యాక్టర్ నాని నుంచి యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రం సరిపోదా శనివారం. దీనికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నేడు (ఆగస్టు 29న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో.. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
సూర్య (నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువగా ఉంటుంది. అతని కోపాన్ని కంట్రోల్ పెట్టడానికి తన తల్లి ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు సూర్య కోపానికి తగ్గించడానికి పరిష్కారంగా వారంలో ఆరు రోజులు ప్రశాంతంగా వుంటూ, ఒక్క శనివారం రోజు మాత్రమే కోపాన్ని సూర్య(నాని) చూపిస్తూ ఉంటాడు. చనిపోయిన తన తల్లికి ఇచ్చిన వాగ్దానం కారణంగా సూర్య కూడా శనివారం ఒక్కరోజు మాత్రమే గొడవలు పడుతూ ఉంటాడు.
అయితే, ఈ మధ్యలో క్రూరమైన పోలీసు అధికారి దయా (ఎస్‌జే సూర్య) నాని ఉంటుంన్న ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను తన అధికార బలంతో పట్టి పీడిస్తుంటాడు. వారిని దారుణంగా హింసిస్తూ ఉంటాడు. దీంతో ఆ ప్రజలను కాపాడాలని నాని ఫిక్స్ అయ్యి దయాను ఏం చేశాడు?అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ : వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్, నేచురల్ లుక్స్ తో నాని సినిమాకే హైలైట్ గా నిలిచాయి. దీంతోపాటు హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్, పోలీస్‌గా నటించిన ఎస్.జె.సూర్య యాక్షన్ మూవీకి ప్లెస్ పాయింట్స్‌గా నిలిచాయి. అక్కడ అక్కడ కొన్ని సీన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి.
మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల బోర్‌గా అనిపించడం, హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ కథ బలంగా లేకపోవడం సినీమాకి కొంత మైనస్ అని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే పెద్దగా అనిపించకపోవడం కూడా సినిమాకి కొంతమేర మైనస్ పాయింట్స్‌గా చెప్పవచ్చు.
గమనిక: ఈ రివ్యూ ప్రేక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది కేవలం ప్రేక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
రేటింగ్ 2.75/5