్ నిడివి సరిగా 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అత్యధిక నిడివి గల తెలుగు మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ చేరింది.
*ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ రికార్డు సృష్టించింది. విడుదలకు ముందు ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ‘పుష్ప 2’.. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏకంగా రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
కాగా ఈ సినిమా గురువారం విడుదల కానుండగా.. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలతో ‘పుష్ప’ రాజ్ సందడి ప్రారంభమైంది.
*దర్శకుడు సుకుమార్ ఈసారి అల్లు అర్జున్ ను ఏ రేంజ్లో చూపించి ఉంటారా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రచార చిత్రాలు, పాటలు చిత్ర అంచనాలు రెట్టింపు చేశాయి. అందుకే బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే టికెట్లు శరవేగంగా అమ్ముడుపోయాయి.
*80 దేశాల్లో, 6 భాషల్లో, 12వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ మూవీ రాబోతున్న తొలి సినిమాగానూ పేరు తెచ్చుకుంది.